ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆర్నెల్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన డిప్యూటీ గవర్నర్‌గా తప్పుకున్నారు. ఆర్థిక సరళీకరణ అనంతరం ఆర్‌బీఐలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన వారిలో విరాల్ ఆచార్య అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ఆర్‌బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని గట్టిగా వాదించిన ఆచార్య 2017, జనవరి 23న కేంద్ర బ్యాంక్‌లో చేరారు.