
ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్రా (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. ప్రముఖ ఆర్థికవేత్త మైఖేల్ పాత్రా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికయ్యారు. పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మైఖేల్ పాత్రాను ఆర్‌బిఐ నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ అపాయింట్‌మెంట్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్లపాటు పాత్రా తన పదవిలో కొనసాగనున్నారు. కాగా తన పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే జూలై 2019 లో విరేల్ ఆచార్య ముందస్తు రాజీనామా తరువాత చాలా కాలంగా డిప్యూటీ గవర్నర్ పదవి భర్తీ కోసం ఆర్‌బీఐ కష్టపడుతున్న సంగతి తెలిసిందే.