భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో రెండోరోజు ఆట ప్రారంభమైంది.
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో రెండోరోజు ఆట ప్రారంభమైంది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన టిమిండియా 321 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
అజింక్య రహానే(81) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. హాజల్‌వుడ్ బౌలింగ్ లో హాడిన్ కు క్యాచ్ ఇచ్చి రహానే అవుటయ్యాడు. తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ 328 పరుగుల జట్టు స్కోరు వద్ద అవుటయ్యాడు. వాట్సన్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు.