
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా వెనక్కు జారింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 88 పైసలు తగ్గి 70.46కు పడిపోయింది. గడచిన మూడు నెలల్లో ఒకరోజు రూపాయి ఇంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇటీవల గరిష్ట స్థాయిల నుంచి 30 డాలర్లు దిగివచ్చిన క్రూడ్ ధరలు తిరిగి పెరిగే అవకాశాలు (క్రూడ్ ఉత్పత్తి కోతలకు రష్యా, సౌదీ అరేబియా నిర్ణయం) ఉన్నాయన్న అంచనాలు, ప్రధాన కరెన్సీలతో డాలర్ బలోపేతం వంటివి రికవరీ బాటన ఉన్న రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
శుక్రవారంనాడు వెలువడిన జీడీపీ గణాంకాల ప్రకారం– వినియోగం, వ్యవసాయ రంగాలు బలహీనంగా ఉండటమూ రూపాయికి ప్రతికూలమైంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు అంచనాలను దాటిపోవడం ఇక్కడ గమనార్హం. ఆయా అంశాలు ఫారెక్స్ డీలర్లు, దిగుమతిదారులు డాలర్ డిమాండ్‌ను పెంచాయి. గత శుక్రవారంతో పోల్చితే 69.86 వద్ద నష్టంతో రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు నాలుగు నెలల గరిష్ట స్థాయిల నుంచి కిందకు పడింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment