గొడవపడి మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే.. | Couple Jumps Into Mahanadi River After In Cuttuck | Sakshi
Sakshi News home page

గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..

Published Sat, Jun 5 2021 9:27 AM | Last Updated on Sat, Jun 5 2021 9:29 AM

Couple Jumps Into Mahanadi River After In Cuttuck - Sakshi

దంపతులను కాపాడి నది ఒడ్డుకు చేర్చిన సహాయక సిబ్బంది

భువనేశ్వర్‌/ కటక్‌: కటక్‌ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు  అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి  ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య  స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి  మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.

చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం
చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement