Real Estate Merchant
-
ఇద్దరు భార్యలను కాదని మరో పెళ్లి.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి
యశవంతపుర (బెంగళూరు): బెళగావి భవాని నగర గణపతి దేవస్థానం వద్ద ఈనెల 15న చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్(46) హత్యోదంతాన్ని గ్రామాంతర పోలీసులు ఛేదించారు. వ్యాపార భాగస్వాములతో కలిసి రెండో భార్య కిరణ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు నిర్ధారించి, ఆమెతో పాటు ధర్మేంద్ర, శశికాంత్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. రాజు దొడ్డబొమ్మన్నవర్ మొదటి భార్య లాతూరులో ఉంది. ఇద్దరు భార్యలను కాదని రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తిని తన పిల్లల పేరున పెట్టాలని కిరణ భర్తతో గొడవ పడేది. చదవండి: (విజయ్ సేతుపతి సహకారంతోనే.. లక్షకు పైగా ఉద్యోగాలు) ఈక్రమంలో భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వ్యాపారంలో రాజుతో విభేదాల వల్ల ఆయనకు దూరంగా ఉన్న ధర్మేంద్ర, శశికాంత్‌తో కిరణ చేతులు కలిపింది. సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి కారులో వెళ్తున్న రాజును కత్తులతో పొడిచి హత్య చేయించారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్‌డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బట్టబయలైంది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మూడు పెళ్లిళ్లు.. మరికొందరితో చాటింగ్.. ఎలా భయటపడిందంటే..) -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్య
భీమవరం టౌన్: భీమవరం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నారిశెట్టి సునీల్ కుమార్ (33)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. భీమవరం వన్‌టౌన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ శివారు సెయింట్ ఆన్స్ స్కూల్స్ వెనుక ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో సునీల్ కుమార్ నిర్జీవంగా కనిపించాడు. హత్యకు వినియోగించిన కత్తి, రెండు ఇనుపరాడ్లు మృత దేహం పక్కనే హంతకులు వదిలివెళ్లారు. సంఘటనా స్థలం వద్ద మద్యం, బీరుసీసాలు, సోడా బాటిళ్లు, చెప్పులు, చిప్స్ ప్యాకెట్లు పడి ఉన్నాయి. ఒక మోటార్ సైకిల్ కూడా ఉంది. మృతుడు తనకు బాగా తెలిసిన వాళ్లతోనే అక్కడ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. తెలిసినవారే పథకం ప్రకారం హత్య చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దిశగా పోలీసులు దృష్టి సారించారు. రెస్ట్ హౌస్ రోడ్డుకు చెందిన మృతుడు సునీల్ కుమార్ కొంత కాలం క్రితం కారు డ్రైవర్‌గా పనిచేశాడని ఆ తర్వాత నెమ్మదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టాడని స్థానికులు చెబుతున్నారు. 2017 మార్చిలో రెస్ట్ హౌస్ రోడ్డుకు చెందిన కోడే వెంకట్ అనే వ్యక్తిని పాత గొడవల నేపథ్యంలో కొందరు వ్యక్తులు పద్మాలయ థియేటర్ వెనుక రోడ్డులో దాడి చేసి హత్య చేశారు. ఆ కేసులో నిందితునిగా ఉన్న ఒక వ్యక్తితో సునీల్ కుమార్ ఇటీవల సన్నిహితంగా ఉండడం నచ్చని వ్యక్తులు ఎవరైనా ఈ హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తే హంతకుల జాడ తెలిసే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు దృష్టిపెట్టారు. సంఘటనపై మృతుడి భార్య నారిశెట్టి మాధవి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త సునీల్ కుమార్ ఈనెల 8వ తేదీ రాత్రి 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారని 10.30 గంటల సమయంలో తాను ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలవగా వస్తానని చెప్పినట్లు మాధవి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై పి.అప్పారావు తెలిపారు. వస్తానన్న భర్త రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదని, 9వ తేదీ తెల్లవారుజామున సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక తన భర్త చనిపోయి ఉన్నట్లు అతని స్నేహితుడు యజ్రా ద్వారా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా తన భర్త తలపై రాడ్లతో కొట్టి కత్తితో పొడిచి హత్య చేయబడి ఉన్నాడని ఆమె ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భర్త సునీల్ కుమార్ 8వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో యజ్రాతో మద్యం తెప్పించుకుని సంఘటనా స్థలంలో రాజు, సాయి అలియాస్ ఆంటీ అనే వాళ్లతో తాగినట్లు తెలిసిందని మాధవి ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. అయితే ఈ కేసులో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న భీమవరం పట్టణంలో సునీల్ కుమార్ హత్యతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు పరిశీలించారు. భీమవరం టూటౌన్, పెనుగొండ సీఐలు ఎ.చంద్రశేఖర్, ఆర్.విజయ్‌కుమార్, భీమవరం వన్‌టౌన్, ఉండి, పాలకొల్లు రూరల్ ఎస్సైలు పి.అప్పారావు, రవివర్మ, విజయ్‌కుమార్‌లు సంఘటనా స్థలం వద్ద విచారణ చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. -
దొంగల్లో ఈ దొంగలు వేరయ్యా..!
చెన్నై: దొంగలు కూడా విభిన్న రీతిలో దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో వారిని భయపెట్టి లూటీ చేయడం, ఎవరు లేని సమయంలో దొంగతనాలు చేయడం గురించి విన్నాం. కానీ వీటికి విభిన్నంగా ఓ ఇంట్లో దొంగతనానికి దుండగులు యత్నించారు. కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న గదికి తాళం వేసి నగలు, నగదు ఉన్న బీరువాను ఎత్తుకుపోయారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెరియకుళమ్ తెన్‌కరై భారతి నగరానికి చెందిన అబ్దుల్‌రహీం(63) రియల్ ఎస్టేట్ వ్యాపారి. బుధవారం రాత్రి ఇతడు కుటుంబీకులతో తన ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నాడు. వంట గది కిటికీని పగులగొట్టుకుని లోపలికి చొరబడిన దుండగులు ఇంట్లో వారు నిద్రిస్తున్న గదికి బయట నుంచి తాళం వేశారు. తరువాత ఇంట్లో విలువైన వస్తువుల కోసం వెదికారు. ఓ గదిలోని బీరువా లాకర్‌ను తెరిచేందుకు యత్నించగా అది తెరుచుకోలేదు. దీంతో బీరువాలో ఉన్న దుస్తులను కింద వేసి బీరువాను మాత్రం ఎత్తుకొని వెళ్లారు. లాకర్‌ను పగులగొట్టి అందులో ఉన్న నగలను, నగదును ఎత్తుకుపోయారు. గురువారం నిద్ర లేచిన అబ్దుల్ రహీం గది తలుపులను తెరిచేందుకు యత్నించారు. ఆ గదికి బయట తాళం వేయడంలో తెరవలేక పోయరు. ఇంటి పక్కన వారికి ఫోన్ చేయటంతో వారు వచ్చి తలుపులు తెరిచారు. బయటకు వచ్చిన వారికి గదిలో బీరువా కనిపించలేదు. దీంతో అబ్దుల్ రహీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న 52 సవర్ల నగలు, రూ. 55 వేల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారని అందులో పేర్నొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
వేదనలో వినిపించిన జీవనవేదం
పాటతత్వం ‘ఆ పాట లేకపోతే ఆ సినిమా లేదు’ అన్నారు చంద్రసిద్ధార్థ్. ‘ఈ మాటలు మనవి కావు, చైతన్యప్రసాద్వి’ అన్నారు బాలు. ‘ఇంత చిన్న వయసులో జీవితానుభవాన్ని కాచి వడబోసిన గొప్ప పాట’ అన్నారో పెద్దాయన. ‘కారులో విజయవాడ చేరేవరకూ ఈ ఒక్క పాటే వింటుం టాను’ అన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ‘ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు’ అంటూ యూ ట్యూబ్‌లో ఎన్నో కామెంట్లు. ఇవి ‘ఆ నలుగురు’ సినిమాలో నేను రాసిన ‘ఒక్కడై రావడం’ పాటకు లభించిన అవార్డుల్లో కొన్ని. ఈ పాటకు నాకు చాలా అవార్డులు వచ్చి వుంటాయని చాలామంది అనుకోవడం నాకు తెలుసు. కానీ ఏ అవార్డులూ రాలేదు. ఈ మాటలే అవార్డులు. చాలాకాలంగా సినీ పరిశ్రమలో ఉన్నా, 2002లో ‘అల్లరి రాముడు’ నుంచి మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నాను. 2004లో ‘ఆ నలుగురు’ వచ్చింది. అంటే పాటల రచయితగా అవి నా ప్రారంభ దినాలు. ఈ సినిమా ఏమో మామూలు సినిమా కాదు. ఉన్న మూడు పాటలూ ఏదో ఒక తాత్వి కతను ప్రతిఫలించడమో, ప్రతిపాదించడమో చేయాలి. అందుకే లబ్దప్రతిష్టులైన కవులతో రాయించాలని నిర్మాత ప్రేమ్‌కుమార్, రచయిత మదన్ అభిప్రాయపడ్డారు. నన్ను నమ్మింది ఇద్దరే... చంద్రసిద్ధార్థ, ఆర్పీ. మదన్‌తో పేచీ తొందరగానే తెమిలిపోయింది. కానీ ప్రేమ్ కుమార్ మాత్రం దర్శకుడికి ఎదురు చెప్పలేక ఊరుకున్నారు. క్లయిమాక్స్ పాట విషయంలో చివరి వరకూ వేరే అభిప్రాయంతోనే ఉన్నారు. ఈ సినిమా హీరో చావుతో మొదలవు తుంది. అంతా శవం చుట్టూ తిరుగుతుంది. చూసేవాళ్లకు డిప్రెషన్ వస్తుందేమోనని నా భయం. ‘అలా రాకుండా నేను తీస్తానుగా’ అనే వారు చందూ. ఈ పాట విషయంలో కూడా అదే సందేహం వ్యక్తం చేస్తే... ‘చావు గురించి చెబుతూ జీవితం