సంక్రాంతి వేడుకల్లో తొక్కిసలాట.. ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు | Odisha Cuttack Makar Sankranti Celebration Stampede Many Injured | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వేడుకల్లో తొక్కిసలాట.. ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Published Sat, Jan 14 2023 8:58 PM | Last Updated on Sat, Jan 14 2023 9:02 PM

Odisha Cuttack Makar Sankranti Celebration Stampede Many Injured - Sakshi

భువనేశ్వర్: ఒడిశా కటక్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బడాంబ- గోపినాథ్‌పుర్ టీ-బ్రిడ్జిపైకి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇక్కడ భారీ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‍సభ సభ్యత్వం రద్దు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement