లండన్: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఇది కీలకమైన 15,000 డాలర్ల స్థాయిని దాటేసింది. గురువారం ఒక దశలో 16వేల డాలర్ల పైన ట్రేడయింది. దీంతో ’బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్న’ బిట్‌కాయిన్ ఇతర ప్రధాన మార్కెట్లకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం వ్యవధిలోనే 50 శాతం పెరిగి 12,000 డాలర్ల స్థాయిని తాకిన బిట్‌కాయిన్ అంతలోనే మళ్లీ 16,000 డాలర్లకు ర్యాలీ చేయడం గమనార్హం. ‘ఊహించడానికి సాధ్యంకానంత స్థాయిలో కొత్త ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీని పోగు చేసుకుంటున్నారు. దీంతో బిట్‌కాయిన్ ప్రస్తుతం బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది‘ అని ఆస్ట్రేలియాకి చెందిన ఏఎస్‌ఆర్ వెల్త్ సంస్థ సలహాదారు షేన్ చానెల్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విపరీతమైన ఉత్సుకత కాస్త తగ్గితే.. కచ్చితంగా బిట్‌కాయిన్ విలువ కరెక్షన్‌కి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్‌టీసీ)... ఇటీవలే ప్రధాన ఎక్సే్ఛంజీల్లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కి అనుమతించింది. ఇది ఈ కరెన్సీకి మరింతగా ఊతమిచ్చిందని అంచనా. సీబీవోఈ ఫ్యూచర్స్ ఎక్సే్ఛంజీలో ఈ వారాంతం నుంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యూచర్స్ మార్కెట్ షికాగో మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో (సీఎంఈ) డిసెంబర్ 18 నుంచి బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది.
హ్యాకింగ్‌పై నైస్ హ్యాష్ విచారణ..
దాదాపు 64 మిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 4,700 బిట్‌కాయిన్లు హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైన ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్లొవేనియాకి చెందిన బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజ్ నైస్ హ్యాష్ వెల్లడించింది. గురువారం ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది. 2009లో తెరపైకి వచ్చిన బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాది తొలినాళ్లలో (జనవరిలో) 752 డాలర్లుగా ఉండేది. నాటకీయ ఫక్కీలో ఇటీవలి కాలంలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాఫ్ట్‌వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదు. ఈ కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలంటూ దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు చేస్తూనే ఉంది.
బిట్‌కాయిన్@ 16,000 డాలర్లు
Published Fri, Dec 8 2017 12:06 AM | Last Updated on Fri, Dec 8 2017 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment