OPEC Meeting
-
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్టం. తలనొప్పిగా ఆయా దేశాల మధ్య పరిస్థితులు...! ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే వ్యక్తిగత ఆంక్షలను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యాను హెచ్చరించారు. ఇదిలా ఉండగా యెమెన్ హౌతీ ఉద్యమకారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్థావరంపై క్షిపణి దాడి చేశారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఇతర దేశాలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా పెంపుపై నిర్ణయం..! ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరాపై ప్రతికూలతను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పూర్తిగా తగ్గించేశాయి. క్రమంగా ఆయా దేశాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా చమురకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు, ఇతర మిత్రదేశాలు ఫిబ్రవరి 2న సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చమురు ఉత్పత్తి పెంపు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన దేశాలు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. రోజువారి ఉత్పత్తిని మరింత పెంచితే భారత్‌తో సహా చమురు అధికంగా వినియోగించే దేశాలకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..! -
పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు!
ఫ్రాంక్ఫర్ట్: నవంబరు వరకు పెట్రో బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒపెక్ నిర్ణయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్‌లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ క్రూడ్ బేరల్ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం లాభంతో 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. చదవండి :పెట్రోల్ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్ కాస్ట్ ఎంతో తెలుసా ? -
స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా
దేశీయ మార్కెట్లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి కారణం అదేనా?!
దేశంలోని వాహనదారులకు పెట్రోధరలపై ఊరట కలిగింది.గత ఆదివారం నుంచి ఈ రోజు(శనివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు, ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. ఇక శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు.. సామాన్యులకు మోతేనా..!
సౌదీ-యూఎఈ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొవడంతో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఆయిల్ ఉత్పత్తి దేశాలు(ఒపెక్) మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైనాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్‌ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. 2014 సంవత్సరం తరువాత తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రెంట్(అట్లాంటిక్ బేసిన్ క్రూడ్‌ఆయిల్) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 0.8 శాతం పెరిగి 77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్ ధరలు పెరగలేదు. ఆయిల్ ఉత్పత్తి దేశాల(ఒపెక్)తో గతవారం ఏర్పడిన విభేదాల తరువాత మూడవరోజు చర్చలు జరిపిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. ఆయిల్ కంపెనీ ఉత్పత్తి దేశాలు తిరిగి సమావేశమయ్యే తేదీలను ప్రకటించలేదు. కొన్ని ఒపెక్ దేశాలు ఈ నెలలో చర్చలను తిరిగి ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాకుంగా డిమాండ్‌కు సరిపడ ముడిచమురును ఆగస్టు నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఆయిల్ ఉత్పత్తి దేశాలతో చర్చలు వెంటనే సఫలమైయేలా చూడాలని బైడెన్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ చమురు మంత్రి ఇహ్సాన్ అబ్దుల్ జబ్బర్ సోమవారం మాట్లాడుతూ..తమ దేశం చమురు ధరలు పెరగడం ఇష్టం లేదని తెలిపారు. 10 రోజుల్లోపు కొత్త ఒపెక్ + సమావేశానికి తేదీ నిర్ణయించబడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. భారత్‌పై ప్రభావం..! యుఎఈ, ఇతర ఒపెక్ + దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, ముడి చమురు ధరలనుంచి సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం తక్కువ ఉండనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2021 ప్రారంభం నుండి పెట్రోల్ ధరను 19.3 శాతం, డీజిల్ ధరను 21 శాతం పెంచాయి.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం ఒపెక్ సభ్య దేశాలతో సంభాషణలు జరిపారు. ఈ సమావేశాల తరువాత ముడి చమురు ధరలు నియంత్రణలోకి వస్తాయనిఆశాభావం వ్యక్తం చేశారు. -
చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు!
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్‌ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో గురువారం భారత్ ఈ కీలక పిలుపునిచ్చింది. చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్ దేశాలు భారత్ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒపెక్ సెక్రటరీ జనరల్‌తో చర్చలు ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ సనౌసి బర్కిం దోతో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు ధరల విషయమై వర్చువల్‌గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు బేరల్‌కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది. ఇరు వర్గాల ప్రకటనల ప్రకారం, చమురు మార్కెట్ పరిణామాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి. ఆయిల్ డిమాండ్ రికవరీ, ఎకానమీ వృద్ధిపై ప్రభావం, ఇంధన సవాళ్లను అధిగమంచడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల ప్రధాన్ కృతజ్ఞతలు.. భారత్‌లో మహమ్మారి రెండవ వేవ్ సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్సహా పలు ఒపెక్ సభ్య దేశాలు చేసిన సహాయం పట్ల ప్రధాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్ సెక్రటేరియట్ నిరంతర సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా తాజా వీడియోకాన్ఫరెన్స్ జరి గింది. ప్రపంచ ఎకానమీ 5.5 శాతం పురోగమిస్తుందని, 2021లో రోజూవారీ ఆయిల్ డిమాండ్ 6 మిలియన్ బేరళ్లకుపైగా పెరుగుతుందని జూన్‌లో ఒపెక్ నెలవారీ ఆయిల్ మార్కెట్ నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్ దాని అనుబంధ దేశాలు (ఒపెక్ ప్లస్) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం. నిజానికి చమురు ధరల విషయంలో ఈ ఏడాది మార్చిలో భారత్–ఒపెక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరగాయి. ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ అప్పట్లో విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాట క)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ఒపెక్ చేసిన ప్రకటనపై అప్పట్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ప్రధాన్ స్పష్టం చేయడం గమనార్హం. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్ సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. -
మళ్లీ మండుతున్న చమురు ధరలు
న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ మార్కెట్లలో మళ్లీ ముడిచమురు ధరలు మండుతున్నాయి. మంగళవారం దాదాపు 5 శాతం జంప్‌చేసిన ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.2 శాతం పుంజుకుని 50 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.6 శాతం ఎగసి 53.94 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్) ఏం జరిగిందంటే? అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు మద్దతుగా ఒపెక్సహా రష్యావరకూ మూడేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 సంక్షోభం వంటి పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ధరలకు నిలకడను తీసుకువచ్చేందుకు చమురు ఉత్పత్తి, ఎగుమతుల దేశాలు ప్రయత్రిస్తున్నాయి. ఈ బాటలో 2017 జనవరి నుంచి చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా రెండు రోజులపాటు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా అదనపు కోతలకు సిద్ధమని తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) రోజుకి 10 లక్షల బ్యారళ్లు కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్‌కతాలో డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్ లీటర్ రూ. 79.93గా, పెట్రోల్ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 86కు చేరగా.. డీజిల్ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కోతల ఎఫెక్ట్ తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం 1.4 శాతం జంప్‌చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ల ఆశలు- మండుతున్న చమురు
లండన్/ న్యూయార్క్: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు సిద్ధంకానున్న వార్తలతో ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం 5 శాతం పురోగమించిన చమురు ధరలు వరుసగా రెండో రోజు బలపడ్డాయి. వెరసి విదేశీ మార్కెట్లో మూడు నెలల గరిష్టాలకు చేరాయి. ఇటీవలి ఎన్నికలలో అమెరికా ప్రెసిడెంట్‌గా జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా ధృవ పడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు జతగా ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికి కరోనా కట్టిడికి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొనడంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా ముడిచమురు ధరలు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఒపెక్ ఎఫెక్ట్.. చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో రష్యాసహా ఒపెక్ దేశాలు గత కొద్ది నెలలుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2021 జనవరి వరకూ కోతలు అమలుకానున్నాయి. కాగా.. కోతల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశంకానున్నాయి. దీనిలో భాగంగా జనవరి 2021 తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కనీసం రోజుకి 2 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు నిర్ణయించవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. అంటే 5.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలు మరో ఆరు నెలలు కొనసాగే వీలున్నట్లు చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని, దీంతో చమురుకు డిమాండ్ పుంజుకుంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు చమురు ఉత్పత్తిలో కోతలు కొనసాగితే ధరలు మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నాయి. ధరల జోరు ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1 శాతం ఎగసి 46.51 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1.1 శాతం పుంజుకుని 43.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం విదితమే. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా ప్రతీ 15 రోజులకోసారి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. వివిధ పన్నులతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరల సవరణలో ప్రభావం చూపుతుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది. గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్‌ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది.