
ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 53 పైసలు నష్టపోయింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా రాజీనామా చేయడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో డాలర్‌తో రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలర్‌తో రూపాయి విలువ 71.32 వద్ద ముగిసింది.
దీంతో పోలిస్తే మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 110 పైనల నష్టంతో 72.42 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో కోలుకుని 71.67ను తాకింది. చివరకు 53 పైసల నష్టంతో 71.85 వద్ద ముగిసింది. 110 పైసల భారీ నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించినప్పటికీ, స్టాక్ సూచీలు నష్టాల నుంచి లాభాల్లో ముగియడం, చివర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు డాలర్లను విక్రయించడంతో రూపాయి నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment