రహానే @ 2000! | 2000 Runs for Rahane in Tests | Sakshi
Sakshi News home page

రహానే @ 2000!

Published Sat, Oct 8 2016 2:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

రహానే @ 2000!

రహానే @ 2000!

ఇండోర్: భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే టెస్టు క్రికెట్ లో రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఈ టెస్టు మ్యాచ్ కు ముందు ఈ ఘనతను చేరుకోవడానికి రెండు పరుగుల దూరంలో ఉన్న రహానే దాన్ని పూర్తి చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో రెండు వేలకు పైగా పరుగులు సాధించిన 36వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు.

ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మురళీ విజయ్(10)తొలి వికెట్ గా అవుటైన తరువాత, రెండేళ్ల తరువాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న గౌతం గంభీర్(29;53 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే గంభీర్ టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా బౌల్ట్ వేసిన చక్కటి బంతికి  వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం చటేశ్వర పూజారా(41;108 బంతుల్లో 6 ఫోర్లు) నిలకడగా ఆడాడు. దాంతో టీ విరామానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement