
యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యశ్వంత్‌పూర్–కాచిగూడ (16569/ 16570)స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. (క్లిక్: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!)