ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆప్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొహల్లా క్లినిక్‌లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై హోం మంత్రిత్వ శాఖ సీబీఐ దర్యాప్తుని ఆదేశించింది. మొహల్లా క్లినిక్‌ల రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మొహల్లా క్లినిక్‌లు పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలను నిర్వహించాయని ఆరోపణలు వచ్చాయి. క్లినిక్‌లకు రాని వైద్యులకు హాజరు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లేని రోగులకు క్లినిక్‌లలో చికిత్సలు నమోదు చేసినట్లు బయటపడింది. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
మొహల్లా క్లినిక్ ద్వారా ఢిల్లీలో సామాన్య జనానికి ప్రాథమిక ఆరోగ్యాన్ని అందించడానికి ఆప్ సర్కార్ ఏర్పాటు చేసిన పథకం. కేవలం ఢిల్లీ జనాభాకు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా ఆరోగ్య సేవలు అందిస్తుంది.
ఇదీ చదవండి: కేజ్రీవాల్‌ది క్లీన్ ఇమేజ్.. అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు: శరద్ పవార్
Comments
Please login to add a commentAdd a comment