భర్తతో నిందితురాలు కిరణ (ఫైల్)
యశవంతపుర (బెంగళూరు): బెళగావి భవాని నగర గణపతి దేవస్థానం వద్ద ఈనెల 15న చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్(46) హత్యోదంతాన్ని గ్రామాంతర పోలీసులు ఛేదించారు. వ్యాపార భాగస్వాములతో కలిసి రెండో భార్య కిరణ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించి, ఆమెతో పాటు ధర్మేంద్ర, శశికాంత్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. రాజు దొడ్డబొమ్మన్నవర్ మొదటి భార్య లాతూరులో ఉంది. ఇద్దరు భార్యలను కాదని రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తిని తన పిల్లల పేరున పెట్టాలని కిరణ భర్తతో గొడవ పడేది.
చదవండి: (విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు)
ఈక్రమంలో భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వ్యాపారంలో రాజుతో విభేదాల వల్ల ఆయనకు దూరంగా ఉన్న ధర్మేంద్ర, శశికాంత్‌తో కిరణ చేతులు కలిపింది. సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి కారులో వెళ్తున్న రాజును కత్తులతో పొడిచి హత్య చేయించారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్‌డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బట్టబయలైంది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: (మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా భయటపడిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment