ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బి.పి.కనుంగో
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా బి.పి.కనుంగో నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. కనుంగో ఏప్రిల్ 3న లేదా ఆ తర్వాత పదవీ బాధ్యతలు చేపడతారు. ఆర్.గాంధీ స్థానంలో బి.పి.కనుంగో నియామకం జరిగింది.
ఆర్‌బీఐ యాప్ వచ్చేసింది..
ఆర్‌బీఐ తన వెబ్‌సైట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేస్తుంది. ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఆర్‌బీఐ ప్రకటనలను, ఐఎఫ్‌ఎస్‌సీ/ఎంఐసీఆర్ కోడ్లను, బ్యాంక్ సెలవు దినాలను, ప్రస్తుత పాలసీ రేట్లు, నాలుగు ప్రధాన కరెన్సీల రిఫరెన్స్ రేట్లు తెలుసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.