
కటక్ : వైద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని లైంగికంగా వేధించిన ముగ్గురు అధ్యాపకులపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్న మేరకు వివరాల మేరకు.. ఒడిశాలోని ఎస్‌జీబీ మెడికల్ కాలేజ్‌లో జార్ఖండ్‌కు చెందిన ఒక అమ్మాయి రెండో ఏడాది వైద్య విద్యను అభ్యసిస్తోంది. తమకు పడక సుఖాన్ని అందిస్తే.. పరీక్షల్లో మంచి మార్కులు వేస్తామని.. అసోసియేట్ ప్రొఫెసర్, డెంటల్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి, మరో వ్యక్తి విద్యార్థిని కొంత కాలంగా లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై ఐపీసీ 354, ఐపీసీ 354ఏ, ఐపీసీ 294, ఐపీసీ 323 కేసులు నమోదు చేసినట్లు ఆయన పోలీసులు ప్రకటించారు. నిందుతులను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని కటక్ పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment