కటక్: సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గార్డ్ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.
Published Thu, Oct 4 2018 6:39 PM | Last Updated on Thu, Oct 4 2018 6:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment