attempt to commit suicide
-
గొడవపడి మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..
భువనేశ్వర్/ కటక్: కటక్ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది. చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం
గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్లలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రత్యూష, దుర్గ అనే విద్యార్థినులను గోపిరెడ్డి, శివసత్యనారాయణలు ప్రేమించారు. ఆడపిల్లలు ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన మైనర్లు. ఇంటర్ చదువుతున్నారు. గోపిరెడ్డి విద్యార్థి అని, శివసత్యనారాయణ ఏ పనీలేకుండా తిరుగుతుంటాడని తెలుస్తోంది. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో కలిసి చనిపోవాలని నలుగురూ అనుకున్నారు. బాపట్ల శివారులోకి వెళ్లి నలుగురూ పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వాహనం వెంటనే వచ్చి వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రత్యూష, దుర్గ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. **