న్యూఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా ఘటన మానవ తప్పిదమా? లేక మరేదైనా అన్న కోణంలో జరిగిందా అనే దానిపై సీబీఐ విచారించనుంది.
అయితే సిగ్నల్ మారడం వెనక కుట్ర అందని అధికారులు అనుమానిస్తున్నారు. కోరమాండల్‌ను కావాలనే లూప్‌లైన్‌లోకి మార్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బహనాగ స్టేషన్ మేనేజర్‌ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో ఎవరో మార్పులు చేశారని రైల్వే మంత్రి ఇంతకుముందే పేర్కొన్నారు. ఎలక్టానిక్ సిగ్నల్ పాయింట్‌లో మార్పులు జరిగాయని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 275 మంది మృత్యువాతపడ్డారు. rj ఈ ప్రమాదం అనంతరం బాలాసోర్‌లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపిందని మంత్రి వెల్లడించారు.
చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment