రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ స్థానంలో పనిచేయడానికి అర్హులైన వారి నుంచి కేంద్ర ఆర్థికశాఖ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ స్థానంలో ఉన్న మైకేల్ పాత్రా పదవీకాలం జనవరి 14, 2025న ముగుస్తుంది. దాంతో తన స్థానంలో మరో వ్యక్తిని నియమించేలా ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది. ఈ స్థానంలో పనిచేయబోయే ఆర్థికవేత్తలు విభిన్న విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఈ పదవికి ఎంపికైన వ్యక్తి, ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పర్యవేక్షించాలి. కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా ఉండాలి. ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా 25 ఏళ్ల పాటు భారత్ లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పని చేసి ఉండాలి. కొత్తగా పదవి చేపట్టే వారు 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించకూడదు.
ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
ఆర్థికశాఖ వేతన నిబంధనల ప్రకారం డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల వేతనం, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేవారి 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment