
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్–కటక్ (07581/07582) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment