సౌదీ-యూఎఈ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొవడంతో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఆయిల్ ఉత్పత్తి దేశాలు(ఒపెక్) మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైనాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్‌ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. 2014 సంవత్సరం తరువాత తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.
బ్రెంట్(అట్లాంటిక్ బేసిన్ క్రూడ్‌ఆయిల్) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 0.8 శాతం పెరిగి 77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్ ధరలు పెరగలేదు. ఆయిల్ ఉత్పత్తి దేశాల(ఒపెక్)తో గతవారం ఏర్పడిన విభేదాల తరువాత మూడవరోజు చర్చలు జరిపిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. ఆయిల్ కంపెనీ ఉత్పత్తి దేశాలు తిరిగి సమావేశమయ్యే తేదీలను ప్రకటించలేదు.
కొన్ని ఒపెక్ దేశాలు ఈ నెలలో చర్చలను తిరిగి ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాకుంగా డిమాండ్‌కు సరిపడ ముడిచమురును ఆగస్టు నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఆయిల్ ఉత్పత్తి దేశాలతో చర్చలు వెంటనే సఫలమైయేలా చూడాలని బైడెన్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ చమురు మంత్రి ఇహ్సాన్ అబ్దుల్ జబ్బర్ సోమవారం మాట్లాడుతూ..తమ దేశం చమురు ధరలు పెరగడం ఇష్టం లేదని తెలిపారు. 10 రోజుల్లోపు కొత్త ఒపెక్ + సమావేశానికి తేదీ నిర్ణయించబడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
భారత్‌పై ప్రభావం..!
యుఎఈ, ఇతర ఒపెక్ + దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, ముడి చమురు ధరలనుంచి సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం తక్కువ ఉండనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు.
భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2021 ప్రారంభం నుండి పెట్రోల్ ధరను 19.3 శాతం, డీజిల్ ధరను 21 శాతం పెంచాయి.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం ఒపెక్ సభ్య దేశాలతో సంభాషణలు జరిపారు. ఈ సమావేశాల తరువాత ముడి చమురు ధరలు నియంత్రణలోకి వస్తాయనిఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment