అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్టం.
తలనొప్పిగా ఆయా దేశాల మధ్య పరిస్థితులు...!
ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే వ్యక్తిగత ఆంక్షలను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యాను హెచ్చరించారు. ఇదిలా ఉండగా యెమెన్ హౌతీ ఉద్యమకారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్థావరంపై క్షిపణి దాడి చేశారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఇతర దేశాలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సరఫరా పెంపుపై నిర్ణయం..!
ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరాపై ప్రతికూలతను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పూర్తిగా తగ్గించేశాయి. క్రమంగా ఆయా దేశాలు లాక్‌డౌన్ ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా చమురకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు, ఇతర మిత్రదేశాలు ఫిబ్రవరి 2న సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చమురు ఉత్పత్తి పెంపు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2020లో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన దేశాలు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. రోజువారి ఉత్పత్తిని మరింత పెంచితే భారత్‌తో సహా చమురు అధికంగా వినియోగించే దేశాలకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!
Comments
Please login to add a commentAdd a comment