Barrel Price
-
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్‌కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్‌కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్‌కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్‌తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్‌పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
ఉక్రెయిన్‌లో హింస ఆపండి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో హింసాకాండకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు సూచించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడాలని కోరుకుంటున్నామని, శాంతి యత్నాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన లావ్రోవ్ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలను మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత స్వతంత్ర వైఖరి ప్రశంసనీయం ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రభుత్వ ‘స్వతంత్ర’ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. ఆయన శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమయ్యారు. భారత్ చాలా ముఖ్యమైన దేశమని, అమెరికా ఒత్తిడికి లొంగబోదని తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌తో పరస్పర సహకారానికి రష్యా కట్టుబ డి ఉందని లావ్రోవ్ చెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్ కోరుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దోపిడీ వ్యవస్థ మనకొద్దు పశ్చిమ దేశాలే రష్యాను యుద్ధంలోకి నెట్టాయని సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. భారత విదేశాంగ విధానం, రష్యా విదేశాంగ విధానం ఒకే విధంగా ఉన్నాయన్నారు. జాతీయ కరెన్సీలతో భారత్, ఇతర భాగస్వామ్య దేశాలతో వాణిజ్య వ్యాపార లావాదేవీలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. భారత్–రష్యా మధ్య రూపాయి, రూబుల్తో లావాదేవీలు జరగాలన్నారు. డాలర్ ఆధారిత చెల్లింపులకు స్వస్తి పలకాలన్నారు. రాత్రికి రాత్రే మన సొమ్మును దోచేసే దొంగల వ్యవస్థ మనకు అక్కర్లేదన్నారు. సొంత కరెన్సీల్లో చెల్లింపుల వ్యవస్థను ఇప్పటికే అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. గతంలో చాలాసార్లు సంక్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాల నడుమ సంబంధాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సంబంధాలు స్థిరంగా ఉండాలి: జైశంకర్ భేదాభిప్రాయాలను, వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తమ ఎజెండాను విస్తృతం చేయడం ద్వారా సహకారాన్ని విస్తరింపజేస్తామని అన్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య లావ్రోవ్తో తన భేటీ జరిగిందని తెలిపారు. ఆర్థిక, సాంకేతిక రంగాలతోపాటు భారత్–రష్యా ప్రజల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండడం చాలా అవసరమని ప్రధాని అన్నారు. జైశంకర్, లావ్రోవ్ ద్వైపాక్షిక అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇండో–పసిఫిక్, అసియాన్‌పైనా లావ్రోవ్తో చర్చించినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. రష్యా నుంచి చౌక ధరతో ముడిచమురు కొనుగోలు చేయాలని భారత్ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై తీవ్ర పరిణా మాలు ఉంటా యని అమెరికా హెచ్చరిస్తున్న సంగతి తెలి సిందే. చైనా గనుక యుద్ధం ప్రారంభిస్తే భారత్‌ను రష్యా రక్షించబోదని అమెరికా చెబుతోంది. ఇది చదవండి: పుతిన్‌కు పెరిగిన పాపులారిటీ.. రష్యాలోనూ ‘హీరో’గా ఫుల్ సపోర్ట్! -
తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..!
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్‌మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్టం. తలనొప్పిగా ఆయా దేశాల మధ్య పరిస్థితులు...! ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే వ్యక్తిగత ఆంక్షలను పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యాను హెచ్చరించారు. ఇదిలా ఉండగా యెమెన్ హౌతీ ఉద్యమకారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్థావరంపై క్షిపణి దాడి చేశారు. ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఇతర దేశాలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా పెంపుపై నిర్ణయం..! ఆయా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరాపై ప్రతికూలతను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పూర్తిగా తగ్గించేశాయి. క్రమంగా ఆయా దేశాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా చమురకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు, ఇతర మిత్రదేశాలు ఫిబ్రవరి 2న సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చమురు ఉత్పత్తి పెంపు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన దేశాలు రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. రోజువారి ఉత్పత్తిని మరింత పెంచితే భారత్‌తో సహా చమురు అధికంగా వినియోగించే దేశాలకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..! -
మండుతున్న చమురు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఆయిల్ ఫ్యూచర్స్ 0.96 శాతం పుంజుకుని బారెల్ ధర రూ.4084ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ప్రభావం పడనుందన్న విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ చమురు ధరలు పరుగు తీస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫిబ్రవరిలో డెలివరీ ముడి చమురు ధర రూ. 39 పుంజుకుని రూ.4,084 వద్ద ఉంది. అదేవిధంగా, మార్చ్ నెలలో డెలివరీ ధర రూ. 38 లేదా 0.94 శాతం ఎగిసి బ్యారెల్ ధర రూ. 4,085 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 69.41 డాలర్ల వద్ద ఉంది. గత ముగింపుతో పోలిస్తే 0.55 శాతం పుంజుకుంది. ప్రపంచ మార్కెట్ల స్థిరమైన వృద్ది, డాలర్ బలహీన చమురు ధరలకు ఊతమిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు ఐ ఎంఎఫ్ ఆరోగ్యకరమైన ఆర్థికాభివృద్ధి అంచనాలు, రష్యా, ఒపెక్ దేశాల ఎగుమతిదారుల గ్రూప్‌లో కొనసాగుతున్న సరఫరా నియంత్రణ చమురు ధరలు పెంచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
భారీగా పడిన ముడిచమురు ధర
50 డాలర్లకు పతనం న్యూయార్క్: అంతర్జాతీయంగా ముడిచమురు ధర అంతకంతకూ తగ్గుతోంది. చమురు విక్రయాలపైనే ఆధారపడ్డ దేశాలకు చెమటలు పట్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో నెమైక్స్ క్రూడ్ ధర దాదాపు 5-6 శాతం తగ్గిపోయింది. దీంతోబ్యారెల్ ధర 50 డాలర్లను తాకింది. 2009 ఏప్రిల్ తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2014 జూన్ నుంచి చూస్తే క్రూడ్ ధర దాదాపు 50 శాతం తగ్గింది. చైనా సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితి, జపాన్‌లో మాంద్యం, యూరో జోన్లో వృద్ధి నిలిచిపోవడం, అధిక నిల్వలు, మార్కెట్‌పై పట్టుకు సంబంధించి అంతర్జాతీయంగా అమెరికా, ఒపెక్ సహా వివిధ చమురు ఉత్పత్తి దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని కేంద్రం సామాన్యుడికి అందించటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.