కెప్టెన్ కోహ్లీ శతక్కొట్టాడు! | virat kohli hits a ton and rahane class again | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 8 2016 8:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో శతకం చేశాడు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కోహ్లీ, అజింక్యా రహానే(172 బంతుల్లో 79 నాటౌట్: 9 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్ కు అభేద్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement