ట్రేడర్లకు గుడ్‌ న్యూస్‌: ఆర్బీఐ కీలక నిర్ణయం | RBI extends trading hours back | Sakshi
Sakshi News home page

ట్రేడర్లకు గుడ్‌ న్యూస్‌: ఆర్బీఐ కీలక నిర్ణయం

Published Wed, Dec 7 2022 8:13 PM | Last Updated on Wed, Dec 7 2022 8:23 PM

RBI extends trading hours back - Sakshi

సాక్షి,ముంబై:  స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.  మార్కెట్లో ట్రేడింగ్‌ సమయాన్ని ప్రీ-పాండమిక్ స్థాయిలకు పొడిగించింది. మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, లిక్విడిటీ కార్యకలాపాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ఆర్బీఐ ట్రేడింగ్ గంటలను తిరిగి మార్చాలని నిర్ణయించింది.   

ఈ మార్పులు డిసెంబర్ 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 18, 2022లో కొన్ని మార్పులు చేసిన ఎనిమిది నెలల తర్వాత మరోసారి టైమింగ్స్‌ను పొడిగించింది.  అంటే కోవిడ్‌ ముందున్నట్టుగా ట్రేడింగ్ గంటల పొడిగించింది.మార్కెట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5వరకు ట్రేడింగ్ ఉంటుంది. ‍ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్నం 3:30తో పోలిస్తే గంటన్నర ఎక్కువ.

ఇవే టైమింగ్స్‌  కమర్షియల్ పేపర్ , డిపాజిట్ మార్కెట్ సర్టిఫికేట్‌లకు, అలాగే రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్ మార్కెట్‌కి కూడా వర్తిస్తాయి. కాగా  కోవిడ్‌ ఉధృతితో ఏప్రిల్ 2020లో   స్టాక్‌మార్కెట్‌  సమయాన్ని కుదించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement