Timings
-
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు (Banks) వెళ్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ తెరిచే వేళలు, మూసే సమయం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలు (Bank Timings) ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది.ఈ మార్పులు 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది.మార్పు ఎందుకంటే..వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ వ్యత్యాసం కారణంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంక్ షెడ్యూల్ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకు అయినా వెళ్లవచ్చు. ఏకరీతి పని వేళలు ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫీసు షిఫ్ట్‌ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించవచ్చు. -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని ప్రీ-పాండమిక్ స్థాయిలకు పొడిగించింది. మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, లిక్విడిటీ కార్యకలాపాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు, ఆర్బీఐ ట్రేడింగ్ గంటలను తిరిగి మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు డిసెంబర్ 12, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 18, 2022లో కొన్ని మార్పులు చేసిన ఎనిమిది నెలల తర్వాత మరోసారి టైమింగ్స్‌ను పొడిగించింది. అంటే కోవిడ్ ముందున్నట్టుగా ట్రేడింగ్ గంటల పొడిగించింది.మార్కెట్ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5వరకు ట్రేడింగ్ ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్నం 3:30తో పోలిస్తే గంటన్నర ఎక్కువ. ఇవే టైమింగ్స్ కమర్షియల్ పేపర్ , డిపాజిట్ మార్కెట్ సర్టిఫికేట్లకు, అలాగే రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్ మార్కెట్‌కి కూడా వర్తిస్తాయి. కాగా కోవిడ్ ఉధృతితో ఏప్రిల్ 2020లో స్టాక్‌మార్కెట్ సమయాన్ని కుదించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో సర్వీసు వేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైల్ వేళలను మరింత పొడిగిస్తూ నిర్వాహకులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై రాత్రి 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పొడిగించిన కొత్త సర్వీసు వేళలు ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో సేవలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 10.15 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంటల దాకా నగరవాసులు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఉదయం వేళ సర్వీసులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
Srisailam Temple: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది, ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు సార్లు మాత్రమే దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు. సిఫారసు లేఖల విధానంలో మార్పులు ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి విధిగా లెటర్‌హెడ్ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు లేఖపై స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. యథావిధిగా స్పర్శ దర్శన వేళలు ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది. సామాన్య భక్తుల కోసమే మార్పులు సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు స్వామి అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం. – ఎస్.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యశ్వంత్‌పూర్–కాచిగూడ (16569/ 16570)స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. (క్లిక్: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని!
ఆఫీసు పని వేళలు, ఉద్యోగుల క్రమ శిక్షణ, అంకిత భావం, మేనేజ్మెంట్ ప్రవర్తన తదితర అంశాలపై ఓ నెటిజన్ అడిగిన ధర్మసందేహం ట్విటర్లో కాక రేపుతోంది. నిమిషానికి వందల సంఖ్యలో నెటిజన్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా కొందరు యాజమాన్యాలకు వత్తాసు పలికారు. అతి కొద్ది మంది సీరియస్ మ్యాటర్లోనూ కొంటెగా కామెంటారు. గబ్బర్ అనే ఓ ట్విటర్ యూజర్ నెటిజన్ల ముందు నోటీస్ బోర్డులో కనిపించిన దృశ్యాన్ని ఉంచాడు. అందులో... ‘ ఈ రోజు నుంచి మీరు ఆఫీస్‌కి ఒక నిమిషం ఆలస్యం అయితే పది నిమిషాలు అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఉదయం పది గంటలకు రావాల్సిన వాళ్లు 10 గంటల 2 నిమిషాలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వారు అదనంగా 20 నిమిషాలు పని చేసి 6:20 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది’ అంటూ మీ ఆఫీసు నోటీస్ బోర్డులో ఇలాంటి ఒక ఆర్డర్ ఉంటే మీ స్పందన ఏంటీ అంటూ అడిగాడు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. Some business owners are monsters. Seeking profits is good, but such distrust ruins companies in the long run. pic.twitter.com/698CFppyuA — Gabbbar (@GabbbarSingh) June 12, 2022 ఉద్యోగులకు మద్దతుగా - కొద్ది మంది యజమానులు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. లాభాల కోసం ఎలాంటి పనులకైనా తెగిస్తారు. కానీ వారు అలా చేసే పనుల వల్ల వారి వ్యాపారాలు సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. - మరోకరు తన ఆఫీసు అనుభవాన్ని పంచుకుంటూ.... మా ఆఫీసులో పిగ్గీబ్యాంకు అని పెట్టారు. ఆఫీసుకు లేట్‌గా వచ్చిన వాళ్లు జరిమానా కట్టాలి. ఒక నిమిషం లేట్‌గా వచ్చిన వాళ్లు రూ.100ను పిగ్గీ బ్యాంకులో జమ చేయాలి. ఉద్యోగులపై సంస్థకు నమ్మకం లేదు అనడానికి ఇవన్నీ ఉదాహారణలు అని చెప్పుకొచ్చారు. - ఇవన్ని పనికి మాలిన పనులు ఆఫీసులు ఎన్ని గంటలు ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఉన్న సమయంలో ఎంత వరకు పనికి వచ్చాం. మన వల్ల ఎంత ఉత్పత్తి జరిగిందనేది ముఖ్యం అంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు. I was working at a place until last year, where they started a piggy bank called late to office piggy bank. For every minute you are late, you must put in a 100 rs as late fee. Talk about distrust. https://t.co/fWWhwpRSvo — gumnaam (@stupid_pangolin) June 12, 2022 యాజమన్యానికి అనుకూలంగా - స్కూల్‌కి 8 గంటలకల్లా వెళ్లాలి అంటే కచ్చితంగా అదే సమయానికి అక్కడ ఉంటాం. కదా మరీ ఆఫీసులకు రావడానికి ఇబ్బంది ఏంటీ? ఎందుకు సమయానికి ఆఫీసుకు రమ్మంటే సాకులు వెతుక్కుంటారంటూ యజమాన్యానికి మద్దతుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. - ఆలస్యంగా వస్తే ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధన సరైనదే. కంపెనీలన్నీ హెచ్ఆర్ పాలసీ మీద నడుస్తుంటాయి. ఉద్యోగులు ఆలస్యంగా వస్తే దాని ప్రభావం ఉత్పత్తిపై, లాభాలపై కనిపిస్తుంది. కాబట్టి పనిలో జీవితంలో క్రమశిక్షణ అన్నది సరైనదే. I find it reasonable , bcoz many companies are based on HR , and employees not arriving on time regularly may cause them a huge setback , both in profit terms and production terms . Making a strict rule for all the people , including the manager is a sign of discipline ... https://t.co/5wRnwZ4HBM — Hon. Inquisitive Cule (@CruyffMessi10) June 12, 2022 కొంటె సమాధానాలు ఆలస్యంగా వస్తే అదనంగా పని చేయాలనే నిబంధనపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మరీ ఆఫీస్‌కి ముందు వస్తే ముందుగానే బయటకు వెళ్లిపోవచ్చా అంటూ కొంటెగా ప్రశ్నించాడు. నిర్దేశిత సమయం కంటే ఆరు నిమిషాల ముందు వస్తే.. ఒక గంట ముందుగానే ఆఫీస్ వదిలిపోతామంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఇంతకీ ఏ ఆఫీసులో ఈ తరహా నిబంధన అమలు చేయాలనుకుంటున్నారనే అంశం వీరి సంవాదంలో ఎక్కడా కనిపించలేదు. Arriving 6 minutes earlier means leaving the office 1 hour earlier.😂😂 https://t.co/FqROAlp96h — Reality Check 🇮🇳 ( 💯 % FB ) (@RealtyChk) June 12, 2022 చదవండి: ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా! -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్‌ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్‌ఫెయిర్ కమిటీ -
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
-
రాత్రి 9.30 దాటితే మెట్రో బంద్, మరి ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫికర్ నుంచి గ్రేటర్ వాసులకు విముక్తి కల్పించేందుకు పట్టాలెక్కిన మెట్రో రైలు వేళలు పొడిగించకపోవడం నగరవాసులకు శాపంగా పరిణమించింది. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. చివరి రైలు గమ్యస్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది. కానీ గ్రేటర్లో అదే సమయంలో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకొని రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈనేపథ్యంలో మెట్రో రైలు సరీ్వసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ కలకలకం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో రైళ్ల వేళలు పొడిగించడం అనివార్యమని ప్రజారవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. నాడు నాలుగు..నేడు రెండు లక్షలే.... నగరంలో మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో రైలు సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్లలో గతేడాది మార్చికి ముందు (లాక్‌డౌన్‌కు)నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు. సెలవులు, ఇతర పర్వదినాల సందర్భంగా రద్దీ మరో 50 వేల మేర పెరిగేది. కానీ ప్రస్తుతం మూడు రూట్లలో కేవలం 2 లక్షల మంది మాత్రమే మెట్రోను వాడుతున్నారు. ఇటీవల ఎండల తీవ్రత స్వల్పంగా పెరగడంతో రద్దీ 5 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐటీ కారిడార్‌లో వందలాది ఐటీ, బీపీఓ, కేవీపీ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబరు వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో మెట్రో రద్దీ అనూహ్యంగా పడిపోయిన విషయం విదితమే. మరోవైపు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ బాదుడు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి ప్రయాణీకులు జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మెట్రోకు అనుకున్న స్థాయిలో ఆదరణ పెరగకపోవడం గమనార్హం. నాటి అంచనా 16 లక్షలు..? మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో మెట్రో ప్రయాణీకుల సంఖ్య సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కానీ నిర్మాణ సంస్థ అంచనాలు లెక్క తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం లాక్డౌన్ కంటే ముందు స్థితి..అంటే 4 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కింకర్తవ్యం మూడు మార్గాల్లో మెట్రో సర్వీసుల వేళలను ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలి. గతంలో ప్రకటించినట్లుగా టిక్కెట్లు, స్మార్ట్‌కార్డులపై రాయితీని అమలు చేయాలి. అన్ని స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ల నుంచి సమీప కాలనీలు,బస్తీలకు ఆర్టీసీ మినీ బస్సులను విరివిగా నడపాలి. అన్ని స్టేషన్లలో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. -
టెన్త్.. ఆరు ప్రశ్న పత్రాలే..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యా బోధన దెబ్బతిన్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల్లో ఉండే 11 ప్రశ్నపత్రాలను ఆరుకు కుదించింది. ప్రశ్నల్లో రెట్టింపు చాయిస్ ఉండేలా ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 10 ప్రశ్నలకు జవాబు రాయాలని అడిగే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టనుంది. గతం లో 10 మార్కులకే ఉన్న ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలను 20 మార్కులకు పెంచేలా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు లభించనుండగా, ఒత్తిడికి లోనుకాకుండా కూడా ఉంటారు. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో వీటిని అమలు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయం పెంపు.. పదో తరగతి పరీక్షల సమయాన్ని ప్రభుత్వం మరో అర గంట పెంచింది. గతంలో 2.45 గంటలు ఉన్న పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పొడిగించింది. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఆన్లైన్ బోధన, ప్రస్తుతం చేపట్టబోయే ప్రత్యక్ష బోధనకు సంబంధించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో కోర్ కాన్సెప్ట్‌లు, బోధించించాల్సిన అంశాలకు సంబంధించి ఇప్పటికే కేలండర్‌ను ప్రకటించింది. వాటి ప్రకారమే ప్రశ్నలు అడిగేలా చర్యలు చేపట్టింది. జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం కూడా ఒక్కటే ఉంటుంది. అయితే అందులో మూల్యాంకన సౌలభ్యం కోసం ఫిజికల్ సైన్స్ (పార్ట్–ఎ)కు, బయోలాజికల్ సైన్స్‌కు (పార్ట్–బి) వేర్వేరుగా జవాబు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాత పరీక్ష, ఇంటర్నల్స్ మార్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 చొప్పున 600 మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ కోర్సుల్లోనూ ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది. ఇదీ ప్రశ్న పత్రాల స్వరూపం – 2 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కింద ఇంటర్నల్స్‌కు 20 మార్కులు – ఒక్కో ప్రశ్న పత్రంలో 20 ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలకు 20 మార్కులు – వాక్య రూపంలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. 60 మార్కుల కోసం ఇచ్చే ప్రశ్నల స్వరూపం – వ్యాసరూప ప్రశ్నల విభాగంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్లో ఇచ్చే 3 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. మరో సెక్షన్‌లోనూ 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. 8 మార్కులు ఉంటాయి. ఇందులో మొత్తంగా 16 మార్కులు. – స్వీయ రచన విభాగంలో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 4 చొప్పున 8 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 చొప్పున 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. – సృజనాత్మకత విభాగంలో 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. – అవగాహన, ప్రతిస్పందన విభాగంలో మూడు ప్యాసేజీలు ఉంటాయి. వాటికి 20 మార్కులు ఉంటాయి. – గతంలో ద్వితీయ భాష మినహా మిగతా 5 సబ్జెక్టుల్లో రెండు చొప్పున 10 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ద్వితీయ భాష, మిగతా 5 సబ్జెక్టులకు 5 పేపర్లే ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలవి 20 మార్కులు కలుపుకొని 80 మార్కులకు ఒక్కో ప్రశ్న పత్రాన్ని ఇస్తారు. ఇలా మొత్తంగా 480 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్ 20 మార్కులు ఉంటాయి. ఇలా ద్వితీయ భాష, 5 సబ్జెక్టుల్లో మొత్తం 120 మార్కులు ఉంటాయి. – గతంలో హిందీ మినహా ఇతర సబ్జెక్టుల్లో ఉన్న 10 పేపర్లలో ఒక్కో పేపర్లో ఆబ్జెక్టివ్‌ను 5 మార్కులకు 10 ప్రశ్నలు ఇచ్చి ఒక్కో దానికి అర మార్కు ఇచ్చేవారు. ఇలా ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లలో కలిపి 10 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు ఉండనున్నాయి. -
ఇకపై మరింత లేటుగా బిగ్‌బాస్
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చటగా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో బిగ్‌బాస్ షో ప్రసార సమయాల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు 9.30 గంటలకు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ డిసెంబర్ 7 నుంచి రాత్రి పది గంటలకు టెలికాస్ట్ కానుంది. శని, ఆదివారాల్లో మాత్రం ఎప్పటిలాగే రాత్రి తొమ్మిన్నరకు బిగ్‌బాస్ అలరించనుంది. (చదవండి: బిగ్‌బాస్: గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఖరారు!) డిసెంబర్ 7 నుంచి స్టార్ మా ఛానల్లో 'గుప్పెడంత మనసు' అనే కొత్త సీరియల్ ప్రారంభం అవుతోంది. ఇది రాత్రి ఏడు గంటలకు ప్రసారం కాబోతోంది. దీంతో ఆ సమయంలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్‌ను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మార్చారు. ఈ మేరకు ప్రోమోలు కూడా వేస్తున్నారు. అంటే బిగ్‌బాస్ టైమింగ్స్‌ను వదినమ్మ సీరియల్ ఆక్రమించుకుందన్నమాట. దీని కారణంగా బిగ్‌బాస్ షో మరింత లేటుగా.. పది గంటలకు ప్రసారం కానుంది. అయితే షో ముగింపుకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రసార వేళల్లో మార్పుచేర్పులు చేసినా షోకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఇన్నివారాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులు సమయాన్ని పట్టించుకోకుండా మరికొద్ది రోజులు కూడా బిగ్‌బాస్‌ను వీక్షిస్తారని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అఖిల్‌కు ఇచ్చిన మాట తప్పిన మోనాల్) -
ప్రచారాలకు టైమూ..పాడూ ఉంటుంది
సాక్షి, కాజీపేట: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నాయకులకు యంత్రాంగం ఇప్పటికే అవగాహన కల్పించింది. ఉదయం ఆరు గంటల తర్వాతే లౌడ్‌స్పీకర్లతో ప్రచారం మొదలుపెట్టి రాత్రి 10 గంటల కల్లా ముగించాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బహిరంగసభలు నిర్వహిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి చర్యలు తీసుకుంటారు. బహిరంగసభల సందర్భంగా... బహిరంగ సభ ఏర్పాటుచేసే ప్రదేశం తేది, సమయాన్ని ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రాత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటప్పుడు పోలీసులే ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ఏర్పాట్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. సభ ఏర్పాటుచేసే ప్రదేశం ప్రభుత్వ ఆస్తులు, దేవాలయాలు ఆవరణలకు సంబంధించి ఉండకూడదు. ప్రైవేట్ ఆస్తులైతే సంబంధిత స్థలం యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతులు తీసుకోవాలి. ఊరేగింపుల్లో... ప్రతి అభ్యర్థి తమ ఊరేగింపు ఆరంభం అయ్యే సమయం, సాగే రూట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, ముగింపు సమయం ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరేగింపు సాగే మార్గంలో, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో ఆంక్షలు లేవని పోలీసు అధికారుల నుంచి నిర్ధారించుకోవాలి. అభ్యంతరాలు ఉంటే మార్గం మార్చుకోవాలి. ఊరేగింపుల్లో అందరూ పోలీసులు సూచించిన రీతిలో రోడ్డుకు ఒక పక్కన సాగుతూ క్రమశిక్షణతో మెలగాలి. -
301 రైళ్ల సమయాల్లో మార్పులు : రేపటినుంచే అమలు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖరైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ఉత్తరరైల్వేకు చెందిన పలు రైళ్ల బయలుదేరే సమయాలను ముందుకు మరికొన్ని రైళ్లలో డిపార్చర్ సమయాలను మార్చింది. ఆగస్టు 15 బుధవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఉత్తరరేల్వే రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 301 రైళ్ల సమయాలను మార్చారు. ఈ మార్పులు అయిదు నిమిషాలనుంచి రెండున్నర గంటల మధ్య ఉంటుందని రైల్వే ప్రకటించింది. 57 రైళ్ళలో బయలు దేరే సమయాలను ముందుకు జరిపింది. అలాగే 58 రైళ్లు గమ్యానికి చేరే సమయాన్ని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా 102 రైళ్ల ఎరైవల్ సమాయాన్ని ముందుకు జరిపగా, మరో 84 రైళ్ళ బయలుదేరే సమయం పెరిగింది. ఉత్తర రైల్వే ఈ న్యూ టైం టేబుల్‌ను ప్రజలకు అందుబాటులోఉంచామని ఉత్తర రైల్వే తెలిపింది. ఆగష్టు 15నుంచి అమలులోకి వస్తున్న ఈ మార్పులను ప్రజలు గమనించాలని కోరింది. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే ఎంక్వైరీ ద్వారా రైళ్ల రాకపోకల సమాచారాన్ని పొందాలని చెప్పింది. అమృత్ సర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ తదితర రైళ్లు ప్రస్తుతం సమయంకంటే ఐదు నిమిషాల ముందు బయలుదేరతాయి. అలాగే నీలాచల్ ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్-అమృతసర్, జన శతాబ్ది తదితర ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా గమ్యానికి చేరనున్నాయి. -
వెయ్యి కోట్లున్నాయి
షూటింగ్‌కి టైమ్‌కి రాడు. శింబుతో సినిమా అంటే అనుకున్న టైమ్‌కి కంప్లీట్ అవ్వదు. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుంటాయి శింబుతో వర్క్ చేసిన దర్శక – నిర్మాతల దగ్గరి నుంచి. ‘‘నా మీద ఉన్న ఈ నెగటీవ్ కామెంట్స్ అన్నింటినీ చెరిపేసుకుంటాను. ప్రస్తుతం దాని మీదే వర్కౌట్ చేస్తున్నాను’’ అన్నారు శింబు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘హీరోగా నా తొలి సినిమాని మా నాన్న (టి. రాజేందర్)గారితో చేసినప్పుడు షూటింగ్‌కి పది గంటలకు వెళ్లేవాణ్ని. అలాగని నాకెవరన్నా లెక్కలేదని కాదు. మా నాన్నే కదా అని గ్రాంటెడ్‌గా తీసుకున్నట్లూ కాదు. అది నా లైఫ్ స్టైల్. నేను చాలా గారంగా పెరిగాను. చిన్నప్పటి నుంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను. నాకు వెయ్యి కోట్లు పైగా ఆస్తులున్నాయి. వాటితో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. కానీ నాకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. సినిమా ఒక్కటే తెలుసు. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టాలని, హర్ట్ చేయాలనీ నాకెప్పుడూ లేదు. నా మీద ఉన్న బ్యాడ్ కామెంట్స్ అన్నీ క్లియర్ చేసే దిశగా వర్క్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శింబు. అంటే.. శింబు ఇక టైమ్‌కి షూటింగ్‌కి ఎటెండ్ అవుతారా? టైమే చెప్పాలి. -
అటెన్షన్ ప్లీజ్ : ఐపీఎల్ టైమింగ్స్‌లో మార్పు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11 సీజన్లో ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సమయం కంటే ఓ గంట ముందుగానే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అభిమానుల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం మీడియాకు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీవీ, మైదానాల్లో చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను ఓ గంట ముందు ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం మైదానంలోని అభిమానుల కోసమే కాకుండా టీవీ ప్రేక్షకులను సైతం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. మ్యాచ్‌లు ఆలస్యం కావడంతో మైదాన, టీవీ ప్రేక్షకులకు ఉదయం లేచి, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. దీంతో మ్యాచ్ సమయాలను మార్చాం’ అని శుక్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లు రాత్రి 11.30 ముగుస్తున్నాయి. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అర్థరాత్రి 12 తర్వాత ముగుస్తున్నాయి. వర్షం అంతరాయం కలిగిస్తే ఇక అంతే సంగతులు. దీంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
-
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్- అమీర్‌పేట్- నాగోల్ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. Happy to announce CMRS has cleared the new signalling system & Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours & every 8 minutes during non-peak on Miyapur - Ameerpet- Nagole stretches from tomorrow 6 am onwards — KTR (@KTRTRS) April 20, 2018 -
రాత్రి 2.30 వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్, మియాపూర్ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయన్నారు. కాగా మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సరాసరిన లక్ష మంది రాకపోకలు సాగిస్తుండగా.. ఆదివారం ఇతర సెలవు దినాలలో మాత్రం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. -
మారిన రైళ్ల రాకపోకల వివరాలు
ఏలూరు అర్బన్ : ఏలూరు రైల్వేస్టేçÙన్ మీదుగా వెళ్లే మూడు రైళ్ల రాకపోకల వేళలు శనివారం నుంచి మారినట్టు ఏలూరు రైల్వేస్టేçÙన్ మేనేజర్ ఏవీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లే 22416 నంబర్ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి మధ్యాహ్నం 1.10కి వచ్చి 1.12కి బయలుదేరుతుందన్నారు. హౌరా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే 18645 నంబర్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.15కి ఏలూరు వచ్చి 9.17కి వెళుతుందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే 12806 నంబర్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 2.15 నిమిషాలకు వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
నమాజ్ వేళలు(10-09-2016)
ఫజర్ : 4.51 జొహర్ : 12.13 అస్ : 4.37 మగ్రిబ్ : 6.22 ఇషా : 7.35 -
నమాజ్ వేళలు(04-09-2016)
ఫజర్ : 4.49 జొహర్ : 12.15 అస్ : 4.40 మగ్రిబ్ : 6.27 ఇషా : 7.40 -
నమాజ్ వేళలు(03-09-2016)
ఫజర్ : 4.49 జొహర్ : 12.15 అస్ : 4.41 మగ్రిబ్: 6.28 ఇషా : 7.41 -
నమాజ్ వేళలు(2-9-2016)
ఫజర్ : 4.49 జొహర్ : 12.16 అస్ : 4.41 మగ్రిబ్ : 6.29 ఇషా : 7.42 -
నమాజ్ వేళలు(1-09-2016)
ఫజర్ : 4.49 జొహర్ : 12.16 అస్ : 4.42 మగ్రిబ్ : 6.30 ఇషా : 7.43