ఇండోర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం | New train from Bangalore to Indore | Sakshi
Sakshi News home page

ఇండోర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

Published Wed, Aug 7 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

New train from Bangalore to Indore

సాక్షి, హైదరాబాద్: ఇండోర్-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. 2012-13 బడ్జెట్‌లో రైల్వేశాఖ ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించింది. అయితే వివిధ కారణాలతో ప్రారంభంకాని ఈ రైలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఆదివారం రాత్రి 8.55కు ఇండోర్‌లో బయలుదేరే ఈ రైలు యశ్వంత్‌పూర్‌కు మంగళవారం ఉదయం 11.15కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.30కి యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ఇండోర్‌కు గురువారం ఉదయం 5.15కు చేరుకుంటుంది. ఇది నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, గుత్తి, ధర్మవరం మీదుగా వెళ్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement