
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎన్‌ఎస్ విశ్వనాథన్‌ను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై 3వ తేదీతో విశ్వనాథన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన్ను మరోసారి ఎంపిక చేసింది. జూలై 4 నుంచి మరో ఏడాది కాలానికి విశ్వనాథన్‌ను తిరిగి డిప్యూటీ గవర్నర్‌గా నియమించడానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది.
కాగా ఆర్‌బీఐ ముగ్గరు డిప్యూటీ గవర్నర్లలో విశ్వనాథన్ ఒకరు. కాగా గత నెలలో డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.