futures
-
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
కమోడిటీ కొత్త ఫ్యూచర్స్‌కు సెబీ చెక్
న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల డెరివేటివ్ కొత్త కాంట్రాక్టులపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కన్నెర్ర చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ముడిపామాయిల్, పెసరపప్పు, గోధుమలు తదితర 7 వ్యవసాయ సంబంధ కమోడిటీలలో కొత్తగా ప్రవేశపెట్టే ఫ్యూచర్స్(కాంట్రాక్టులు)ను నిషేధించింది. తద్వారా పెరుగుతున్న ధరల(ద్రవ్యోల్బణం)కు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టులలో పొజిషన్లను ముగించుకునేందుకు(స్క్వేరింగ్ అప్) అనుమతిస్తూనే.. కొత్త పొజిషన్లకు చెక్ పెట్టింది. తాజా ఆదేశాలు ఏడాది కాలంపాటు అమలులో ఉంటాయని సెబీ స్పష్టం చేసింది. బాస్మతియేతర ధాన్యం, గోధుమలు, సోయాబీన్, తత్సంబంధ ఉత్పత్తులు, ముడిపామాయిల్, పెసరపప్పు వంటి ఉత్పత్తులలో తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవవరకూ కొత్త కాంట్రాక్టులను ప్రవేశపెట్టకుండా నిలువరించింది. ఈ జాబితాలో సెనగలు, ఆవాలు, సంబంధిత ఉత్పత్తుల డెరివేటివ్స్‌ను సైతం జాబితాలో చేర్చింది. కాగా. ఈ కమోడిటీలలో డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ ఏడాది మొదట్లోనే నిషేధించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ద్రవ్యోల్బణంపై పడుతున్న ఆహార సరుకుల ప్రభావాన్ని అరికట్టే బాటలోనే సెబీ 7 వ్యవసాయ కమోడిటీల డెరివేటివ్స్‌ను ఏడాదిపాటు సెబీ నిషేధించినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ అభిప్రాయపడ్డారు. కాగా.. వీటిలో కొత్త పొజిషన్లు తీసుకునేందుకు అనుమతించబోమని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్సే్ఛంజీ(ఎన్సీడీఈఎక్స్) తాజాగా తెలియజేసింది. ఉన్న పొజిషన్లను ముగించేందుకు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. అనుమతించిన కొన్ని కమోడిటీలలోనే ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులకు వీలుంటుందని వివరించింది. సెబీ నిషేధించిన కమోడిటీలలో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ కొత్తగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టబోమని వెల్లడించింది. -
వాస్తవాలు ఎందుకు దాచారు?
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ గ్రూప్ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ అసెట్స్‌ను రిలయన్స్‌కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్‌తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్–ఫ్యూచర్స్ గ్రూప్ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్–ఫ్యూచర్స్ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ (ఎఫ్ఆర్ఎల్) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్‌కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్ ఒప్పందం సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్ తెలిపింది. -
మండుతున్న చమురు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఆయిల్ ఫ్యూచర్స్ 0.96 శాతం పుంజుకుని బారెల్ ధర రూ.4084ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ప్రభావం పడనుందన్న విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ చమురు ధరలు పరుగు తీస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫిబ్రవరిలో డెలివరీ ముడి చమురు ధర రూ. 39 పుంజుకుని రూ.4,084 వద్ద ఉంది. అదేవిధంగా, మార్చ్ నెలలో డెలివరీ ధర రూ. 38 లేదా 0.94 శాతం ఎగిసి బ్యారెల్ ధర రూ. 4,085 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 69.41 డాలర్ల వద్ద ఉంది. గత ముగింపుతో పోలిస్తే 0.55 శాతం పుంజుకుంది. ప్రపంచ మార్కెట్ల స్థిరమైన వృద్ది, డాలర్ బలహీన చమురు ధరలకు ఊతమిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు ఐ ఎంఎఫ్ ఆరోగ్యకరమైన ఆర్థికాభివృద్ధి అంచనాలు, రష్యా, ఒపెక్ దేశాల ఎగుమతిదారుల గ్రూప్‌లో కొనసాగుతున్న సరఫరా నియంత్రణ చమురు ధరలు పెంచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
బిట్‌కాయిన్@ 16,000 డాలర్లు
లండన్: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఇది కీలకమైన 15,000 డాలర్ల స్థాయిని దాటేసింది. గురువారం ఒక దశలో 16వేల డాలర్ల పైన ట్రేడయింది. దీంతో ’బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్న’ బిట్‌కాయిన్ ఇతర ప్రధాన మార్కెట్లకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం వ్యవధిలోనే 50 శాతం పెరిగి 12,000 డాలర్ల స్థాయిని తాకిన బిట్‌కాయిన్ అంతలోనే మళ్లీ 16,000 డాలర్లకు ర్యాలీ చేయడం గమనార్హం. ‘ఊహించడానికి సాధ్యంకానంత స్థాయిలో కొత్త ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీని పోగు చేసుకుంటున్నారు. దీంతో బిట్‌కాయిన్ ప్రస్తుతం బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది‘ అని ఆస్ట్రేలియాకి