Hyderabad Metro Train Service Timings Extended To 11 PM, Know Details - Sakshi
Sakshi News home page

Hyd Metro Train Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి వేళ సర్వీసులు పొడిగింపు

Published Fri, Oct 7 2022 6:58 PM | Last Updated on Fri, Oct 7 2022 7:14 PM

Hyderabad Metro Service Timings Extended - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌ పొడిగిస్తూ నిర్వాహకులు శుక్రవారం కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే మెట్రో సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై రాత్రి 11 గంట‌ల‌ వరకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు  హైద‌రాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పొడిగించిన కొత్త సర్వీసు వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో సేవలు ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభమై  రాత్రి 10.15 గంట‌ల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంట‌ల దాకా నగరవాసులు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఉదయం వేళ సర్వీసులో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement