yesvantpur
-
యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా యశ్వంత్‌పూర్–కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యశ్వంత్‌పూర్–కాచిగూడ (16569/ 16570)స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. (క్లిక్: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
ఇద్దరు భార్యలను కాదని మరో పెళ్లి.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి
యశవంతపుర (బెంగళూరు): బెళగావి భవాని నగర గణపతి దేవస్థానం వద్ద ఈనెల 15న చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్(46) హత్యోదంతాన్ని గ్రామాంతర పోలీసులు ఛేదించారు. వ్యాపార భాగస్వాములతో కలిసి రెండో భార్య కిరణ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించి, ఆమెతో పాటు ధర్మేంద్ర, శశికాంత్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. రాజు దొడ్డబొమ్మన్నవర్ మొదటి భార్య లాతూరులో ఉంది. ఇద్దరు భార్యలను కాదని రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తిని తన పిల్లల పేరున పెట్టాలని కిరణ భర్తతో గొడవ పడేది. చదవండి: (విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు) ఈక్రమంలో భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వ్యాపారంలో రాజుతో విభేదాల వల్ల ఆయనకు దూరంగా ఉన్న ధర్మేంద్ర, శశికాంత్‌తో కిరణ చేతులు కలిపింది. సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి కారులో వెళ్తున్న రాజును కత్తులతో పొడిచి హత్య చేయించారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్‌డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బట్టబయలైంది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా భయటపడిందంటే..) -
గొల్లప్రోలు వద్ద రైలులో అగ్నిప్రమాదం
-
యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. ప్రమాదం జరగడంతో ఐదు గంటలుగా రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన రైలును మరికాసేపట్లో గొల్లప్రోలు నుంచి పిఠాపురం తరలించనున్నారు. గొల్లప్రోలు స్టేషన్ వద్ద రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం ఒకే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో విజయవాడ-విశాఖపట్నం మద్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
ఇండోర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండోర్-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. 2012-13 బడ్జెట్లో రైల్వేశాఖ ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించింది. అయితే వివిధ కారణాలతో ప్రారంభంకాని ఈ రైలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఆదివారం రాత్రి 8.55కు ఇండోర్‌లో బయలుదేరే ఈ రైలు యశ్వంత్‌పూర్‌కు మంగళవారం ఉదయం 11.15కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.30కి యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ఇండోర్‌కు గురువారం ఉదయం 5.15కు చేరుకుంటుంది. ఇది నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, గుత్తి, ధర్మవరం మీదుగా వెళ్తుంది.