ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు పురస్కారాలు | Awards for South Central Railway in energy saving | Sakshi
Sakshi News home page

ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు పురస్కారాలు

Published Tue, Jan 12 2021 5:32 AM | Last Updated on Tue, Jan 12 2021 5:32 AM

Awards for South Central Railway in energy saving - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంధన పొదుపులో దక్షిణమధ్య రైల్వేకు కేంద్రం నుంచి మూడు పురస్కారాలు లభించాయి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డులు ప్రకటించింది. కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ వర్చువల్‌ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌కు ఈ పురస్కారాలు అందించారు. పరిశ్రమ/రైల్వే వర్క్‌షాప్‌ కేటగిరీలో విజయవాడ డీజిల్‌ లోకోòÙడ్‌ ప్రథమ బహుమతి పొందింది. భవనాలు/ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో సికింద్రాబాద్‌లోని ఎస్‌సీఆర్‌ అకౌంట్స్‌ కార్యాలయ భవనం రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌పోర్టు/జోనల్‌ రైల్వే కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే ‘జోన్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌’సాధించింది. 

తిరుపతి–సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ 
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్‌ (07456) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement