
సాక్షి, న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఆయిల్ ఫ్యూచర్స్ 0.96 శాతం పుంజుకుని బారెల్ ధర రూ.4084ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ప్రభావం పడనుందన్న విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ చమురు ధరలు పరుగు తీస్తున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఫిబ్రవరిలో డెలివరీ ముడి చమురు ధర రూ. 39 పుంజుకుని రూ.4,084 వద్ద ఉంది. అదేవిధంగా, మార్చ్ నెలలో డెలివరీ ధర రూ. 38 లేదా 0.94 శాతం ఎగిసి బ్యారెల్ ధర రూ. 4,085 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 69.41 డాలర్ల వద్ద ఉంది. గత ముగింపుతో పోలిస్తే 0.55 శాతం పుంజుకుంది.
ప్రపంచ మార్కెట్ల స్థిరమైన వృద్ది, డాలర్ బలహీన చమురు ధరలకు ఊతమిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు ఐ ఎంఎఫ్ ఆరోగ్యకరమైన ఆర్థికాభివృద్ధి అంచనాలు, రష్యా, ఒపెక్ దేశాల ఎగుమతిదారుల గ్రూప్‌లో కొనసాగుతున్న సరఫరా నియంత్రణ చమురు ధరలు పెంచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.