చెందిన ఏఎస్ఆర్ వెల్త్ సంస్థ సలహాదారు షేన్ చానెల్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విపరీతమైన ఉత్సుకత కాస్త తగ్గితే.. కచ్చితంగా బిట్‌కాయిన్ విలువ కరెక్షన్‌కి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్‌టీసీ)... ఇటీవలే ప్రధాన ఎక్సే్ఛంజీల్లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కి అనుమతించింది. ఇది ఈ కరెన్సీకి మరింతగా ఊతమిచ్చిందని అంచనా. సీబీవోఈ ఫ్యూచర్స్ ఎక్సే్ఛంజీలో ఈ వారాంతం నుంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యూచర్స్ మార్కెట్ షికాగో మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో (సీఎంఈ) డిసెంబర్ 18 నుంచి బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది. హ్యాకింగ్‌పై నైస్ హ్యాష్ విచారణ.. దాదాపు 64 మిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 4,700 బిట్కాయిన్లు హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైన ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్లొవేనియాకి చెందిన బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజ్ నైస్ హ్యాష్ వెల్లడించింది. గురువారం ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది. 2009లో తెరపైకి వచ్చిన బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాది తొలినాళ్లలో (జనవరిలో) 752 డాలర్లుగా ఉండేది. నాటకీయ ఫక్కీలో ఇటీవలి కాలంలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాఫ్ట్వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదు. ఈ కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలంటూ దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు చేస్తూనే ఉంది. -
బంగారం ధరలకు ఫెడ్ షాక్
న్యూఢిల్లీ: వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఎంసీఎక్స్‌మార్కెట్ లో పుత్తడి ధరలు గురువారం నీరసించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ ఆగస్టు డెలివరీ బంగారు ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రా. పసిడి ధర రూ.234 క్షీణించి రూ.28, 796 స్థాయిని నమోదు చేసింది. ఇటీవల కొన్ని సెషన్లుగా ఓలటైల్‌గా ఉన్న పసిడిధరలు తాజాగా మరింత దిగజారాయి. దీంతో రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1.37 శాతం క్షీణించి 1,262.26 డాలర్లుగా ఉంది.అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగాపుంజుకున్నాయి. 0.01 శాతం పెరిగి 17 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్లర్ల ఆందోళన అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టుల అంచనా. అటు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 9600 స్థాయికి దిగువన కొనసాగుతోంది. బుధవారం న్యూయార్క్ ఔన్స్ బంగారం ధర 0.47 శాతం తగ్గి 1,260.10 డాలర్లను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో బలహీన ధోరణి కారణంగా , ఫండ్స్ వర్తకంలో బంగారు ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాగా అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. అంతేకాదు ఈ ఏడాది మరో సారి రేట్ కట్ తప్పదనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు. ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్‌బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. -
ఒడిసిపడితే లాభం... బెడిసికొడితే నష్టం
ఉమెన్ ఫైనాన్స్ / పుట్ ఆప్షన్స్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తగ్గించుకోడానికి ‘డెరివేటివ్స్’ ఒక చక్కటి పరిష్కారం. డెరివేటి వ్స్లో రెండు రకాలు ఉంటాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్. డెరివేటివ్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఆప్షన్స్‌లోని రెండు రకాలలో ఒకటైన కాల్ ఆప్షన్‌పై గతవారం అవగాహన కలిగించుకున్నాం. ఈవారం పుట్ ఆప్షన్ అంటే ఏమిటో, దాని లాభనష్టాలేమిటో చూద్దాం. పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్‌కి సరిగ్గా రివర్స్‌లో ఉంటుంది. అంటే కాల్ ఆప్షన్ కొన్నవారికి ధర పెరిగితే లాభం. అదే పుట్ ఆప్షన్ కొన్నవారికి ధర తగ్గితే లాభం. అలాగే పుట్ ఆప్షన్ అమ్మినవారు ధర తగ్గితే ఎక్కువ నష్టపోవలసి వస్తుంది. పెరిగితే ప్రీమియం మొత్తం గరిష్ట లాభంగా ఉంటుంది. ఈ పుట్ ఆప్షన్‌లోని లాభనష్టాలు ఎలా ఉంటాయో కింది పట్టికలో గమనించవచ్చు. ఆప్షన్ అమ్మిన వ్యక్తి అపరిమిత నష్టాన్ని భరించవలసి ఉండడమే కాకుండా, మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. హెడ్జింగ్ (ముందస్తు రక్షణ ఏర్పాటు) చేసుకునేవారికి ఈ ఆప్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించకుంటే భారీగా నష్టపోవలసి ఉంటుంది. ఆప్షన్స్ అనేవి పదునైన కత్తి లాంటివి. సరైన క్రమపద్ధతిలో, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బెడిసికొడితే చాలా నష్టపోవలసి ఉంటుంది. -
కొన్నా.. అమ్మినా.. ఆప్షన్ మీదే!
ఉమెన్ ఫైనాన్స్ / ఆప్షన్స్ ఈక్విటీ మార్కెట్లో షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే ఆ షేర్ విలువ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని చెల్లించి ఆ షేర్లను పొందవలసి ఉంటుంది. అలాగే కొన్న తర్వాత వాటి విలువ తగ్గితే మూలధనాన్ని కూడా నష్టపోవలసి వస్తుంది. అలాగే కొంతమందికి పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో షేర్లు కొనడానికి డబ్బు అందుబాటులో లేకపోవచ్చు. వీటన్నిటికీ పరిష్కారమే ‘డెరివేటివ్స్’ . డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అని రెండు రకాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఈవారం అప్షన్స్పై అవగాహన కలిగించుకుందాం. ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఇండెక్స్, షేర్ మార్కెట్ ధర మీద ఆధారపడి ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని సరిగా అవగాహన చేసుకొని ట్రేడ్ చేస్తే మంచి లాభాల పొందవచ్చు. అలాగే ఏ మాత్రం తేడా జరిగినా భారీగా నష్టపోవలసి వస్తుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా ఆప్షన్స్‌ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు ఈ ఆప్షన్స్ ఎలా పని చేస్తాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? వీటిలో ఉన్న రిస్క్ ఏమిటో చూద్దాం. ఆప్షన్స్‌లో రెండు రకాలు ఉన్నాయి. 1. కాల్ ఆప్షన్. 2. పుట్ ఆప్షన్. ఆప్షన్స్‌ని కొనేవారు ఏ షేర్ / ఏ ఇండెక్స్నైతే కొంటున్నారో ఆ షేరు / ఇండెక్స్ రేటు మొత్తాన్ని చెల్లించనవసరం లేదు. ఆ ఆప్షన్‌కి ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఎటువంటి మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించనవసరం లేదు. అదే ఆప్షన్స్ అమ్మేవారైతే ఆ ప్రీమియం మొత్తాన్ని వారు పొందుతారు. కానీ వారు ఆ ఆప్షన్‌కు ఉన్నటువంటి మార్జిన్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఆప్షన్ అమ్మడం అనేది చాలా రిస్కుతో కూడుకున్నటువంటిది. కాల్ ఆప్షన్ : ఈ ఆప్షన్ని కొనేవారు తాము తీసుకున్న షేరు / ఇండెక్స్.. స్ట్రైక్ ధర కన్నా పెరిగితే లాభపడతారు. ఒకవేళ తగ్గితే ఎటువంటి మొత్తాన్నీ చెల్లించనవసరం లేదు. కాకపోతే తాము కట్టిన ప్రీమియం సొమ్ము వెనక్కు రాదు. ఆ మొత్తాన్ని వారు నష్టపోతారు. అంటే కాల్ ఆప్షన్ తీసుకున్నవారికి గరిష్టంగా ఎంత నష్టపోతారనేది కచ్చితంగా తెలుస్తుంది. అదే కాల్ ఆప్షన్ అమ్మేవారైతే ఎంతైతే ప్రీమియం పొందుతారో ఆ సొమ్ము మాత్రమే వారి గరిష్ట లాభంగా ఉంటుంది. నష్టపోవలసి వస్తే మాత్రం అది అపరిమితంగా ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
సీఎంకు ఎన్నికల కమిషన్ మందలింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గురువారం మందలించింది. దీనిపై సీఎం ఇచ్చిన వివరణను తిరస్కరించింది. భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. గత నెల 23న సిద్ధరామయ్య మైసూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీని నర హంతకుడిగా అభివర్ణించారు. క్షమాపణ చెప్పను..: మోడీ నర హంతకుడని తానెప్పుడూ చెప్పలేదని, మోడీ సర్కారు నర హంతక ప్రభుత్వమని మాత్రమే చెప్పానని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మోడీకి తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చారు. మైసూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను అనని మాటలకు ఎందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాగా తనకు వివాహమైనట్లు నామినేషన్‌ను దాఖలు చేసిన సందర్భంగా మోడీ1 అఫిడవిట్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవని పేర్కొన్నారు. -
బంగారంలో స్వర్ణయుగానికి ముగింపు పలికిన 2013