ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత | Eminent Economist Subir Gokarn Passes Away | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

Published Wed, Jul 31 2019 2:23 PM | Last Updated on Wed, Jul 31 2019 2:30 PM

Eminent Economist Subir Gokarn Passes Away - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్  సుబీర్ విఠల్ గోకర్న్ స్వల్ప అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యులు  షమికా రవి ట్విటర్‌ లో ఈ  సమాచారాన్ని అందించారు.   సుబీర్‌ గోకర్న్‌ మరణంపై మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  సహా పలువురు ఆర్తికవేత్తలు,  కేంద్రమంత్రులు, ఇతర రాజకీయవేత్తలు  సంతాపం  వ్యక్తం చేశారు.

2009-12 మధ్య మూడేళ్లపాటు  ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించారు గోకర్న్ . అతి పిన్న వయస్కుడైన డిప్యూటీ గవర్నర్‌గా ఆయన గుర్తింపు పొందారు.  ఆర్‌బిఐలో పదవీకాలం పొడిగింపు లభిస్తుందని  ఊహించినప్పటికీ,  తదుపరి డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ నియామకం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను నియమించింది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు  ఆయన ప్రాతినిధ్యం వహించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement