![Elearnmarkets Going to Conduct Face2Face Mega Trading Conclave in Goa - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/7/bus.jpg.webp?itok=QR6fhBjd)
ఆన్‌లైన్‌లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఇ లెర్న్ మార్కెట్స్ ఆధ్వర్యంలో మెగా ట్రేడింగ్ కాంక్లేవ్ జరగనుంది. 2022 ఏప్రిల్ 26 నుంచి 29 వరకు గోవా వేదికగా ఈ ఫేస్ టూ ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు మంది స్టాక్ మార్కెట్ ట్రేడ్ పండితులు ఈ సదస్సులో పాల్గొన బోతున్నారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 250 మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరికి వివిధ అంశాలపై ప్రకాష్ గబ, వివేక్ బజాజ్, ప్రెమల్ ఫారెఖ్, శివకుమార్ జయచంద్రన్, విజయ్ థక్రె, చెతన్ పంచమియ, రాకేష్ బన్సల్, కునాల్ సరౌగి, పీయుష్ చౌదరి, అసిత్ బరన్ పతి, విషాల్ బి మల్కన్ మరియు సందీప్ జైన్‌లు మార్కెట్‌పై మరింత లోతైన అవగాహాన కల్పించనున్నారు. దీని కోసం లైవ్ మార్కెట్ స్ట్రాటజీ సెషన్లు నిర్వహించబోతున్నారు.
ఒకప్పుడు స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ అంటే ముంబై, గుజరాత్‌లతో పాటు మెట్రో నగరాల్లోని వారే ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జిల్లా కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంత ప్రజలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడేళ్లుగా భారీగా పెరుగుతున్న డీమ్యాట్ అకౌంట్‌లే ఇందుకు నిదర్శనం. ఈ తరుణంలో ట్రేడర్లతో మంచి నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం స్టాక్‌మార్కెట్ మీద సరైన అవగాహాన కల్పించడం లక్ష్యంగా ఈ కాంక్లేవ్ నిర్వహిస్తోంది ఈలెర్న్ మార్కెట్స్ సంస్థ.
వివేక్ బజాజ్ 2014లో స్టాక్‌ఎడ్జ్‌తో పాటు ఈలెర్న్ మార్కెట్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రత్యేక యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కి సంబంధించిన తాజా ఆప్‌డేట్స్‌ని ఈ సంస్థ అందిస్తోంది. సుమారు 150 మంది మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ఈలెర్న్ టీమ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment