
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.
2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్‌బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు.