Odisha Train Crash Reason
-
‘అందుకే ఒడిశా దుర్ఘటన జరిగింది’.. రైల్వే బోర్డుకు నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 300 మందిని బలిగొన్న ఒడిశా బాలాసోర్ రైల్వే దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషన్ తన స్వతంత్ర నివేదిక సమర్పించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్ ప్రధాన కారణమని వెల్లడించిన సీఆర్ఎస్ నివేదిక.. అనేక స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రైల్వే బోర్డుకు నివేదించింది. అలాగే.. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని.. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖార్గ్‌పూర్ డివిజన్ బ్యాంక్రనాయబాజ్ స్టేషన్ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్. అలాగే.. లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్. జూన్ 2వ తేదీ రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఇదీ చదవండి: దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం! -
ఒడిశా రైలు ప్రమాదం: ఆ స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు.. ఎందుకంటే..?
ఒడిశా:ఒడిశా బాలాసోర్‌లోని బహగానా స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. బహగానా స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు. ఈ కేసు సీబీఐ పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఈ స్టేషన్ వద్ద రైళ్లు ఆగబోవని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు బహగానా స్టేషన్ లాగ్ బుక్స్‌ను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌ను సీజ్ చేశారు. బహగానా స్టేషన్‌ను సీబీఐ సీజ్ చేసిందని దక్షిణ-తూర్పు రైల్వే చీఫ్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ఈ స్టేషన్ గుండా దాదాపు 170 రైళ్లు ప్రతిరోజూ ప్రయాణిస్తాయి. ప్యాసింజర్ రైళ్లు భద్రక్- బాలాసోర్, హౌరా-భద్రక్ బఘజతిన్, ఖరగ్‌పుర్ ఖుర్ధా రైళ్లు ఇక్కడ ఒక నిమిషం పాటు నిలిచేవని ఆయన తెలిపారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు.1208 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 709 మందికి రైల్వే శాఖ ఇప్పటికే పరిహారాన్ని కూడా అందించింది. ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
ఒడిశా కోరమాండల్ ప్రమాద వీడియో వైరల్!
Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి. ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. ఒడిశాలో జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని ఉపయోగించాలని నిర్ణయించారు. -
ఒడిశా దుర్ఘటన.. శవాలా గుట్టలు చూశాక ఆకలేస్తుందా?
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు. విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి? -
బాలాసోర్ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది. సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ? -
బాధ్యులను గుర్తించాం.. ప్రమాదానికి కారణం అదే: అశ్వినీ వైష్ణవ్
బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు 288కి చేరింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రాక్ పునరుద్ధణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా పాడైపోయిన ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నాము. బుధవారం ఉదయానికి మిగతా పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారు. రిపోర్టు అందాల్సి ఉంది. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒకదానిపైన మరొకటి ఎక్కిన బోగీలను ఇప్పటికే కష్టపడి తొలగించారు. వీలైనంత తొందరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు నిరంతరాయంగా వందలాది మంది కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారు అని స్పష్టం చేశారు. #WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it... It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ — ANI (@ANI) June 4, 2023 ఇది కూడా చదవండి: అలా జరిగితే ప్రమాదం తప్పేదా?