ఒడిశా:ఒడిశా బాలాసోర్‌లోని బహగానా స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. బహగానా స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు. ఈ కేసు సీబీఐ పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఈ స్టేషన్ వద్ద రైళ్లు ఆగబోవని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు బహగానా స్టేషన్ లాగ్ బుక్స్‌ను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌ను సీజ్ చేశారు.
బహగానా స్టేషన్‌ను సీబీఐ సీజ్ చేసిందని దక్షిణ-తూర్పు రైల్వే చీఫ్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ఈ స్టేషన్ గుండా దాదాపు 170 రైళ్లు ప్రతిరోజూ ప్రయాణిస్తాయి. ప్యాసింజర్ రైళ్లు భద్రక్- బాలాసోర్, హౌరా-భద్రక్ బఘజతిన్, ఖరగ్‌పుర్ ఖుర్ధా రైళ్లు ఇక్కడ ఒక నిమిషం పాటు నిలిచేవని ఆయన తెలిపారు.
బాలాసోర్ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు.1208 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 709 మందికి రైల్వే శాఖ ఇప్పటికే పరిహారాన్ని కూడా అందించింది.
ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment