![Gudivada Amarnath Meets With Aswini Veshnav At katak - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/4/minister.jpg.webp?itok=5-1PvfLS)
భువనేశ్వర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆదివారం కటక్‌లో మంత్రి అమర్నాథ్ సమావేశమయ్యారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
రైలు ప్రమాద క్షతగాత్రులకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కాల్ సెంటర్లు నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు.
చదవండి: ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది?
అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. . కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందినవారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.
కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు.
చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
Comments
Please login to add a commentAdd a comment