ఓ పనైపోయింది! | India's victory in the second ODI | Sakshi
Sakshi News home page

ఓ పనైపోయింది!

Published Mon, Jul 13 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ఓ పనైపోయింది!

ఓ పనైపోయింది!

రెండో వన్డేలోనూ భారత్ గెలుపు
♦ జింబాబ్వేపై 2-0తో సిరీస్ వశం
♦ రాణించిన విజయ్, రహానే, రాయుడు
 
 తొలి వన్డేలో తడబడ్డా... రెండో వన్డేలో భారత కుర్రాళ్లు సత్తా చూపించారు. అన్ని రంగాల్లోనూ జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం కనబరిచి అద్భుత విజయంతో సిరీస్‌ను గెలుచుకున్నారు. ఇక నామమాత్రపు చివరి వన్డేలో మిగిలిన రిజర్వ్‌లనూ పరిశీలిస్తే సరిపోతుంది.
 
 హరారే : జింబాబ్వేపై సిరీస్ గెలవడానికి భారత్‌కు ద్వితీయ శ్రేణి జట్టు సరిపోయింది. రెండో వన్డేలోనే సిరీస్ గెలిచి రహానే సేన ఓ పని పూర్తి చేసింది. మురళీ విజయ్ (95 బంతుల్లో 72; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రహానే (83 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ గెలిచి ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో రాయుడు (50 బంతుల్లో 41; 3 ఫోర్లు) ఫామ్‌ను కొనసాగించగా, మనోజ్ తివారీ (26 బంతుల్లో 22; 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. విజయ్, రహానే తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నిలకడగా ఆడిన రాయుడు... విజయ్‌తో కలిసి రెండో వికెట్‌కు 47; తివారీతో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. చివర్లో బిన్నీ, జాదవ్ (16) ఆరో వికెట్‌కు 17 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో ప్రత్యర్థి ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. మద్జీవా 4 వికెట్లు తీశాడు.

 తర్వాత జింబాబ్వే 49 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటై ఓడింది. చిబాబా (100 బంతుల్లో 72; 9 ఫోర్లు) టాప్ స్కోరర్. ముత్తుబామి (32), క్రెమెర్ (27), సీన్ విలియమ్స్ (20)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వేకు సరైన ఆరంభం లభించలేదు. విలియమ్స్‌తో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన చిబాబా... రజా (18)తో ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఓ దశలో ఆతిథ్య జట్టు 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ముత్తుబామి, క్రెమెర్‌లు ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించినా... రన్‌రేట్ పెరిగిపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భువనేశ్వర్ 4 వికెట్లు తీశాడు. మురళీ విజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరుగుతుంది.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) రజా (బి) చిబాబా 63; విజయ్ (సి) సబ్ వాలర్ (బి) మద్జీవా 72; రాయుడు (సి) సబ్ వాలర్ (బి) రజా 41; తివారీ (సి) విటోరి (బి) తిరిపానో 22; ఉతప్ప (బి) మద్జీవా 13; బిన్నీ (సి) రజా (బి) విటోరి 25; జాదవ్ (సి) ముత్తుబామి (బి) మద్జీవా 16; హర్భజన్ నాటౌట్ 5; అక్షర్ పటేల్ (సి) రజా (బి) మద్జీవా 1; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 271.
 వికెట్ల పతనం: 1-112; 2-159; 3-203; 4-205; 5-233; 6-264; 7-266; 8-269. బౌలింగ్: విటోరి 8-0-47-1; తిరిపానో 9-0-42-1; మద్జీవా 10-0-49-4; విలియమ్స్ 5-0-23-0; క్రెమెర్ 5-0-32-0; చిబాబా 5-0-27-1; మసకద్జా 4-0-26-0; సికిందర్ రజా 4-0-25-1.
 జింబాబ్వే ఇన్నింగ్స్: సిబండా (సి) విజయ్ (బి) ధవల్ 2; చిబాబా రనౌట్ 72; మసకద్జా (సి) ఉతప్ప (బి) భువనేశ్వర్ 5; చిగుంబురా (సి) రహానే (బి) భువనేశ్వర్ 9; సీన్ విలియమ్స్ (బి) అక్షర్ 20; రజా (సి) ఉతప్ప (బి) హర్భజన్ 18; ముత్తుబామి (సి) అక్షర్ (బి) బిన్నీ 32; క్రెమెర్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 27; మద్జీవా రనౌట్ 0; తిరిపానో (సి) అక్షర్ (బి) భువనేశ్వర్ 6; విటోరి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్) 209.
 వికెట్ల పతనం: 1-24; 2-31; 3-43; 4-95; 5-130; 6-132; 7-184; 8-186; 9-195, 10-209.
 బౌలింగ్: భువనేశ్వర్ 10-3-33-4; ధవల్ 9-1-39-1; హర్భజన్ 10-0-29-1; బిన్నీ 7-0-42-1; అక్షర్ పటేల్ 10-1-40-1; విజయ్ 3-0-18-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement