ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ బాధ్యతలు
ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైన బి.పి.కనుంగొ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్సే్ఛంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కనుంగొకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ మార్చి 11న డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది.
ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1982 సెప్టెంబర్‌లో ఆర్‌బీఐలోకి ప్రవేశించిన కనుంగొ ఇప్పుడు ఆర్.గాంధీ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. కనుంగొ ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్‌మెంట్, ఇంటర్నల్ డెట్ మేనేజ్‌మెంట్, గవర్నమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ వంటి విభాగాలకు నాయకత్వం వహించారు. అలాగే జైపూర్, కోల్‌కతాలోని ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల హెడ్‌గా కూడా పనిచేశారు.