కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్
భువనేశ్వర్: కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కి వ్యతిరేకంగా ఆయన కోడలు ఫిర్యాదు చేసింది. ఎంపీతో పాటు ఆయన భార్య మహాశ్వేతా దేవి, కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్లు భోపాల్ మహిళా పోలీస్ ఠాణాలో గురువారం ఫిర్యాదు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ కుటుంబ సభ్యులకు తాఖీదులు జారీ చేశారు.
2016 డిసెంబర్ 12న ఎంపీ కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్, భోపాల్‌కి చెందిన సాక్షితో వివాహం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక 2018లో సాక్షి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం న్యూఢిల్లీలోని ఇంట్లో ఉండేందుకు సాక్షిని అనుమతించాలని ప్రత్యర్థులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మెట్టినింటిలో ఉండేందుకు సాక్షి చేసిన ప్రయత్నాలు నిర్వీర్యం కావడంతో భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment