Trading Market
-
ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
స్టాక్‌మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు, సెబీ హెచ్చరిస్తున్నా వారి సూచనలు పట్టించుకోకుండా చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ నిపుణుల సలహాలు పట్టించుకోని ఓ బీటెక్ విద్యార్థి రెండేళ్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసి ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఆ విద్యార్థి రోషన్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.రోషన్ తెలిపిన వివరాల ప్రకారం..‘బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని నా వద్దకు వచ్చాడు. తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి హోటల్ నిర్వహిస్తోంది. పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్ల అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఆ డబ్బుతో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు నష్టపోవడంతో యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ట్రేడింగ్ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’ అని చెప్పారు.‘ఆ విద్యార్థి మిత్రుడు ఒకరు ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం నష్టం వస్తునపుడు ఆ ట్రేడింగ్‌ను మానేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే..ట్రేడింగ్‌కు బానిసైపోయా అని బదులిచ్చాడు. ఇంతలా నష్టపోయావు కదా.. భవిష్యత్తులో మళ్లీ ట్రేడింగ్ చేస్తావా? అని అడిగితే ఇకపై ట్రేడింగ్ చేయనని చెప్పాడు’ అని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ అన్నారు. ‘ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న దాదాపు 45.24 లక్షల మందిలో, కేవలం 11 శాతం మందే లాభాలు పొందుతున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు పొందవచ్చు. సంపద సృష్టికి అవకాశం ఉన్న విభాగంలోనే పెట్టుబడులు పెట్టండి’ అని ఆమె గతంలో మదుపర్లకు సూచించారు. -
డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్ఎస్ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. -
సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు
ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చేయడానికి ఒక దర్శకుడికి రూ.91 కోట్లు చెల్లించింది. కానీ అతడు స్టాక్మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి దాదాపు రూ.50 కోట్లు నష్టపోయినట్లు గురువారం కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 2018లో నెట్‌ఫ్లిక్స్ కార్ల్రిన్చ్ అనే దర్శకుడి నుంచి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ను కొనుగోలు చేసింది. 2020 నాటికి ఆ సిరీస్ కోసం రూ.366 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సరిపోలేదని మరింత కావాలని రిన్చ్ అడగడంతో నెట్‌ఫ్లిక్స్ రూ.91 కోట్లు ఇచ్చింది. కానీ ఆ డబ్బును ఫార్మాస్టాక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి రూ.50 కోట్లు నష్టపోయాడు. అయితే మిగతా రూ.33 కోట్లను డోజికాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్చేసి రూ.220 కోట్లు సంపాదించినట్లు సమాచారం. తర్వాత తాను ఖరీదైన ఐదు రోల్స్‌రాయిస్ కార్లు, ఒక ఫెరారీ కారు, ఫర్నీచర్, డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసినట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2021లో బయోటెక్ సంస్థకు చెందిన గిలియడ్ సైన్సెస్ షేర్లు పెరుగుతాయని రిన్చ్ పందెం వేసినట్లు కొన్ని కథనాలు ద్వారా తెలిసింది. తాజాగా అమెరికా మార్కెట్ ఎస్అండ్పీ 500 ఇండెక్స్ మరింత పడిపోతుందని ఆప్షన్ ట్రేడింగ్ చేసి కొన్ని వారాల వ్యవధిలోనే తాను రూ.50 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజా ఘటనపై నెట్‌ఫ్లిక్స్ తన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వడం మానేసి రిన్చ్పై దావా వేయనుందని సమాచారం. ఇదీ చదవండి: అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక ఇదిలాఉండగా కార్ల్రిన్చ్ గతంలో కేవలం ‘47 రొనిన్’ అనే ఒకే సినిమా రూపొందించడం గమనార్హం. ఈ మొత్తం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రిప్లైలు వైరల్‌గా మారుతున్నాయి. రిన్చ్ జీవితంపైనే మంచి సినిమా తీయచ్చని కొందరు, తాను స్కామ్ చేశాడని ఇంకొందరు పోస్ట్ చేస్తున్నారు. -
AP: ఈనామ్ బిడ్డింగ్‌లో మనదే రికార్డ్..
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) బిడ్డింగ్‌లలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. రికార్డుస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించడమే కాదు బిడ్డింగ్ల్లో కూడా రికార్డులు తిరగరాస్తోంది. కోటి బిడ్డింగ్లతో ఆదోని మార్కెట్ యార్డు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 45.63 లక్షల బిడ్స్‌తో కర్నూలు యార్డు రెండోస్థానంలో ఉంది. 2017–18లో ప్రారంభమైన ఈనామ్ దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మండీ (మార్కెట్ యార్డు)ల్లో అమలవుతోంది. మన రాష్ట్రంలో 33 యార్డులు ఈనామ్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలో 14.49 లక్షలమంది రైతులు, 3,532 మంది వ్యాపారులు, 2,302 మంది ఏజెంట్లు ఈనామ్‌లో రిజిస్టరయ్యారు. 203 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఈనామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో రూ.35 వేలకోట్ల విలువైన 58.74 లక్షల టన్నుల క్రయవిక్రయాలు ఈనామ్ ద్వారా జరిగాయి. ప్రధానంగా మిరప, పత్తి, పసుపు, నిమ్మ, టమాటా, బెల్లం, ఆముదం, ఉల్లి, వివిధరకాల పండ్లు, కూరగాయలను జాతీయస్థాయిలో రైతులు అమ్ముకుంటున్నారు. నాణ్యత పరీక్ష యంత్రాల ద్వారా ర్యాండమ్‌గా లాట్స్ నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లోనే పరిమాణంతో సహా ప్రదర్శిస్తారు. విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ము నేరుగా జమ అవుతోంది. ఆదోని యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల క్రయవిక్రయాలు ఆదోని యార్డు పరిధిలో మూడులక్షల మంది రైతులు, 503 మంది వ్యాపారులు, 429 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఆముదం, పూలవిత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఆదోని పరిధిలో 50కి పైగా స్పిన్నింగ్ మిల్స్ ఉండడంతో వ్యాపారులు ఆదోని మార్కెట్ యార్డులో ఈనామ్ టెండర్లో పాల్గొని పత్తికి పోటీపడి బిడ్డింగ్‌లు నమోదు చేస్తుంటారు. ఈనామ్ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు రాష్ట్రంలో ఈనామ్ పరిధిలో ఉన్న 33 మార్కెట్ యార్డుల్లో 64.29 లక్షల లాట్స్ మార్కెట్‌కు వచ్చాయి. వీటిలో ఒక్క ఆదోనిలోనే 11.34 లక్షల లాట్స్ ఉన్నాయి. ఈ సరుకు కోసం 300 మంది వ్యాపారులు పోటీపడగా, కోటి బిడ్డింగ్‌లు నమోదయ్యాయి. అత్యధికంగా 2020–21లో 2.26 లక్షల లాట్స్ కోసం 18.39 లక్షల బిడ్డింగ్స్ నమోదయ్యాయి. యార్డు పరిధిలో ఇప్పటివరకు రూ.3,607.28 కోట్ల విలువైన 6.97లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. రెండో స్థానంలో నిలిచిన కర్నూలు ఏఎంసీలో ఇప్పటివరకు 45.63 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. ఈ యార్డు పరిధిలో రూ.1,536 కోట్ల విలువైన 3.89 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. దేశంలో మూడోస్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని కోట మండీలో 36 లక్షల బిడ్స్ నమోదయ్యాయి. అరుదైన రికార్డు కోటి బిడ్డింగ్‌లను అధిగమించడం అరుదైన రికార్డు. అనతికాలంలోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి యార్డుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యార్డు పరిధిలో కల్పించిన మౌలిక వసతుల వలన పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతోపాటు వ్యాపారులకు నాణ్యమైన సరుకు లభిస్తోంది. – బి.శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్ యార్డు -
ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని ప్రీ-పాండమిక్ స్థాయిలకు పొడిగించింది. మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, లిక్విడిటీ కార్యకలాపాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ఆర్బీఐ ట్రేడింగ్ గంటలను తిరిగి మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు డిసెంబర్ 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 18, 2022లో కొన్ని మార్పులు చేసిన ఎనిమిది నెలల తర్వాత మరోసారి టైమింగ్స్‌ను పొడిగించింది. అంటే కోవిడ్ ముందున్నట్టుగా ట్రేడింగ్ గంటల పొడిగించింది.మార్కెట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5వరకు ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్నం 3:30తో పోలిస్తే గంటన్నర ఎక్కువ. ఇవే టైమింగ్స్ కమర్షియల్ పేపర్ , డిపాజిట్ మార్కెట్ సర్టిఫికేట్లకు, అలాగే రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్ మార్కెట్‌కి కూడా వర్తిస్తాయి. కాగా కోవిడ్ ఉధృతితో ఏప్రిల్ 2020లో స్టాక్‌మార్కెట్ సమయాన్ని కుదించిన సంగతి తెలిసిందే. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు కీలకం
ముంబై: దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం ప్రపంచ పరిణా మాలు, విదేశీ పెట్టుబడుల సరళీ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నా రు. ‘‘దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్, మార్జిన్లపై యాజమాన్యపు వ్యాఖ్యలు, ప్రభుత్వ మూల ధన వ్యయం, గ్రామీణ వృద్ధి తది తర అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల కదలికలు, ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చేయవచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 17,450 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 17,250–17, 150 శ్రేణిలో మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,700 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ హెడ్ అపూర్వ సేథ్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు దేశీయ జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గతవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయాయి. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు చైనా, జపాన్ దేశాల ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ డేటా నేడు(సోమవారం) విడుదల అవుతుంది. అమెరికా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను మంగళవారం వెల్లడించనుంది. యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ, చైనా వాణిజ్య గణాంకాలు బుధవారం వెలువడుతాయి. అదేరోజున ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, ఫ్రాన్స్ ట్రేడ్ డేటా, జపాన్ జీడీపీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. చైనా ద్రవ్యోల్బణ డేటాను శుక్రవారం ప్రకటించనుంది. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. 20 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం, క్రూడాయిల్ ధరల స్థిరీకరణల ప్రభావంతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. 2020, డిసెంబర్లో వచ్చిన రూ. 62,016 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం. అంతకుముందు జూలైలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గతేడాది (2021) అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ‘‘యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందనే స్పష్టత వచ్చింది. ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెల(సెప్టెంబర్)లోనూ ఎఫ్‌పీఐ నిధుల రాక కొనసాగవచ్చు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ప్రభావితం చేస్తాయి’’ అని ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా తెలిపారు. నేటి నుంచి తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ ఐపీవో తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ ఐపీఓ సెప్టెంబర్ 7న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 500 – 525గా ఉంది. గతవారాంతాన యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.363 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. -
ఇలెర్న్ మార్కెట్స్ ఆధ్వర్యంలో మెగా ట్రేడింగ్ కాంక్లేవ్
ఆన్లైన్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఇ లెర్న్ మార్కెట్స్ ఆధ్వర్యంలో మెగా ట్రేడింగ్ కాంక్లేవ్ జరగనుంది. 2022 ఏప్రిల్ 26 నుంచి 29 వరకు గోవా వేదికగా ఈ ఫేస్ టూ ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు మంది స్టాక్ మార్కెట్ ట్రేడ్ పండితులు ఈ సదస్సులో పాల్గొన బోతున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 250 మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరికి వివిధ అంశాలపై ప్రకాష్ గబ, వివేక్ బజాజ్, ప్రెమల్ ఫారెఖ్, శివకుమార్ జయచంద్రన్, విజయ్ థక్రె, చెతన్ పంచమియ, రాకేష్ బన్సల్, కునాల్ సరౌగి, పీయుష్ చౌదరి, అసిత్ బరన్ పతి, విషాల్ బి మల్కన్ మరియు సందీప్ జైన్లు మార్కెట్‌పై మరింత లోతైన అవగాహాన కల్పించనున్నారు. దీని కోసం లైవ్ మార్కెట్ స్ట్రాటజీ సెషన్లు నిర్వహించబోతున్నారు. ఒకప్పుడు స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ అంటే ముంబై, గుజరాత్‌లతో పాటు మెట్రో నగరాల్లోని వారే ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జిల్లా కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంత ప్రజలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడేళ్లుగా భారీగా పెరుగుతున్న డీమ్యాట్ అకౌంట్లే ఇందుకు నిదర్శనం. ఈ తరుణంలో ట్రేడర్లతో మంచి నెట్వర్క్ ఏర్పాటు చేయడం స్టాక్‌మార్కెట్ మీద సరైన అవగాహాన కల్పించడం లక్ష్యంగా ఈ కాంక్లేవ్ నిర్వహిస్తోంది ఈలెర్న్ మార్కెట్స్ సంస్థ. వివేక్ బజాజ్ 2014లో స్టాక్ఎడ్జ్తో పాటు ఈలెర్న్ మార్కెట్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్లైన్లో ప్రత్యేక యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కి సంబంధించిన తాజా ఆప్‌డేట్స్‌ని ఈ సంస్థ అందిస్తోంది. సుమారు 150 మంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈలెర్న్ టీమ్‌లో ఉన్నారు. -
వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్
ముంబై: భారత్‌లో వ్యాపార క్రియాశీలత పురోగతి వేగంగా కొనసాగుతోందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా పేర్కొంది. ఆగస్టు 29నాటికి వ్యాపార క్రియాశీలత కరోనా ముందస్తు స్థాయికి చేరుకుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► నోమురా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ 2021 ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 102.7కు ఎగసింది. దేశంలో కరోనా ముందస్తు.. అంటే 2020 మార్చి తరువాత ఇండెక్స్ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. అంతక్రితం ఆగస్టు 22వ తేదీతో ముగిసిన వారంలో ఇండెక్స్ 101.3 వద్ద ఉంది. మార్చి 2020 తర్వాత లాక్డౌన్లు, ఆంక్షల నేపథ్యంలో ఇండెక్స్ భారీగా పడిపోయింది. ► 2021 జూన్‌లో ఇండెక్స్ 15 శాతం పెరిగితే, జూలైలో ఈ వేగం 17.1 శాతంగా ఉంది. తొలి ఫలితాల ప్రకారం ఆగస్టు 29 నాటికి 5.6 శాతంగా నమోదయ్యింది. ► ఆగస్టు 29వ తేదీనాటికి గూగుల్ రిటైల్, రిక్రియేషన్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగితే, యాపిల్ డ్రైవింగ్ ఇండిసీస్ 10 శాతం ఎగసింది. వర్క్‌ప్లేస్ మొబిలిటీ ఇండెక్స్ 3.7 శాతం పడిపోయినప్పటికీ, గూగుల్, యాపిల్ సంబంధిత ఇండెక్స్‌లు పెరగడం గమనార్హం. ► విద్యుత్ డిమాండ్ వారం వారీగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ► ఇక కార్మికుల భాగస్వామ్య సూచీ 40 శాతం నుంచి 40.8 శాతానికి ఎగసింది. మూడవవేవ్ను తోసిపుచ్చలేం... కాగా రానున్నది పండుగల సీజన్ కావడంతో మూడవవేవ్ ముప్పును త్రోసిపుచ్చలేమని నోమురా హెచ్చరించడం గమనార్హం. ఆగస్టు 29వ తేదీతో ముగిసిన వారంలో 7 రోజుల సగటు (మూవింగ్ యావరేజ్) కేసులు 9,200 పెరిగి 41,000కు చేరినట్లు నోమురా పేర్కొంది. కేసులు పెరుగుతుండడంపై ఇంకా మిశ్రమ వార్తలు వస్తున్నాయని తెలుపుతూ, ఇది మూడవ వేవ్‌కు సంకేతం కావచ్చనీ విశ్లేషించింది. అలాగే ఇదే సమయంలో వ్యాక్సినేషన్ మూవింగ్ యావరేజ్ వారం వారీగా 47 లక్షల డోసుల నుంచి 71 డోసులకు పెరిగిందని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే 2021 డిసెంబర్ ముగిసే నాటికి భారత్‌లో దాదాపు 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉందని పేర్కొంది. వృద్ధి 10.4 శాతం మూడవ వేవ్ సమస్యలు తలెత్తకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ ఎకానమీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని తన నివేదికలో నోమురా పేర్కొంది. -
కోలుకున్న స్టాక్ మార్కెట్
ముంబై: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరకు కోలుకుంది. సాయంత్రం 4 గంటలకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 134 పాయింట్లు లాభపడి 52,904 దగ్గర క్లోజయ్యింది. ఉదయం 52,801 దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత గంట పాటు క్రమంగా పాయింట్లు కోల్పోతూ నష్టపోయింది. అనంతరం ఇన్వెస్టరు ఆసక్తి చూపించడంతో మార్కెట్ కోలుకుంది. ఈ రోజు సెన్సెక్స్ గరిష్టంగా 15,877 పాయింట్లు తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 15,808 పాయింట్ల దగ్గర మొదలై ఒక దశలో 15,877 గరిష్టానికి చేరుకుంది. చివరకు 41 పాయింట్లు లాభపడి 15,853 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ షేర్లు లాభపడగా మారుతి సుజూకి, హిందుతస్థాన్ యూనిలీవర్, నెస్టల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మాలు నష్టపోగా, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. -
ఊగిసలాట మధ్య స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కుట్లు శుక్రవారం ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం సెన్సెక్స్ 52,699.00 వద్ద క్లోజ్ అవ్వగా ఈ రోజు ఉదయం 52,877.16తో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం పదిన్నర గంటలకి 52,677 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇప్పటి వరకు సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టోయింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 15,789 వద్ద ట్రేడ్ అవుతూ 0.8 పాయింట్లతో నష్టంతో కొనసాగుతోంది. లాభాలు ఈ రోజు టాటా స్టీల్, మారుతి సుజుకి ఇండియాతో పాటు ఐటి స్టాక్స్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాభాలు పొందయి. సర్వసభ్య సమావేశం వివరాలు వెల్లడైనా రిలయన్స్ సూచీలు ప్లాట్‌గా కొనసాగుతున్నాయి. రిలయన్స్ విషయంలో ముదుపరులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
72 వేల కోట్ల అమ్మకాలు; చైనాకు భారీ నష్టం!
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా సుమారు 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) వెల్లడించింది. దేశంలోని ప్రధాన మార్కెట్ల(పట్టణాల) నుంచి సేకరించిన వివరాల ప్రకారం పండుగ నేపథ్యంలో ఈ మేరకు భారీ మొత్తంలో టర్నోవర్ జరిగిందని, దీంతో చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ అంబానీ, టాటా, అజీం ప్రేమ్‌జీ, మిట్టల్ తదితర దేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు సీఏఐటీ గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ బ్యాన్ చైనా అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్‌బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా సుమారు 72 వేల కోట్ల మేర టర్నోవర్ జరిగింది.తద్వారా చైనా మార్కెట్‌కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం’’ అని పేర్కొంది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాగ్రి, ఫర్నీచర్, వాల్‌హ్యాంగింగ్స్, బంగారం, ఆభరణాలు, ఫుట్‌వేర్, వాచ్‌లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామాగ్రి, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్, గిఫ్ట్ ఐటెంలు, స్వీట్లు తదితర వస్తువలు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. (చదవండి: ఆర్సీఈపీపై సంతకాలు.. చైనా ప్రాబల్యం!) కాగా ఈ ఏడాది జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్‌టాక్, వీచాట్ తదితర చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో డ్రాగన్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. -
ఈ చిన్న షేర్లు- ఒకటే దూకుడు
చైనాతో సరిహద్దు వివాదం, పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ఆటుపోట్ల మధ్య ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం జోరందుకున్నాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు జంప్‌చేసి 33,765కు చేరగా.. 72 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 9,953 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో బీహెచ్ఈఎల్, టైమ్ టెక్నోప్లాస్ట్, ఐగరషీ మోటార్స్ ఇండియా, సాల్జెర్ ఎలక్ట్రానిక్స్, లోకేష్ మెషీన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐగరషీ మోటార్స్ ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 47 ఎగసి రూ. 281 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 50,000 షేర్లు చేతులు మారాయి. సాల్జెర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్, రోటరీ స్విచ్‌ల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 15 ఎగసి రూ. 92 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 43,000 షేర్లు చేతులు మారాయి. లోకేష్ మెషీన్స్ మెషీన్లు, ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 3.7 ఎగసి రూ. 22 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 79,000 షేర్లు చేతులు మారాయి. టైమ్ టెక్నోప్లాస్ట్ భారీ ప్యాకేజింగ్ సొల్యూషన్ల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లింది. రూ. 5 ఎగసి రూ. 42 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 40,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 8.56 లక్షల షేర్లు చేతులు మారాయి. బీహెచ్ఈఎల్ విద్యుత్ రంగ పరికరాల ఈ పీఎస్‌యూ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం జంప్ చేసింది. రూ. 3.5 ఎగసి రూ. 31 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 41 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.35 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
ప్యాకేజీ ఆశలతో చివర్లో రికవరీ
ముంబై : ప్రపంచవ్యాప్తంగా రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా మంగళవారం పతనమైంది. భారీ నష్టాల నుంచి మార్కెట్ కోలుకున్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లో లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు తప్పలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 75.51కు చేరడం, లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తారన్న అంచనాలు... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దీపన చర్యలు ప్రకటించవచ్చన్న ఆశలతో ట్రేడింగ్ చివర్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 716 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 190 పాయింట్ల నష్టంతో 31,371 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 195 పాయింట్ల వరకూ పతనమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 43 పాయింట్లు నష్టంతో 9,197 పాయింట్ల వద్దకు చేరింది. రోజంతా నష్టాలు... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో నష్టాలు కొంచెం తగ్గాయి. రిలయన్స్ జియో–ఫేస్బుక్ డీల్‌కు వ్యతిరేకంగా జస్టిస్ బి.ఎన్. కృష్ణ వ్యాఖ్యలు చేయడంతో మార్కెట్ బలహీనంగా ట్రేడైందని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఎస్. రంగనాధన్ వ్యాఖ్యానించారు. అయితే హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల దన్నుతో నష్టాలు తగ్గాయని వివరించారు. మరోవైపు కరోనా కేసులు తొలిసారిగా వచ్చిన వూహాన్లో చాలా వారాల తర్వాత రెండు రోజుల్లో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దక్షిణ కొరియాలో కూడా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 1 శాతం, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. • రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం నష్టంతో రూ.1,480 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ పది శాతం మేర పెరగడంతో లాభాల స్వీకరణ జరిగింది. • దాదాపు 130కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. నేడు భారీ గ్యాపప్‌తో ఓపెనింగ్! ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి గం.8.00కు ప్రకటించారు. ఈ తాజా ప్యాకేజీ, గతంలోని ప్యాకేజీ, ఆర్బీఐ ఉద్దీపనలను కూడా కలుపుకుంటే, మొత్తం ఉద్దీపన చర్యల విలువ రూ. 20 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఇది మన జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం. ఈ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ భారీగా లాభపడింది. రాత్రి 11.30 ని.సమయానికి 426 పాయింట్లు (4.6 శాతం) లాభంతో 9,600 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు మన మార్కెట్ భారీ లాభాలతో ఆరంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ ప్యాకేజీ కోసమే మార్కెట్ ఎదురు చూస్తోందని, ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. -
ట్రేడింగ్ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటు, మొబైల్ నుంచే అన్ని రకాల సేవలు, విస్తృతమైన సమాచారం ఇవన్నీ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మరి ట్రేడింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్నవారు ఇందుకు సంబంధించిన పన్ను బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఇంట్రాడే ట్రేడింగ్ (ఒకే రోజు కొని, విక్రయించడం) ద్వారా వచ్చే లాభ/నష్టాలను వ్యాపార ఆదాయంగా చట్టం పరిగణిస్తుంది. బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా వచ్చిన లాభాలుగా (పీజీబీపీ) వీటిని చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్‌గా వేరు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్‌పై వచ్చే లాభ, నష్టాలను స్పెక్యులేటివ్‌గా పరిగణించాలి. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ద్వారా వచ్చే లాభ, నష్టాలు నాన్ స్పెక్యులేటివ్ అవుతాయి. పీజీబీపీ కింద స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాలన్నవి మీ పన్ను వర్తించే ఆదాయానికే కలుస్తాయి. మీ ఆదాయం ఏ శ్లాబు పరిధిలో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి. మినహాయింపులు అయితే, వ్యాపార ఆదాయం కింద చూపించే స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాల నుంచి, మీకు అయిన ఖర్చులను మినహాయించుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్రోకర్ల కమీషన్, డీమ్యాట్ చార్జీలు, ఇంటర్నెట్ ఖర్చులు ఇవన్నీ కూడా ట్రేడింగ్ కోసం చేసిన ఖర్చులే అవుతాయి. కనుక మొత్తం లాభాల్లో ఈ ఖర్చులను మినహాయించుకున్న తర్వాతే మిగిలిన ట్రేడింగ్ ఆదాయాన్ని పేర్కొంటే సరిపోతుంది. అయితే, నష్టాలు వస్తే మాత్రం స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఆదాయంపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్‌అండ్‌వో నుంచి నాన్ స్పెక్యులేటివ్ రూపంలో నష్టం వచ్చిందనుకుంటే... ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తి వేతనం మినహా ఇతర ప్రధాన ఆదాయం నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికీ నష్టం మిగిలిపోతే దాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల కోసం బదలాయించుకోవచ్చు. తద్వారా తర్వాతి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకోండి, అలాగే, అద్దె రూపంలో మరో రూ.2 లక్షలు వచ్చిందనుకోండి.. వీటికి అదనంగా ఎఫ్అండ్వోలోనూ వేలుపెట్టి రూ.3 లక్షలు నష్టపోయారనుకుందాం. అప్పుడు మీ ఆదాయం రూ.6 లక్షలే. వాస్తవంగా వేతనం రూపంలో రూ.6 లక్షలు, అద్దె రూపంలో రూ.2 లక్షలు కలిపితే ఆదాయం రూ.8 లక్షలు. కానీ అద్దె ఆదాయం రూ.2 లక్షల్లో, నష్టం రూ.2 లక్షలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఇతర ఆదాయం రూ.2 లక్షలే ఉండడంతో రూ.3 లక్షల నష్టం వచ్చినా కానీ, కేవలం రూ.2 లక్షలు మినహాయించుకోవడం జరిగింది. మిగిలిన రూ.లక్ష నష్టాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు. ఇక ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ స్పెక్యులేటివ్ కిందకు వస్తుంది కనుక.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నష్టం వస్తే దాన్ని కేవలం స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే మినహాయించుకునేందుకు వీలుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన స్పెక్యులేటివ్ నష్టాన్ని, అదే సంవత్సరం స్పెక్యులేటివ్ ఆదాయం కింద సర్దుబాటుకు వీలు పడకపోతే, తదుపరి 4 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే స్పెక్యులేటివ్ నష్టాలను, స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. నాన్ స్పెక్యులేటివ్(ఎఫ్‌అండ్‌వో) ఆదాయం నుంచి స్పెక్యులేటి వ్ నష్టాలను మినహాయించుకోవడానికి కుదరదు. ఆడిటింగ్ అవసరమే... స్టాక్ ట్రేడింగ్ ఆదాయం వ్యాపార ఆదాయం అవుతుంది కనుక ఆదాయపన్ను చట్టం ప్రకారం ఆడిట్ తప్పనిసరి. ఆదాయపన్ను చట్టం ప్రకారం వ్యాపార ఆదాయం రూ.కోటి దాటితే ఆడిట్ తప్పనిసరి అవుతుంది. ట్రేడింగ్ రూపంలో వచ్చిన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలా? అని చాలా మంది పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు ఎదుర్కొనే సందేహం. ఈ విషయమై క్లియర్‌ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా స్పందిస్తూ... ఒక వ్యక్తి వార్షిక టర్నోవర్ రూ.కోటి దాటకపోతే కనుక నష్టాలను మినహాయించి చూపించుకునేందుకు, తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునేందుకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు. అయితే, తమకు ఇంత ఆదాయం వస్తుందంటూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించే ‘ప్రిజంప్టివ్ ట్యాక్స్ స్కీమ్’ కింద రిటర్నులు దాఖలు చేసే వారికి ట్యాక్స్ ఆడిట్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద టర్నోవర్‌లో 6/8 శాతం కంటే తక్కువ లాభం (ట్రేడింగ్ రూపంలో) ఉందని చూపిస్తే మాత్రం ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో ఇతర మార్గాలు అయిన.. వేతనం, అద్దె ఆదాయం, వ్యాపార రూపంలో ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు మించి ఉన్నా కానీ ఆడిటింగ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు.. ఓ వ్యక్తి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పథకం కింద తనకు ట్రేడింగ్‌పై నష్టం వచ్చినట్టు చూపించారనుకోండి... అదే సమయంలో ఆ వ్యక్తి మొత్తం ఆదాయం (వేతనం సహా) రూ.2.5 లక్షలు మించి ఉంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం అవుతుంది. టర్నోవర్ అంటే... టర్నోవర్ అంటే ఏమిటీ..? అన్న సందేహం వస్తే... ఉదాహరణకు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటిల్మెంట్లో పేయింగ్ అవుట్/పేయింగ్ ఇన్ తేడాయే టర్నోవర్ అవుతుంది. అంటే రూ.5 లక్షలు కొనుగోలు చేసి, రూ.4 లక్షలకు అమ్మితే, మిగిలిన రూ.లక్ష టర్నోవర్ అవుతుంది. అదే ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ అయితే, నికర లాభం, నష్టం, ఆప్షన్లపై ప్రీమియం టర్నోవర్ కిందకు వస్తాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టును రూ.5,00,000కు కొనుగోలు చేసి, దాన్ని రూ.5,50,000కు విక్రయించారని అనుకుంటే... అప్పుడు లాభం రూ.50,000 వచ్చినట్టు అవుతుంది. ఇదే టర్నోవర్ అవుతుంది. అదే ఆప్షన్ కాంట్రాక్టులో ఫలానా కంపెనీ లాట్ (1,000 షేర్లు)ను రూ.200కు కొనుగోలు చేసి రూ.180కు అమ్మారనుకోండి. ఈ కేసులో రూ.20,000 నష్టంతోపాటు, ట్రేడర్‌కు నికరంగా లభించే ప్రీమియం రూ.1,80,000 కూడా టర్నోవర్ కిందకు వస్తుంది. ఈ రెండు కేసులను కలిపి చూస్తే, ఫ్యూచర్ కాంట్రాక్టులో నికర లాభం రూ.50,000తోపాటు, ఆప్షన్ కాంట్రాక్టులో మొత్తం రూ.2 లక్షలు కలిపి టర్నోవర్ రూ.2,50,000 అవుతుంది. -
ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ దృష్టి!
ముంబై: గత వారాంతాన ఆగస్టు సిరీస్ తొలి రోజు ట్రేడింగ్ లాభాలను నమోదుచేసినప్పటికీ.. వారం మొత్తం మీద చూస్తే బేర్స్‌దే హవాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇన్ ఫ్రా, మెటల్ స్టాక్స్ నష్టాల కారణంగా ప్రధాన సూచీలు 1.2 శాతం నష్టపోయి.. వరుసగా మూడో వారంలోనూ నష్టాలను మిగిల్చాయి. ప్రపంచ టాప్–15 మార్కెట్లలో మే నెల నుంచి ఇప్పటివరకు ఇతర దేశాల సూచీలు 18 శాతం వరకు లాభాలను ఇవ్వగా.. కేవలం దేశీయ స్టాక్ సూచీలు మాత్రమే 2 శాతం (డాలర్ రాబడుల లెక్కన) నష్టాలను మిగిల్చాయి. బడ్జెట్లో సూపర్ రిచ్‌పై సర్‌చార్జ్ విధించిన నేపథ్యంలో పడిపోతూ వస్తోన్న దేశీ ప్రధాన సూచీలు ఈవారంలోనైనా కోలుకుంటాయా? లేదంటే.. మరింత పతనమవుతాయా? అనే ఆందోళనకర వాతావరణానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ఈవారంలో వెలువడే కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక అంశాలు దిక్సూచీలుగా మారనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి సంకేతాలు ఏవైనా కనిపిస్తేనే మళ్లీ భారత మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతుంది. వీరి పెట్టుబడులను ఆకర్షిస్తే మార్కెట్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ)ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి ప్రకటించనున్నారు. ప్రస్తుతం అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా యూఎస్ ఎకానమీ క్రమంగా దెబ్బతింటోన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసమైనా ఎఫ్ఓఎంసీ ఈసారి పావు శాతం మేర వడ్డీ రేట్లలో కోత విధించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాయిటర్స్ పోల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించగా.. మరి కొందరి అంచనా ప్రకారం అర శాతం వరకు కోత ఉంటే మాత్రం ఇది భారత మార్కెట్‌కు కూడా సానుకూల పరిణామంగా మారనుందని జియోజిత్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ తన అంచనాను ప్రకటించారు. ఈవారంలోనే ఎస్బీఐ, ఐటీసీ ఫలితాలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, ఐఓసీ, యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దాదాపు 400 కంపెనీల క్యూ1 ఫలితాలు ఈవారంలో వెల్లడికానుండగా.. ఈ జాబితాలో అశోక్ లేలాండ్, డీఎల్ఎఫ్, బాటా ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ వంటివి ఉన్నాయి దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీనపడినందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడిందని, ఈ సమయంలో కంపెనీల ఫలితాలు నిరాశపరిస్తే మాత్రం పతనం కొనసాగుతుందని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ రోమేష్ తివా రీ అన్నారు. హెచ్‌యూఎల్ వృద్ధి ఏకంగా ఏడు త్రైమాసికాల కనిష్టస్థాయికి పడిపోయిన అంశం ఆధారంగా చూస్తే.. సెంటిమెంట్ మరికొంతకాలం బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. జూన్ మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు బుధవారం విడుదల కానుండగా.. జూలై మార్కిట్ తయారీ పీఎంఐ డేటా గురువారం వెల్లడికానుంది. ఇక అమెరికా–చైనా దేశాల సంధానకర్తల సమావేశం మంగళవారం షాంఘైలో జరగనుంది. జూలైలో 3,700 కోట్లు ఉపసంహరణ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జూలై 1–26 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.14,383 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. గడిచిన ఐదు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా కొనసాగుతున్న వీరు.. సూపర్ రిచ్ ట్యాక్స్ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్ మార్కెట్లో రూ.10,624 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ రూ.3,700 కోట్లకు పరిమితమైంది. -
ఆరు రోజుల ఎత్తు నుంచి కిందకు..!
ముంబై: ఆరు ట్రేడింగ్ సెషన్ల వరుస రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 43పైసలు నష్టపోయి 68.96 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు వచ్చిన డిమాండ్ తాజా రూపాయి బలహీనతకు కారణాల్లో ఒకటని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వరుసగా ఆరు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 161 పైసలు లాభపడ్డంతో, కొందరు ట్రేడర్లు లాభా ల స్వీకరణకు దిగారని కూడా విశ్లేషణలు ఉన్నాయి. కాగా సోమవారం కీలక నిరోధాన్ని (68.50) అధిగమించిన రూపాయి, దీనిని మరుసటిరోజే నిలబెట్టుకోలేకపోవడం వల్ల తాజా ర్యాలీ మరింత కొనసాగడంపై అనుమానాలూ ఉన్నాయి. ఈ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 68.53 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఒక దశలో 69.05ను కూడా చూసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
53 పైసలు పతనమైన రూపాయి
ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 53 పైసలు నష్టపోయింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా రాజీనామా చేయడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో డాలర్‌తో రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలర్‌తో రూపాయి విలువ 71.32 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 110 పైనల నష్టంతో 72.42 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో కోలుకుని 71.67ను తాకింది. చివరకు 53 పైసల నష్టంతో 71.85 వద్ద ముగిసింది. 110 పైసల భారీ నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించినప్పటికీ, స్టాక్ సూచీలు నష్టాల నుంచి లాభాల్లో ముగియడం, చివర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు డాలర్లను విక్రయించడంతో రూపాయి నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. -
రూపాయి ఆరు రోజుల పతనానికి బ్రేక్..
ముంబై: వరుసగా ఆరు సెషన్ల రూపాయి పతనానికి బ్రేక్ పడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ 18 పైసలు బలపడి 74.21 వద్ద క్లోజయ్యింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్)లో ఒకింత మెరుగ్గా 74.18 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఒక దశలో 74.05 గరిష్ట స్థాయికి కూడా తాకింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా ఎగుమతిదారులు అమెరికా కరెన్సీని విక్రయించడం ఇందుకు తోడ్పడింది. అయితే, ప్రారంభ లాభాలు కొంత వదులుకున్న రూపాయి.. చివరికి 18 పైసల లాభంతో 74.21 వద్ద క్లోజయ్యింది. దీంతో వరుసగా ఆరు సెషన్ల పతనం తర్వాత తొలిసారిగా దేశీ కరెన్సీ కోలుకున్నట్లయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి కొత్త కనిష్ట స్థాయి 74.39కి పడిపోయిన సంగతి తెలిసిందే. దేశీ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కూడా రూపాయి బలపడటానికి తోడ్పడి ఉంటుందని ట్రేడర్స్ అభిప్రాయపడ్డారు. అలాగే, పండుగల సీజన్లో ద్రవ్య లభ్యతను మెరుగుపర్చేందుకు అక్టోబర్ 11న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా రూ. 12,000 కోట్ల మేర నిధులను వ్యవస్థలో అందుబాటులోకి తేవాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం కూడా రూపాయి రికవరీకి దోహదపడిందని వివరించారు. ఇక, నగదు సంక్షోభంలో చిక్కుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను ఆదుకునే దిశగా సుమారు రూ. 45,000 కోట్ల అసెట్స్‌ను కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రకటించడమూ సానుకూలంగా మారిందని ట్రేడర్లు తెలిపారు. -
ఇక అర్ధరాత్రి వరకు ట్రేడింగ్...!
ముంబై: ఈక్విటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ను అర్ధరాత్రి వరకు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎన్ఎస్ఈ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం డెరివేటివ్‌లలో ట్రేడింగ్ స్పాట్ మార్కెట్‌తో సమానంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తోంది. అయితే, సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 11.55 మధ్య రెండో సెషన్ నిర్వహించాలన్నది ఎన్ఎస్ఈ యోచన. మరి రెండో సెషన్లో కేవలం ఇండెక్స్ డెరివేటివ్‌ల ట్రేడింగ్ మాత్రమే ఉంటుందా లేక స్టాక్ డెరివేటివ్‌లు ఉంటాయా అన్న దానిపై స్పష్టత లేదు. ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 11.55 వరకు డెరివేటివ్ ట్రేడింగ్ నిర్వహించేందుకు సెబీ ఈ ఏడాది మే నెలలోనే సమ్మతి తెలియజేసింది. దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్లో 90% వాటా ఎన్ఎస్ఈ చేతిలోనే ఉండడంతో ఈ సంస్థ తొలుత ఈ దిశగా అడుగు వేయడం గమనార్హం. మరో ప్రధాన ఎక్సే్చంజ్ బీఎస్ఈ నిర్ణయం ఏంటన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికి కమోడిటీ ఎక్సే్చంజ్‌లు మాత్రమే అర్ధరాత్రి వరకు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈక్విడీ డెరివేటివ్ ట్రేడింగ్ వేళలను అర్ధరాత్రి వరకు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తామని... అదనపు వేళల కారణంగా అయ్యే ఖర్చులను సర్దుబాటు చేసుకునేంత వ్యాపారం ఉండదని బ్రోకర్లు పేర్కొంటున్నారు. -
ఐదో రోజూ లాభాలే..
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు మన మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆశావహ వృద్ధి అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 33,940 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 10,417 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ మొత్తం 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 921 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 6 వారాల గరిష్టానికి, నిఫ్టీ 4 వారాల గరిష్ట స్థాయికి ఎగిశాయి. 231 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 101 పాయింట్ల లాభంతో 33,982 పాయింట్లను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో 130 పాయింట్ల నష్టంతో 33,751 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా రోజంతా 231 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆల్‌టైమ్ హైకి హెచ్‌యూఎల్: హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,420ను తాకింది. చివరకు 1.2 శాతం లాభంతో రూ. 1,409 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీని తోసిరాజని రూ.3.04 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో మార్కెట్ క్యాప్ పరంగా ఐదవ అతి పెద్ద కంపెనీగా హెచ్‌యూఎల్ అవతరించింది. -
ఎమ్‌సీఎక్స్‌లో ఇత్తడి ఫ్యూచర్స్
ముంబై: మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎమ్‌సీఎక్స్) ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ నెల 26 నుంచి ఏప్రిల్, మే, జూన్ నెల కాంట్రాక్టులను ఆఫర్ చేస్తామని ఎమ్‌సీఎక్స్ తెలిపింది. లాట్ సైజ్ ఒక టన్ను అని ఎమ్‌సీఎక్స్ ఎండీ, సీఈఓ మృగాంక్ పరాంజపే తెలిపారు. ఇత్తడి ఫ్యూచర్స్... ఇత్తడి లోహానికి వ్యవస్థీకృత ధరను నిర్ణయించే ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా జాతీయ స్థాయి ప్రమాణ ధరగా కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ధరలకు సంబంధించి నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా ఈ ఇత్తడి ఫ్యూచర్స్ ఉపయోగపడతాయన్నారు. ఐరన్ కాకుండా తప్పనిసరి డెలివరీ ఆప్షన్ ఉన్న తొలి ఫ్యూచర్స్ కూడా ఇదేనని తెలిపారు. డెలివరీ సెంటర్ అయిన జామ్‌నగర్ వేర్‌హౌస్ ధర కోట్ అవుతుందని, అన్ని ట్యాక్స్‌లు, సుంకాలు దీంట్లో కలిసి ఉంటాయని, జీఎస్టీ అధికమని వెల్లడించారు. హెడ్జింగ్‌కు వీలు: ఇత్తడికి మంచి ధర వచ్చేలా ఈ ఇత్తడి ఫ్యూచర్స్ తోడ్పడుతాయని, ఇది ఈ లోహ సంబంధిత దిగుమతిదారులు, ఎగుమతిదారులు, తయారీదారులు, రిఫైనరీ, ప్రాసెసింగ్ చేసే వ్యక్తులకు ప్రయోజనకరమని పరాంజపే తెలిపారు. ఇత్తడి తయారీకి కావలసిన మొత్తం స్క్రాప్‌ను దాదాపు దిగుమతి చేసుకుంటున్నామని జామ్‌నగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తుల్సీభాయ్ గజేరా చెప్పారు. ఈ షిప్‌మెంట్స్ భారత్‌లోకి వచ్చేదాకా వాటి ధరల వివరాలు నిర్ణయం కావన్నారు. ఎమ్‌సీఎక్స్ ఇత్తడి ఫ్యూచర్స్ వల్ల దిగుమతిదారులు తమ నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకునే వీలు కలుగుతుందని వెల్లడించారు. -
ఇక క్రాస్ కరెన్సీ ట్రేడింగ్!
న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ) నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ మొదలవుతోంది. ఈ నెల 27 నుంచి క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్‌ను ప్రారంభిస్తున్నామని, క్రాస్ ఇండియన్ రూపీ (ఐఎన్ఆర్) ఆప్షన్స్‌ను కూడా ఆరంభిస్తామని బీఎస్ఈ వెల్లడించింది. ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకూ ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీలో (ఎంసీఎక్స్) కరెన్సీ ట్రేడింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది. అంటే రూపాయి – డాలర్, రూపాయి – పౌండ్ స్టెర్లింగ్, రూపాయి – జపనీస్ యెన్‌లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంది. ఇకపై యూరో– అమెరికా డాలర్, పౌండ్ స్టెర్లింగ్– అమెరికా డాలర్, అమెరికా డాలర్– జపనీస్ యెన్ జోడీల్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు తమకు సెబీ అనుమతినిచ్చినట్లు బీఎస్ఈ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశీష్ కుమార్ చౌహాన్ చెప్పారు. -
రూపాయి రయ్..!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలహీనత... దేశీయంగా ఆర్థిక అంశాల బులిష్‌గా ఉండటం వంటి అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నాయి. మంగళవారం వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలపడింది. ఐదు గంటలతో ట్రేడింగ్ ముగిసే దేశీయ ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 20 పైసలు లాభపడింది. అంటే సోమవారం 63.68 వద్ద ముగిసిన రూపాయి మంగళవారం 63.48 వద్దకు చేరింది. ఉదాహరణకు ఒక డాలర్‌కు సోమవారం రూ.63.68 ఇవ్వాల్సి ఉంటే, మంగళవారం రూ.63.48 ఇస్తే సరిపోతుందన్నమాట. రూపాయి గడచిన రెండున్నరరేళ్లలో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. 2015 జూలై 17న రూపాయి విలువ 63.47. ఎందుకిలా పెరిగిందంటే... కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం నెలకొనటంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఫలిస్తాయన్న విశ్వాసమూ ఎక్కువే ఉంది. దీంతో దేశానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇవన్నీ కలిసి రూపాయి బలోపేతానికి కారణమయ్యాయి. 52 వారాల క్రితం అంటే ఏడాది కిందట... ఏకంగా 68.80 కనిష్ట స్థాయికి చేరిన రూపాయి అందరి అంచనాలకూ భిన్నంగా ప్రస్తుతం 63.48 స్థాయికి బలోపేతం అయ్యింది. అంటే అప్పట్లో రూపాయి బలహీనంగా ఉంది కనక ఒక డాలర్‌కు రూ.68.80 ఖర్చుచేయాల్సి వచ్చేంది. ఇపుడైతే రూ.63.48 చాలు. అంతర్జాతీయ మార్కెట్లో 103.50 స్థాయికి చేరిన డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు సంవత్సన్నర కాలంలో భారీస్థాయిలో పతనం కావడం రూపాయి పటిష్ఠానికి ప్రధాన కారణాల్లో ఒకటి. గడచిన నాలుగు రోజుల్లోనే రూపాయి 67 పైసలు లాభపడింది. అంతర్జాతీయంగా రెండు నెలల క్రితం డాలర్ ఇండెక్స్ 90.99 స్థాయికి చేరినప్పుడు దాదాపు 63.60 స్థాయికి చేరిన రూపాయి, మళ్లీ డాలర్ ఇండెక్స్ 95 స్థాయికి చేరడంతో తిరిగి దాదాపు 65 స్థాయికి పడింది. ఇప్పుడు మళ్లీ డాలర్ ఇండెక్స్ బలహీనం (ఈ వార్త రసే సమయం రాత్రి 9గంటలకు 91.69 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో రూపాయి 63.46 వద్ద ట్రేడవుతోంది) రూపాయి బలోపేతానికి ప్రధాన కారణాల్లో ఒకటయ్యింది. -
బిట్‌కాయిన్@ 16,000 డాలర్లు
లండన్: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఇది కీలకమైన 15,000 డాలర్ల స్థాయిని దాటేసింది. గురువారం ఒక దశలో 16వేల డాలర్ల పైన ట్రేడయింది. దీంతో ’బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్న’ బిట్‌కాయిన్ ఇతర ప్రధాన మార్కెట్లకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుందోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం వ్యవధిలోనే 50 శాతం పెరిగి 12,000 డాలర్ల స్థాయిని తాకిన బిట్‌కాయిన్ అంతలోనే మళ్లీ 16,000 డాలర్లకు ర్యాలీ చేయడం గమనార్హం. ‘ఊహించడానికి సాధ్యంకానంత స్థాయిలో కొత్త ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీని పోగు చేసుకుంటున్నారు. దీంతో బిట్‌కాయిన్ ప్రస్తుతం బ్రేకుల్లేని రైలులాగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది‘ అని ఆస్ట్రేలియాకి చెందిన ఏఎస్ఆర్ వెల్త్ సంస్థ సలహాదారు షేన్ చానెల్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ విపరీతమైన ఉత్సుకత కాస్త తగ్గితే.. కచ్చితంగా బిట్‌కాయిన్ విలువ కరెక్షన్‌కి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్‌టీసీ)... ఇటీవలే ప్రధాన ఎక్సే్ఛంజీల్లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌కి అనుమతించింది. ఇది ఈ కరెన్సీకి మరింతగా ఊతమిచ్చిందని అంచనా. సీబీవోఈ ఫ్యూచర్స్ ఎక్సే్ఛంజీలో ఈ వారాంతం నుంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యూచర్స్ మార్కెట్ షికాగో మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో (సీఎంఈ) డిసెంబర్ 18 నుంచి బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అందుబాటులోకి రానుంది. హ్యాకింగ్‌పై నైస్ హ్యాష్ విచారణ.. దాదాపు 64 మిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 4,700 బిట్కాయిన్లు హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైన ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్లొవేనియాకి చెందిన బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజ్ నైస్ హ్యాష్ వెల్లడించింది. గురువారం ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది. 2009లో తెరపైకి వచ్చిన బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాది తొలినాళ్లలో (జనవరిలో) 752 డాలర్లుగా ఉండేది. నాటకీయ ఫక్కీలో ఇటీవలి కాలంలో అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాఫ్ట్వేర్ కోడ్ రూపంలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదు. ఈ కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలంటూ దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు చేస్తూనే ఉంది.