పట్ల ప్రేమ, గౌరవం కలిగేలా రాయండి’ అన్నారు. పైగా పాటకు పల్లవి, చరణాలు లేవు. ట్యూన్‌ను బిట్స్లా ఇచ్చారు ఆర్పీ. ఏవి ఎక్కడ వాడతారో తనకూ తెలీదన్నారు దర్శకులు. నిజానికి రాయడానికైతే విషయం చాలానే ఉంది. చావు పుటకల గురించి భారతీయ తత్వ వేదాంత చింతనల్లో విస్తృత చర్చ ఉంది. ‘సహస్రవర్ష’ కావ్యం రాసేటప్పుడు సృష్టి గురించీ, కర్మ-భక్తి యోగాల గురించీ భగవద్గీతలో అధ్యయం చేసివున్నాను. ఆదర్శ, అభ్యుదయవాదాలూ సుపరిచితాలు. ఆశయా నికీ ఆశలకూ మధ్య నిత్య ఘర్షణ ఎలా ఉంటుందో నా నలభయ్యేళ్ల జీవితంలో నాకు అనుభవమైంది. ప్రేమించినవాళ్లు మరణిస్తే ఆ దుఃఖభారం ఎలా ఉంటుందో తండ్రినీ, ఆత్మీయ బంధుమిత్రుల్నీ కోల్పోయిన నాకు తెలుసు. ఇదంతా ఈ పాటలో చెప్పాలి. వేదన నిర్వేదంగా మారకుండా జీవనవేదంలా చెప్పాలి. కళ్లు కాదు, గుండె చెమ్మగిల్లాలి. బతికితే ఇలా బతకాలి అనిపించాలి. ఆ మథనం లోంచే నా మనసు పలికింది. ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం విధిలీల/వెంట ఏ బంధమూ.. రక్త సంబంధమూ... తోడుగా రాదుగా తుదివేళ/మరణమనేది ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని/నీ బరువూ నీ పరువూ మోసేదీ/ఆ నలుగురూ... ఆ నలుగురూ నీ బరువునే కాదు నీ పరువును కూడా ఆ నలుగురూ మోస్తారనడం కొత్త వ్యక్తీకరణ. ఇక రెండో చరణంలో కచ్చితంగా కథానాయకుడు విలువల కోసం ఎన్ని కష్టాలు భరించాడో, ఏ ఆశయం కోసం జీవించాడో గుర్తు చేయాలి. నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోశావు/అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే చూపావు/నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా/నీ వెనుకే అనుచరులై నడిచారూ... ఆ నలుగురూ ఆ నలుగురూ మూడో చరణం రాసేటప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం కాటి సీన్లో వాడే జాషువా గారి పద్యాలు గుర్తొచ్చాయి. ఆ బాణీలో రాశాను. రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదీ యమపాశం/కోట్ల ఐశ్వర్యమూ కటిక దారిద్య్రమూ హద్దులే చెరిపెనీ మరు భూమి/మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం/నీ వెంట కడకంటా నడిచేదీ... ఆ నలుగురూ ఆ నలుగురూ ఇది సినిమాలో పెట్టడానికి కుదరలేదు. ఇక నాలుగో చరణం.. మరణించిన మిత్రుణ్ని మనసారా సంబోధిస్తూ పలికే వీడ్కోలు. ఆ చరణంతో ముగిస్తే సినిమా మన సుల్లో ముద్రపడుతుందని నా అభిప్రాయం. అదే హీరో చితి మంటలపై వచ్చే ఆఖరి చరణం. పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు/ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిర కాలం/ బతికిననాడు బాసటగా పోయిననాడు ఊరటగా/ అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ పాట పూర్తయ్యింది. మొదట్నుంచీ సందేహిస్తూ వచ్చిన నిర్మాత ప్రేమ్‌కుమార్ చెమ్మగిల్లిన కళ్లతో వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడం ఎంత మధు రానుభవం! ఈ పాటను టీవీల్లో ప్రముఖుల చరమ యాత్రాగీతికగా వాడటం అన్నిటికంటే గొప్ప అనుభూతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌గారి అంతిమయాత్రకు ఇది నేపథ్య గీతం అయ్యింది. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు, నా ఆత్మీక కవిమిత్రుడూ అయిన అరుణ్ సాగర్ అంతిమయాత్ర నేపథ్యంలో కూడా ఈ పాట వినిపిస్తే... కన్నీళ్లను ఆపుకోవడం నా వల్ల కాలేదు. జీవిత ఔన్నత్యాన్ని చెప్పే ఈ గీతం ఎందుకు అందరితో కన్నీళ్లు పెట్టిస్తోందో నాకప్పుడే అనుభవ పూర్వకంగా అర్థమైంది! - చైతన్య ప్రసాద్, గీత రచయిత