Deputy Governor
-
ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ స్థానంలో పనిచేయడానికి అర్హులైన వారి నుంచి కేంద్ర ఆర్థికశాఖ దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ స్థానంలో ఉన్న మైకేల్ పాత్రా పదవీకాలం జనవరి 14, 2025న ముగుస్తుంది. దాంతో తన స్థానంలో మరో వ్యక్తిని నియమించేలా ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది. ఈ స్థానంలో పనిచేయబోయే ఆర్థికవేత్తలు విభిన్న విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఈ పదవికి ఎంపికైన వ్యక్తి, ద్రవ్యపరపతి విధాన విభాగాన్ని పర్యవేక్షించాలి. కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా ఉండాలి. ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 25 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా 25 ఏళ్ల పాటు భారత్ లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పని చేసి ఉండాలి. కొత్తగా పదవి చేపట్టే వారు 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించకూడదు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!ఆర్థికశాఖ వేతన నిబంధనల ప్రకారం డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల వేతనం, ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేవారి 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం పొడిగింపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది. 2020 అక్టోబర్‌లో డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఆర్బీఐలో చేరిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. -
గతంకన్నా ఫైనాన్షియల్ వ్యవస్థ పటిష్టం: ఆర్బీఐ
ముంబై: భారత ఫైనాన్షియల్ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ వాటిని ఎదుర్కొంటోందని అన్నారు. డిప్యూటీ గవర్నర్ జేపీ మోర్గాన్ ఇండియా లీడర్షిప్ సిరీస్ ఉపన్యాసం చేస్తూ, 2024లో జీ20 సభ్యులలో భారతదేశం అత్యధిక వాతావరణ మార్పు పనితీరు సూచిక (సీసీపీఐ) స్కోర్‌ను సాధించిందని అన్నారు. వాతావరణ పరిరక్షణ విషయంలో భారత్ చిత్తశుద్దిని తెలియజేస్తున్నట్లు వివరించారు. దేశంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్లకూ ఇది దోహదం చేసే అంశమని తెలిపారు. బ్యాంకింగ్ రంగం పటిష్ట బాటలో పయనిస్తోందని అన్నారు. -
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం: ఆర్బీఐ ఏమందంటే
అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తుందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. అయితే రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని ద్రవ్య విధాన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా గడచిన రెండు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్దీరేటు రెపోను 90 బేసిస్ పాయింట్ల పెంచిన (0.40 శాతం, 0.90 శాతం) సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీలో పాత్ర కూడా సభ్యులు. ఈ నేపథ్యంలో ‘‘భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ప్రభావం’’ అన్న అంశంపై ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు పాత్ర వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తే... ►రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచి్చతంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడనికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► రూపాయి విలువ క్షీణతను పరిశీలిస్తే, ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీలకన్నా తక్కువ స్థాయిలోనే మన కరెన్సీ క్షీణత ఉంది. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వల శక్తి నుంచి పొందిన ప్రయోజనం ఇది. ►రూపాయి–రూబుల్ చెల్లింపు విధానం విషయానికి వస్తే, ప్రభుత్వం ఏది నిర్ణయించినా రిజర్వ్ బ్యాంక్ దానిని నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ►2021-22 మూడవ త్రైమాసికంలో (2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య) 2.6 శాతంలో భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చి-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) సంబంధిత కాలం స్థూల దేశీయోత్పత్తిలో 2.6 శాతంగా ఉంది. నాల్గవ త్రైమాసికంలో ఇది 1.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో భారత్ పటిష్ట స్థాయిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ► 2021-22లో కరెంట్ అకౌంట్‌లోటు నామమాత్రంగా 1.2 శాతంగానే ఉంది. భౌగోళిక సవాళ్లు, వాణిజ్య సంబంధ అండకులు, దిగుమతుల డిమాండ్ పెరుగుదల వంటి పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ విదేశీ నిల్వలు పటిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని క్యాడ్ తెలియస్తోంది. ►ఇతర దేశాలతో పోలి్చతే భారత్ ద్రవ్య పరపతి విధానం ఇంకా సరళతరంగానే ఉంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు దిగివస్తుందని భావిస్తున్నాం. తదుపరి నెలల్లో మరింత దిగివస్తుందన్నది అంచనా. ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఆధారంగా (బేస్‌లైన్) ఈ అంచనాలను వెలువరిస్తున్నాం. ► ప్రపంచం ద్రవ్యోల్బణం సవాళ్లలో ఉన్న నేపథ్యంలో...ప్రస్తుతం దాని కదలికలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. స్థూలంగా స్థాయిలను నిర్ధేశించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ► ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ‘కఠినంగా‘ ఉంటుంది. అయితే భవిష్యత్ ద్రవ్యోల్బణం పథాన్ని నిర్దేశించు కోవడంలో భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. తద్వారా ద్రవ్యోల్బణంపై యుద్ధంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాము. ద్రవ్యోల్బణంపై అందోళన అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ ఈ నెల ప్రారంభ పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దుమీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉంది. ఇది ఖరీఫ్ పంట దిగుబడికి దోహదపడే అంశం. ఆయా అంశాల నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటురిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం, మూడవ త్రైమాసికంలో 6.2 నమోదయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ మధ్య జరిగే పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు మరో ఒక శాతం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. రూపాయి పతనం ఇదిలావుండగా, డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక పతనం రికార్డులు కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒకపైసా క్షీణించి 78.33 వద్ద ముగిసింది. రూపాయి గురువారం ముగింపు 78.32. శుక్రవారం ట్రేడింగ్‌లో 78.20 వద్ద ప్రారంభమైంది. 78.19ని చూసినా ఆ స్థాయికి మించి బలపడలేదు. ఇంట్రాడేలో 78.35ను కూడా చూసింది. చివరకు పైనా నష్టంతో 78.33 వద్ద ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో రూపాయి శుక్రవారం చరిత్రాత్మక కొత్త కనిష్టాలను చూసింది. రూపాయి వరుస పతనం ఇది ఎనిమిదవ వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని పరిస్థితి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు ధోరణి, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా కొనసాగడం వంటి అంశాలు రూపాయి రెండు నెలల పతన ధోరణికి కారణం. విదేశీ మారకద్రవ్య నిల్వలు @ 591 బిలియన్ డాలర్లు వారం వారీగా 6 బిలియన్ డాలర్ల డౌన్ కాగా, భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్ 17వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (జూన్ 10) ముగిసిన వారంతో పోలి్చచూస్తే 6 బిలియన్ డాలర్లు తగ్గి 591 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ 10తో ముగిసిన వారంలోకూడా అంతక్రితం వారంతో పోల్చితే ఫారెక్స్ దాదాపు 4 బిలియన్ డాలర్లకుపైగా తగ్గడ గమనార్హం. ఆర్బీఐ తాజాగా శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 10వ తేదీతో ముగిసిన వారంలో డాలర్లు అధికంగా ఉండే ఫారెన్ కరెంట్ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.362 బిలియన్ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 258 మిలియన్లు తగ్గి 40.584 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) నిధులు మొత్తం 233 మిలియన్ డాలర్ల తగ్గి 18.155 బిలియన్లకు తగ్గాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.968 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఒడిదుడుకులను ఎదుర్కొంటాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అత్యుత్తమ స్థాయిలో భారత్ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర పేర్కొన్నారు. ’బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి’ అనే అంశంపై ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్ఈ), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► 2013తో పోల్చితే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగుపడింది. భారత్ ప్రస్తుతం పటిష్ట స్థానంలో ఉంది. దేశ ఆర్థిక మూలస్తంభాలు బలంగా ఉన్నాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకుని నిలబడగలిసే సమర్థ్యాన్ని సంబంధిత సూచీలు సూచిస్తున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ విధాన వైఖరిని మహమ్మారి ప్రభావిత స్థితి నుంచి సాధారణ స్థితికి మార్చాలని యోచిస్తున్నాయి. సరళతర ద్రవ్య విధాన వైఖరి కొంత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల ప్రభావం భారత్ పైనా ఉంటుంది. కొంత ఒడిదుడుకుల పరిస్థితి ఉంటుంది. అయితే దీనిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. ► ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) పరంగా చూస్తే, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ► 2040 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాలతో (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండేందుకు భారత్ తొలుత సిద్ధపడాలి. ► 2009–10లో బ్రిక్స్ ప్రారంభం అయిన తర్వాత పలు కీలక మైలురాళ్లను అధిగమించడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (లేదా సీఆర్ఏ), బ్రిక్స్ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం (2021–2025), బ్రిక్స్ పేమెంట్స్ టాస్క్ ఫోర్స్ (బీపీటీఎఫ్) వంటి కీలక వ్యవస్థల ఏర్పాటును ప్రస్తావించుకోవచ్చు. మూడు దశల్లో దేశ వృద్ధి తీరు... డిప్యూటీ గవర్నర్ వివరించిన దానిప్రకారం, జీడీపీ వృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి సూచికగా విస్తృతంగా వినియోగిస్తున్నారు. గత 75 ఏళ్లలో భారతదేశ వృద్ధి పథం మూడు దశల్లో సాగిందని భావించవచ్చు. 1970 దశకం చివరి వరకు భారతదేశం సగటు వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది. హిందూ వృద్ధి రేటు అని కూడా దీనిని పిలిచేవారు. ఇది ఆ కాలంలో అవలంబించిన విధానాలతో ముడిపడి ఉంది. 1980–2002 వరకూ చూస్తే సరళీకరణ, ఆర్థిక వ్యవస్థ క్రమంగా అంతర్జాతీంగా ముడివడ్డం అంశాలతో వృద్ధి ధోరణి 5.5 శాతానికి చేరుకుంది. 2003 నుంచి 2020 మహమ్మారి సవాళ్లు ప్రారంభమయ్యే వరకూ వరకూ సగటు 7 వృద్ధి ఏడు శాతంగా ఉంది. 2020లో వృద్ధి క్షీణతలోకి మారింది. అయితే సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయికి భారత్ పురోగమించింది. భారతదేశంలో వృద్ధి చోదకాలు ఏమిటన్నది గమనించాలి. గృహ, ప్రైవేటు వినియోగం ఇక్కడ కీలకమైన అంశాలు. ఈ రెండింటి వాటా మొత్తం 1960 జీడీపీలో 75 శాతం. ఇటీవల 55 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, జీడీపీలో ఈ రెండింటిపాత్రే కీలకం కావడం గమనార్హం. దేశంలో ఎగుమతులు, పెట్టుబడుల ప్రేరిత వృద్ధి ధోరణి పటిష్టం కావాల్సి ఉంది. పటిష్ట రికవరీ బాటన ఎకానమీ: ఆర్బీఐ ఆర్టికల్ అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందని ఆర్బీఐ ఆర్టికల్ ఒకటి పేర్కొంది. తగిన ద్రవ్య, రుణ పరిస్థితులు ఇందుకు దోహపడుతున్నట్లు వివరించింది. అంతర్జాతీయంగా నెలకొన్ని ఉన్న సరఫరాల సమస్యలు, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, కరోనా కేసులు కొన్ని దేశాల్లో పెరుగుతుండడం వంటి అంశాలను ఆర్బీఐ ప్రచురించిన ఆర్టికల్ ప్రస్తావించింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో రవాణా, ఉపాధి రంగాల్లో మంచి పురోగతి ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ అభిప్రాయాలు పూర్తిగా ఆర్టికల్ రాసిన రచయితలకు చెందుతాయని, వీటితో సెంట్రల్ బ్యాంక్ ఏకీభవించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. -
ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కన్నుమూత
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి (68) కన్నుమూశారు. ముంబైలో తన నివాసంలో గుండెపోటుతో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మార్చి. 15 జూన్ 2009 - 25 ఏప్రిల్ 2014 మధ్య ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే పదవీకాలం ముగిసేలోపు వ్యక్తిగత కారణాలరీత్యా మూడు నెలల ముందే రాజీనామా చేశారు. చక్రవర్తికి భార్య కొడుకున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ, పరిశోధకుడిగా పనిచేశారు. ఆర్బీఐలో చేరడానికి ముందు, చక్రవర్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ , ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండేళ్లు ఉన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఛైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. -
ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఈయనే
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. ప్రముఖ ఆర్థికవేత్త మైఖేల్ పాత్రా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికయ్యారు. పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మైఖేల్ పాత్రాను ఆర్బిఐ నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ అపాయింట్మెంట్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్లపాటు పాత్రా తన పదవిలో కొనసాగనున్నారు. కాగా తన పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే జూలై 2019 లో విరేల్ ఆచార్య ముందస్తు రాజీనామా తరువాత చాలా కాలంగా డిప్యూటీ గవర్నర్ పదవి భర్తీ కోసం ఆర్బీఐ కష్టపడుతున్న సంగతి తెలిసిందే. -
ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి
ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద అనధికారిక రుణాలను విస్తరిస్తున్న బ్యాంకులు ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం.కె.జైన్ సూచించారు. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ బ్యాంకులు మదింపు దశలో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. ముద్ర రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికంనుంచి బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం. కానీ మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని జైన్ వ్యాఖ్యానించారు. వీరికి రుణాలు ఇచ్చేసమయంలోనే బ్యాంకులు రీపేమెంట్‌కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు. కాగా కార్పొరేట్యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించడానికి పిఎంఎంవై 2015, ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు సహా 3.27 కోట్ల మంది స్వల్ప, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .7.28 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. -
ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ విఠల్ గోకర్న్ స్వల్ప అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యులు షమికా రవి ట్విటర్ లో ఈ సమాచారాన్ని అందించారు. సుబీర్ గోకర్న్ మరణంపై మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు ఆర్తికవేత్తలు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. 2009-12 మధ్య మూడేళ్లపాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించారు గోకర్న్ . అతి పిన్న వయస్కుడైన డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఆర్బిఐలో పదవీకాలం పొడిగింపు లభిస్తుందని ఊహించినప్పటికీ, తదుపరి డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను నియమించింది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. Saddened to know about the demise of eminent economist and former RBI deputy governor Subir Gokarn. Subir was a sound Economist and he excelled even in his current assignment as ED at the IMF. My thoughts are with the bereaved family. Om Shanti — Arun Jaitley (@arunjaitley) July 31, 2019 -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విశ్వనాథన్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎన్ఎస్ విశ్వనాథన్‌ను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై 3వ తేదీతో విశ్వనాథన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన్ను మరోసారి ఎంపిక చేసింది. జూలై 4 నుంచి మరో ఏడాది కాలానికి విశ్వనాథన్‌ను తిరిగి డిప్యూటీ గవర్నర్‌గా నియమించడానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. కాగా ఆర్బీఐ ముగ్గరు డిప్యూటీ గవర్నర్లలో విశ్వనాథన్ ఒకరు. కాగా గత నెలలో డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వివాదాల ‘విరాళ్’... గుడ్‌బై!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉండడం గమనార్హం. ప్రభుత్వంతో పొసగకే ఆయన రాజీనామా చేశారన్న పుకార్లు షికారు చేయడం మరో విశేషం. బాధ్యతలు పూర్తవడానికి దాదాపు 9 నెలల ముందే వ్యక్తిగత కారణాలతో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినప్పుడూ, ఇదే విధమైన విశ్లేషణలు రావడం గమనార్హం. కాగా, ఉర్జిత్ పటేల్ రాజీనామా నాటినుంచే విరాళ్ ఆచార్య కూడా అదే బాటన పయనిస్తారన్న వార్తలు కొనసాగాయి. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య, ఆర్బీఐ గవర్నర్లలో అతి చిన్నవారు. మోదీ ప్రభుత్వం రెండవదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయిలో జరిగిన తొలి రాజీనామా ఇది కావడం మరో విశేషం. ఆర్బీఐ ప్రకటన ఏమి చెప్పిందంటే.. ఆర్బీఐ సోమవారంనాడు విడుదల చేసిన ప్రకటనను చూస్తే, ‘‘అనివార్యమైన వ్యక్తిగత పర్యవసానాల వల్ల తాను జూలై 23 తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కొనసాగలేనని కొద్ది వారాల క్రితం డాక్టర్ విరాళ్ ఆచార్య ఒక లేఖను సమర్పించారు’’ అని ఒక క్లుప్తమైన ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆచార్య రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ఇక ముగ్గురు – ఎన్ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు ఉంటారు. కేంద్రం ఏరికోరి... ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి నిబంధనలనూ తరచూ మార్చుతూ ఆర్బీఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను చేపట్టారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్బీఐలో పర్యవేక్షించారు. రాజీనామా అనంతరం విరాళ్ ఆచార్య ఏమిచేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రానున్నప్పటికీ, ఆయన తిరిగి ప్రొఫెసర్‌గానే వెళ్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. పాలసీపై విభేదాలు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాకేష్ మోహన్ తరువాత... ‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది. జలాన్ కమిటీ నివేదిక నేపథ్యం... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల అదనపు నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రానికి బదలాయించాలన్న విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మరో నెల రోజుల్లో సమర్పించనున్న నేపథ్యంలో విరాళ్ రాజీనామా మరో విశేషం. నిజానికి జూన్ చివరికల్లా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నా, అది అసాధ్యమని వార్తలు వస్తున్నాయి. పలు అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వివాదాల్లో... స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి. అందులో కొన్ని అంశాలు చూస్తే... ► గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఏడీ షరోఫ్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయ రూపకల్పన దీర్ఘకాలం దృష్టితో కాకుండా, స్వల్పకాల ప్రయోజనాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉంటోందని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఈ ప్రసంగంలో పేర్కొన్నారు. ► మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని తక్కువచేస్తే, అది క్యాపిటల్ మార్కెట్లలో విశ్వాస సంక్షోభాన్ని తీసుకువస్తుందని అన్నారు. అలాగే సెంట్రల్‌బ్యాంక్ సమర్థతపైనా ఆయా అంశాల ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ► మొండిబకాయిలకు సంబంధించి కొన్ని బ్యాంకులపై ప్రయోగించిన ‘దిద్దుబాటు చర్యల ప్రక్రియ’ (పీసీఏ)ను కూడా ఆయన పలు సందర్భాల్లో గట్టిగా సమర్థించారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య రాజీనామా
-
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పోస్టుకు 30 దరఖాస్తులు
-
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ బాధ్యతలు
ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైన బి.పి.కనుంగొ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన కరెన్సీ మేనేజ్మెంట్, ఫారిన్ ఎక్సే్ఛంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కనుంగొకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ మార్చి 11న డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1982 సెప్టెంబర్‌లో ఆర్బీఐలోకి ప్రవేశించిన కనుంగొ ఇప్పుడు ఆర్.గాంధీ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. కనుంగొ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ డెట్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ వంటి విభాగాలకు నాయకత్వం వహించారు. అలాగే జైపూర్, కోల్‌కతాలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల హెడ్‌గా కూడా పనిచేశారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బి.పి.కనుంగో
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా బి.పి.కనుంగో నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. కనుంగో ఏప్రిల్ 3న లేదా ఆ తర్వాత పదవీ బాధ్యతలు చేపడతారు. ఆర్.గాంధీ స్థానంలో బి.పి.కనుంగో నియామకం జరిగింది. ఆర్బీఐ యాప్ వచ్చేసింది.. ఆర్బీఐ తన వెబ్సైట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేస్తుంది. ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఆర్బీఐ ప్రకటనలను, ఐఎఫ్ఎస్సీ/ఎంఐసీఆర్ కోడ్లను, బ్యాంక్ సెలవు దినాలను, ప్రస్తుత పాలసీ రేట్లు, నాలుగు ప్రధాన కరెన్సీల రిఫరెన్స్ రేట్లు తెలుసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. -
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్
ముంబాయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదోన్నతి పొందడంతో, అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ గవర్నర్ పోస్టులోకి కొత్త వ్యక్తిని ప్రభుత్వం ఎంపిక చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేస్తున్న బిరాల్ వీ.ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఉర్జిత్ పటేల్ డిప్యూటీ గవర్నర్ స్థానంలోకి బిరాల్ వీ. ఆచార్య వచ్చేశారు. ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. నలుగురిలో ఒకరిగా ఆచార్యను ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అయితే ఆచార్యకు ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారో ప్రభుత్వం తెలుపలేదు. ఉర్జిత్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నంతవరకు ఆర్బీఐకి ఎంతో కీలకమైన ద్రవ్యపరపతి విధానానికి బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మరో డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పర్యవేక్షిస్తున్నారు. బ్యాంక్స్ రెగ్యులేషన్, కార్పొరేట్ ఫైనాన్స్, క్రెడిట్ రిస్క్, అసెట్ ప్రైసింగ్లపై ఆచార్య ఎక్కువగా రీసెర్చ్‌లు చేస్తూ ఉంటారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విశ్వనాథన్
ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా ఎన్.ఎస్. విశ్వనాథన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 62 సంవత్సరాల వయస్సు రావడంతో పదవీ విరమణ చేసిన హరున్ కె.ఖాన్ స్థానంలో ఎన్.ఎస్. విశ్వనాథన్(58) నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆర్బీఐ ఈడీగా పనిచేసిన విశ్వనాథన్ డిప్యూటీ గవర్నర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. డిప్యూటీ గవర్నర్ హోదాలో ఆయన బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిబంధనలను (డీబీఆర్)పర్యవేక్షిస్తారు. దీంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్(డీసీబీఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్ రెగ్యులేషన్(డీఎన్బీఆర్), డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ), ఫైనాన్షియల్ స్టెబిలిటి యూనిట్(ఎఫ్‌ఎస్‌యూ), ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, రిస్క్ మానిటరింగ్ డిపార్ట్మెంట్(ఆర్ఎండీ), సెక్రటరీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాలను కూడా ఆయన చూస్తారు. విశ్వనాథన్ 1958, జూన్ 27న జన్మించారు. బెంగళూర్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 1981లో ఆర్బీఐలో చేరారు. ఆయన బ్యాంక్‌ల పర్యవేక్షణ, నిబంధనలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంక్‌లు, కరెన్సీ మేనేజ్మెంట్, విదేశీ మారకద్రవ్యం, మానవ వనరుల నిర్వహణ తదితర విభాగాల్లో అపార అనుభవం, నైపుణ్యం గడించారు. ఆర్బీఐ చెన్నై కార్యాలయం అధిపతిగానూ, మారిషస్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మారిషస్‌లో ఒక డెరైక్టర్(పర్యవేక్షణ)గా కూడా ఆయన పనిచేశారు. -
బ్యాంకింగ్ మోసాల కట్టడి!
♦ తాజా విధానానికి ఆర్బీఐ కసరత్తు ♦ డిప్యూటీ గవర్నర్ ముంద్రా వెల్లడి ముంబై: బ్యాంకింగ్ మోసాల్ని కట్టడి చేయటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. మోసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీటిని నిరోధించడంలో అటు బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటు కస్టమర్ పోషించాల్సిన పాత్ర... వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా చెప్పారు. అటు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండటంతో ఆర్బీఐ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎలక్ట్రానిక్ లావాదేవీల విషయంలో కస్టమర్ల విశ్వాసాన్ని పెంచాలని కూడా ఆర్బీఐ భావిస్తున్నట్లు ముంద్రా తెలియజేశారు. ఆయా అంశాల్లో పురోగతికోసం త్వరలో ఒక విధానం తేనున్నట్లు బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముంద్రా తెలిపారు. మోసాలు జరగకుండా చూడటం, జరిగిన పక్షంలో కస్టమర్‌కు తగిన న్యాయం చేయటం వంటి చర్యలు ఈ విధానంలో ఉంటాయని చెప్పారాయన. ఆన్లైన్ లావాదేవీలు ఒకపక్క పెరుగుతుండగా.. మరోపక్క అనధికార నిధుల బదలాయింపు, ఏటీఎంల నుంచి మోసపూరిత లావాదేవీలు, తప్పుదారి పట్టించే ఈ-మెయిల్స్ వంటివి కూడా పెరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారాయన. ‘‘ఈ సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన యంత్రాంగం కావాలి. మొబైల్ నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపుల్లో మోసాలకు చోటులేని వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే టెక్నాలజీపై కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. మోసాలపై కస్టమర్లలో చైతన్యం తేవటం కూడా ముఖ్యమే. ఈ చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠతకు కూడా ఉపకరిస్తాయి’’ అని ముంద్రా వివరించారు. -
లెసైన్సు రాకున్నా బ్యాంకుల్లో వాటాలు కొనొచ్చు
ముంబై: బ్యాంకింగ్ లెసైన్సు దక్కని సంస్థలు..ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆయా కంపెనీలు.. వేరే బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేయరాదంటూ ఏమీ లేదని కొత్తగా నియమితులైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ.. బ్యాంకులో సదరు సంస్థ వాటాదారుగా చేరాలనుకుంటే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామనిఆయన వివరించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ గణనీయంగా వాటాలు పెంచుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైనా బ్యాంకులో ఏదైనా కంపెనీ 5 శాతం పైగా వాటాలను కొనాలనుకుంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గాంధీ చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని, ఏ ఒక్క కంపెనీకో అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వ్యవహరించమని ఆయన తెలిపారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సును దక్కించుకోవడంలో విఫలమైన ఎల్అండ్టీ ఫైనాన్స్.. యస్‌బ్యాంకులో వాటాలు కొనాలని యోచిస్తోంది. ఇది దొడ్డిదారిన బ్యాంకింగ్‌లోకి ప్రవేశించడమే అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.