ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్ | Vishwanathan assumes charge as new RBI Deputy Governor | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్

Published Tue, Jul 5 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్

ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా ఎన్.ఎస్. విశ్వనాథన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 62 సంవత్సరాల వయస్సు రావడంతో పదవీ విరమణ చేసిన హరున్ కె.ఖాన్ స్థానంలో ఎన్.ఎస్. విశ్వనాథన్(58) నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆర్‌బీఐ ఈడీగా పనిచేసిన విశ్వనాథన్ డిప్యూటీ గవర్నర్ పదవిలో మూడేళ్ల పాటు   కొనసాగుతారు. డిప్యూటీ గవర్నర్ హోదాలో ఆయన  బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిబంధనలను (డీబీఆర్)పర్యవేక్షిస్తారు. దీంతో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్(డీసీబీఆర్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్ రెగ్యులేషన్(డీఎన్‌బీఆర్), డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ), ఫైనాన్షియల్ స్టెబిలిటి యూనిట్(ఎఫ్‌ఎస్‌యూ), ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్, రిస్క్ మానిటరింగ్ డిపార్ట్‌మెంట్(ఆర్‌ఎండీ), సెక్రటరీస్ డిపార్ట్‌మెంట్ వ్యవహారాలను కూడా ఆయన చూస్తారు.

 విశ్వనాథన్ 1958, జూన్ 27న జన్మించారు. బెంగళూర్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.  1981లో ఆర్‌బీఐలో చేరారు. ఆయన బ్యాంక్‌ల పర్యవేక్షణ, నిబంధనలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంక్‌లు, కరెన్సీ మేనేజ్‌మెంట్, విదేశీ మారకద్రవ్యం, మానవ వనరుల నిర్వహణ తదితర విభాగాల్లో అపార అనుభవం, నైపుణ్యం గడించారు. ఆర్‌బీఐ చెన్నై కార్యాలయం అధిపతిగానూ, మారిషస్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మారిషస్‌లో ఒక డెరైక్టర్(పర్యవేక్షణ)గా కూడా ఆయన పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement