Train service
-
NaMo Bharat: తొలి ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’ను ప్రారంభించిన మోదీ
భారత్‌లోనే తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ సర్వీస్ ‘ర్యాపిడ్ ఎక్స్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్‌కు ప్రధాని మోదీ జెండా ఊపి జాతికి అంకితం చేశారు. రైలును ప్రారంభించిన అనంతరం మోదీ అందులో ప్రయాణించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ర్యాపిడ్ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు. #WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi flags off the RapidX train connecting Sahibabad to Duhai depot, marking the launch of Regional Rapid Transit System (RRTS) in India. This is India’s first RapidX train which will be known as NaMo Bharat. pic.twitter.com/YaanYmocB8 — ANI (@ANI) October 20, 2023 కాగా ఈ తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలును ‘నమో భారత్‌గా’ గా పేరు మారుస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో ముందుగా 17 కి.మీ. దూరానికి సంబంధించి రైలు రాకపోకలు సాగిస్తోంది. రేపటి నుంచి (అక్టోబర్ 21) దేశ రాజధాని ప్రాంత వాసులకు ఈ రైలు అందుబాటులో రానుంది. మొత్తం అయిదు స్టేషన్ల మధ్య రైలు ప్రయాణించనుంది. #WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi inspects the priority section project of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor through a VR headset. He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flag off RapidX train - 'NaMo… pic.twitter.com/pX7zUFP25O — ANI (@ANI) October 20, 2023 గత ఏప్రిల్‌లో జాతీయ రాజధాని ప్రాంత రవాణా కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ) ఈ ఆర్ఆర్టీఎస్ రైలును ‘ర్యాపిడ్ఎక్స్’గా నామకరణం చేసింది. అనంతరం దీనిని నమో భారత్‌గా పేరు మార్చారు. దేశలోని తొలి సెమీహైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీసు ప్రాజెక్టులను ఎన్సీఆర్టీసీ తీసుకొస్తుంది. ఈరైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఇక ఇప్పటికే భారతీయ రైల్వేశాఖ వందే భారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైలును నడుపుతున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రైలు పరుగులు పరుగులు పెడుతోంది. #WATCH | Prime Minister Narendra Modi interacts with school children and crew of RapidX train - 'NaMo Bharat' - connecting Sahibabad to Duhai Depot, onboard the train. He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flagged off NaMo Bharat at… pic.twitter.com/o6GQp7wMav — ANI (@ANI) October 20, 2023 ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ కారిడార్‌ను ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా రూ. 30 వేల కోట్ల రూపాయలతో చేపట్టింది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 180 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ►ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కన్పిస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! -
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు రాపిడ్‌ఎక్స్ (RAPIDX) ఈ నెల (జూలై)లోనే ప్రారంభం కానుంది. 17 కిలో మీటర్ల పొడవుతో ఏర్పాటైన ఈ రైలు సర్వీసులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహాయ్ డిపో అనే స్టేషన్లు ఉంటాయని ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అన్ని స్టేషన్లు పనులన్నీ పూర్తయి కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. దీంతోపాటు సాహిబాబాద్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు 42 కిలోమీటర్ల రైలు సర్వీస్ కూడా పూర్తయింది. దుహాయ్ డిపో తర్వాత 25 కి.మీ సెక్షన్‌ను ప్రాధాన్యతా విభాగం తర్వాత ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సెక్షన్లో మురదానగర్, మోదీ నగర్ సౌత్, మోదీ నగర్ నార్త్, మీరట్ సౌత్ స్టేషన్లు ఉంటాయి. ఈ సెక్షన్లు ఢిల్లీ - మీరల్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో భాగం. ఇందులో రైళ్లు 160 కి.మీ వేగంతో నడిచే అవకాశం ఉంది. 2025 నాటికి 82 కిలో మీటర్లు ఆర్ఆర్టీఎస్ నిర్మాణం 2019 జూన్‌లో ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌టీస్ కారిడార్‌ను నిర్మిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2025 నాటికి మొత్తం 82 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 30,274 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌టీస్ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్‌ను ఎన్సీఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్రం ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రతి రాపిడ్‌ఎక్స్ రైలులో ప్రీమియం కోచ్ తర్వాత మహిళలకు ఒక ప్రత్యేక కోచ్ ఉంటుంది. రిజర్వ్డ్ కోచ్‌లో 72 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ప్రతి స్టేషన్లోనూ డైపర్ మార్చేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడం విశేషం. -
100 బోగీలు..1.9 కిలోమీటర్ల పొడవు!
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. -
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో సర్వీసు వేళలు పెంపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైల్ వేళలను మరింత పొడిగిస్తూ నిర్వాహకులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై రాత్రి 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పొడిగించిన కొత్త సర్వీసు వేళలు ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో సేవలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 10.15 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంటల దాకా నగరవాసులు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఉదయం వేళ సర్వీసులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
2025 నాటికి 25 నగరాల్లో మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’నూ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం ఆ సేవలు 18 నగరాలకు విస్తరించాయన్నారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుందన్నారు. ప్రస్తుతం మెజెంటా లైన్(జానక్‌పురి వెస్ట్ – బొటానికల్ గార్డెన్)లో ఈ ట్రైన్లు నడుస్తాయని, మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ – శివ్ విహార్)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. 21వ శతాబ్దపు భారత దేశ వైభవాన్ని ఢిల్లీ ప్రతిబింబించాలని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పాత పర్యాటక నిర్మాణాలను ఆధునీకరించడంతో పాటు, నగరానికి 21వ శతాబ్దపు హంగులను అద్దనున్నామన్నారు. సాగు ఉత్పత్తుల కోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో సోమవారం 100వ కిసాన్ రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్లోని షాలిమార్ వరకు ఈ కిసాన్ రైలు నడవనుంది. చిన్న, మధ్య తరహా రైతులు తమ ఉత్పత్తులను సూదూరంలో ఉన్న మార్కెట్లలో అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న ఈ కిసాన్ రైళ్లు ఉపయోగపడ్తాయని ప్రధాని వివరించారు. ఈ రైళ్లకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. -
నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ: మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో పట్టాలెక్కనుంది. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ 28న ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీనితోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు. ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో డ్రైవర్‌లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. -
న్యూ పిడుగురాళ్లలో తొలి రైలు కూత
పిడుగురాళ్ల: నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే పనులు తొలిదశ పూర్తి కావడంతో గురువారం న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ నుంచి రైలు ప్రయాణం ప్రారంభించారు. మొదటి దశ పనులు న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి శావల్యాపురం వరకు 45.85 కిలోమీటర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో అతివేగంగా వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే ì రైల్వే జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, డెప్యూటీ చీఫ్ మేనేజర్ రామ్ క్రిపాల్ హాజరయ్యారు. ముందుగా న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి రామ్ క్రిపాల్ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ముందుగా పిడుగురాళ్ల పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో రైల్వే జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, గుంటూరు రైల్వే రీజనల్ మేనేజర్ రాజుతో పాటు రైల్వే అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే మార్గంలో ప్రారంభమవుతున్న రైలు ప్రయాణం విజయవంతం కావాలని పూజలు చేశారు. దేవస్థానం అధ్యక్షుడు కోదండరామయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ నిర్వాహకులు రైల్వే అధికారులకు స్వాగతం పలికారు. నడికుడి–శ్రీకాళహస్తి మొదటి దశ పనులు పూర్తి కావడంతో రైలును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 45.85 కిలోమీటర్లు రైల్వే లైన్ పూర్తయిందన్నారు. ఎక్కువ వేగంతో ఈ రైలు వెళుతుందని తెలిపారు. రైలు వెళ్లే మార్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ నుంచి రొంపిచర్ల వరకు గురువారం ఈ రైలు నడపబడుతుందని, శుక్రవారం రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు నడుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే రీజనల్ మేనేజర్ రాజా, రైల్వే అధికారులు పాల్గొన్నారు. రొంపిచర్లకు రైలు వచ్చింది రొంపిచర్ల: మండలంలో నూతనంగా నిర్మాణమైన రైల్వే ట్రాక్‌పై గురువారం రైలు స్పీడ్‌రన్ నిర్వహించింది. ముందుగానే రైలు వస్తుందన్న సమాచారం గ్రామస్తులకు తెలియటంతో రైలును చూసేందుకు రైలు మార్గం చుట్టుపక్కలున్న గ్రామస్తులు ఆసక్తి చూపారు. మండలంలో ఏర్పాటు చేసిన ఏకైక రైల్వేస్టేషన్ రొంపిచర్ల కావటంతో ప్రజలు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఎక్కువ మంది యువకులు, విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చి స్టేషన్‌కు వచ్చిన రైలులో ఎక్కి దిగడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణంలో భాగంగా మొదటి దశలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు నిర్మాణం పూర్తయింది. పిడిగురాళ్ల నుంచి బయలు దేరిన రైలు రొంపిచర్లకు సాయంత్రానికి చేరుకుంది. రైలును వీక్షించేదుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రైల్వే అధికారులు ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు. 40 సంవత్సరాలుగా రైల్వే లైను ఏర్పాటవుతుందని ఎదురు చూస్తున్న ఈ ప్రాంత వాసుల కల నేరవేరింది. రైలు రావటం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైలు సౌకర్యం రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు. -
మాజీ ఎంపీల కృషి.. ప్రయాణికుల ఖుషీ..
కడప కోటిరెడ్డి సర్కిల్: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు కడప స్టేషన్ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్యే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ రైలును పొడిగించాలని కడప, రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుసార్లు పార్లమెంటులో చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వీరు స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్యే బోర్డు మీటింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలును పొడిగించాలని పట్టుపట్టారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు అధికారులు కడప వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఎట్టకేలకు పొడిగించారు. ఈ రైలు విశాఖనుంచి బయలు దేరి కడపకు రానుంది. ఈ రైలు రాకతో రాజధాని ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఫిబ్రవరి 1 సాయంత్రం 5.5 గంటలకు కడప నుంచి రైలు బయలుదేరి తిరుపతికి వెళ్లి అటునుంచి విశాఖకు బయలుదేరుతుంది. నిన్నటి వరకు ప్రయాణికులు విజయవాడకువెళ్లాలంటే ధర్మవరం–విజయవాడ రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,నంద్యాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. వారానికి 3రోజులు మాత్రమే ఈ రైలు నడుస్తోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విశాఖ–తిరుమలఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అభినందనీయం.. కడప నుంచి రాజధాని మీదుగా రైలు సౌకర్యం కల్పించడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి రాజధానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. ఈ క్రమంలో అనేకమార్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి కడపనుంచి రాజధానికి నేరుగా ఏదో ఒక మార్గంలో రైలు సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. సమయం ఇలా.. విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి 5.20 గంటలకు బయలుదేరి రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా 8.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 5.05 గంటలకు కడప స్టేషన్లో బయలుదేరి తిరుపతికి రాత్రి 8.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారాపూడి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. మాజీ ఎంపీలకు, దక్షిణ మధ్య రైల్యే అధికారులకు జిల్లాలోని ప్రయాణికులు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
అమరావతికి అవస్థల ప్రయాణం!
తిరుపతి అర్బన్ : తిరుపతి నుంచి రాష్ట్ర రాజధాని నగరాలు విజయవాడ, గుంటూరుకు చాలినన్ని రైళ్లు లేవు. రైళ్ల కొరతతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు, ఉద్యోగులు, ప్రయాణికులు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా తిరుపతి నుంచి విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో ప్రయాణించే రైళ్లకు పదింతల రద్దీ పెరిగినా అందుకు అనుగుణంగా అదనపు రైళ్లు గానీ, బోగీలు గానీ ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ఆ వైపు ప్రయాణం అంటేనే ప్రజలు నరకంగా భావించా ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ రోజు ల్లోనే రైల్వే ప్రయాణికులు రోజూ 70 నుంచి 85 వేల వరకు ఉంటారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో లక్ష మందికిపైగా ప్రయాణిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తిరుపతికి వచ్చి వెళ్లే యాత్రికుల కష్టాలు అటుంచితే... విజయవాడ, విశాఖ పరిసర జిల్లాల నుంచి వచ్చివెళ్లే యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఐదు రైళ్లే .. తిరుపతి నుంచి విజయవాడ, గుంటూరు మార్గంలో ప్రస్తుతం రోజుకు నడుస్తున్న రైళ్ల సంఖ్య ఐదే. వాటిలోనూ రెండు రైళ్లు ఉదయం నడిచేవి కావడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉండడం లేదు. మధ్యాహ్నం పైన నడుస్తున్న రైళ్లలో నారాయణాద్రి, మచిలీపట్నం, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకైతే సాధారణ రోజుల్లోనే వందల్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు వస్తున్నాయి. ప్రస్తుత వేసవి రద్దీల్లో ఆ వెయిటింగ్ లిస్ట్‌కు అవధులే లేవు. నెల రోజుల వ్యవధిలో ప్రయాణాలు చేసుకోవాలన్నా టికెట్లు మంజూరు కాని పరిస్థితులు ఉన్నాయంటే రద్దీ, డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని అధికారులు ఇక.. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా కాకినాడకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అయితే జనరల్ బోగీల్లో కూడా సీట్లు దొరకవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారంలో రెండు రోజులు బుధ, శనివారాల్లో రాత్రి 10–30 గంటలకు తిరుపతిలో బయల్దేరి విజయవాడ మీదుగా కరీంనగర్ వరకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలన్న డిమాండ్‌కు అధికా రుల నుంచి స్పందన కరువవుతోంది. ఈ రైలు జిల్లా వాసులకే కాకుండా నెల్లూరు, ప్రకాశం పజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైలును డైలీగా మార్పు చేయాలన్న ప్రతిపాదనలు ఢిల్లీకి వెళ్లినా స్పందన కరువైంది. రాత్రి 8–30 దాటితే లేనే లేవు.. ప్రస్తుతం తిరుపతి నుంచి రాత్రి 8–30 గంటలు దాటితే మరుసటి రోజు వేకువజామున 3–30 గంటల వరకు విజయవాడకు రైళ్లే లేవు. గుంటూరుకు అర్ధరాత్రి 12–30 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉన్నప్పటికీ అది కేరళ నుంచి నడుస్తున్న కారణంగా బెర్తులు ఉండక మూడు జిల్లాల వాసులు నరకయాతన పడుతున్నారు. దీంతో వేలాది మంది ప్రజలు వివిధ అధికారిక పనుల నిమిత్తం రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీటన్నింటినీ ఆసరాగా చేసుకుని తిరుపతిలోని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు, టూర్ ఆపరేటింగ్ నిర్వాహకులు అయినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయంలో ‘సువిధ’ రైళ్ల టికెట్ల ధరలను మించి ధరలు నిర్ణయిస్తూ అవస్థల పాలు చేస్తున్నారు. వేసవి సెలవుల ముగింపు రద్దీకైనా అదనపు రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మరోసారి చిన్నచూపు
రాజంపేట: తిరుపతి–మచిలీపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదనను రైల్వే అధికారులు తుంగలో తొక్కారు. ఇప్పటికే జిల్లా మీదుగా ధర్మవరం నుంచి విజయవాడకు తిరిగే రైలును ఎర్రగుంట్ల–నంద్యాల మార్గంలో నడుపుతున్నారు. అయితే జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి రైలులేదు. దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించడం వల్ల కనెక్టటివిటీకి నోచుకుంటుందని దక్షిణమధ్య రైల్వేఅధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. కడప వరకు పొడిగింపు చేసే రైళ్ల ప్రతిపాదనలో ఉన్న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను దారిమళ్లించడంతో మరోసారి జిల్లాపై రైల్వేమంత్రిత్వశాఖ చిన్నచూపు చూసిందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. రైలు పొడిగింపు ప్రతిపాదన ఇలా.. గతంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజరుగా పనిచేసిన స్టాన్లీబాబు తిరుపతి–మచిలీపట్నం మధ్య నడుస్తున్న రైలును కడప వరకు పొడిగించడం వల్ల సర్కారు ప్రాంతాలకు కనెక్టటివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిపాదనను తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, అనంతరం వచ్చిన జీఎంలు దీనిని ఆటకెక్కించారు. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులు, రైల్వేమంత్రిత్వశాఖకు విన్నవించిన సంగతి విధితమే. రైల్వే అధికారులు కడప రైల్వేస్టేషన్లో స్థలసమస్యను బూచిగా చూపుతున్నట్లు విమర్శలున్నాయి. రైళ్లను స్టేబుల్ చేసుకునేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయనే భావనను తెరపైకి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ను భాకరాపేటకు మార్చడంతో ఆ ప్రాంతం కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది.ఈ స్థలం యార్డుగా ఉపయోగించుకొని అదనంగా రెండులైన్లను నిర్మితం చేసుకోగలగితే పొడిగింపు రైళ్లను స్టేబుల్ చేసుకునేందుకు వీలుంటుందని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధర్మవరం వరకు మచిలీపట్నం రైలు పొడిగింపు మచిలిపట్నం–తిరుపతి (17401) మధ్య నడిచే రైలును కడపవరకు పొడిగించి రాజధానికి కనెక్టటివిటీ కలుగుతుందనే జిల్లా వాసుల ఆశలను అధికారులు నీరుగార్చారు. మచిలీపట్నం నుంచి తిరుపతికి తెల్లవారుజామున 4.30గంటలకు చేరుకుని, తిరిగి రాత్రి 7.30కి మచిలీపట్నం వెళుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేక్(ఫార్మసిన్)ఖాళీగా తిరుపతిలో ఉంటుంది. దీంతో కడప వరకు పొడగింపు చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పి ఈనెల1న నుంచి రైలును తిరుపతి నుంచి ధర్మవరం వరకు (07401, 07402 నంబర్లతో పొడిగించారు. -
స్తంభించిన రైలు రవాణా
-
స్తంభించిన రైలు రవాణా
- భారీ వర్షాలతో గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ - నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం - ఏడు చోట్ల ట్రాక్‌లపైకి నీళ్లు.. రైల్వే లైన్‌కు గండ్లు - పలు రైళ్ల రద్దు.. కాజీపేట, గుంతకల్ మీదుగా కొన్ని మళ్లింపు - ఇంటర్ లాకింగ్ ఆధునీకరణతో ఇప్పటికే విజయవాడ వైపు రైళ్ల నియంత్రణ సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్తంభించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో హైదరాబాద్-గుంటూరు మధ్య నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల దృష్ట్యా ఒకవైపు రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతుండగా.. తాజాగా గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో గురువా రం ఒక్కరోజే 40కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మార్గంలో చాలాప్రాంతాల్లో వరదనీరు పట్టాల మీదుగా ప్రవహిస్తుండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 7 చోట్ల రైలు మార్గాలు దెబ్బతిన్నట్టు గుర్తించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేసింది. సత్తెనపల్లి-రెడ్డిగూడెం, రెడ్డిగూడెం-బెల్లంకొండ, బెల్లంకొండ-పిడుగురాళ్ల, పిడుగురాళ్ల-తుమ్మలచెరువు స్టేషన్ల మధ్య ఏడు చోట్ల ట్రాక్ కింద మట్టికొట్టుకుపోయింది. అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను సమీపంలోని స్టేషన్లలో నిలిపేసి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. మిగతా రైళ్లను రద్దు చేసింది. అయితే రైళ్లు రద్దయినట్టు సమాచారం తెలియకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు. పలు రైళ్లు రద్దు.. కొన్ని మళ్లింపు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేయటంతో వాటిల్లోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే వారికి రైల్వే సిబ్బంది భోజనం, మంచినీళ్లను అందించారు. గురువారం నడికుడి మార్గంలో ప్రయాణించాల్సిన సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలు, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్(ఒకవైపు), గుంటూరు-మాచర్ల రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్‌ను మిర్యాలగూడ వరకే నడిపారు. హైదరాబాద్-చెన్నై, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట, విజయవాడ మీదుగా మళ్లించారు. శుక్రవారం పలు రైళ్ల రద్దు.. తాత్కాలికంగా కొన్ని చోట్ల ట్రాక్‌ను పునరుద్ధరించినా వాన తెరిపినివ్వకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో శుక్రవారం కూడా పలు రైళ్లను రద్దు చేసి మిగతావాటిని దారి మళ్లించారు. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేశారు. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-గుంటూరు డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, సికింద్రాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, మాచర్ల-భీమవరం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-మాచెర్ల ప్యాసింజర్, మాచెర్ల-నడికుడి ప్యాసింజర్, కాచిగూడ-మిర్యాలగూడ ప్యాసింజర్ రెండు వైపులా, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ రెండు వైపులా, మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్, గుంటూరు-మాచర్ల, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. గుంటూరు-సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా ట్రిప్పులను, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను విజయవాడ బల్బ్ క్యాబిన్ స్టేషన్, కాజీపేట మీదుగా, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లను గుంతకల్ స్టేషన్ మార్గం మీదుగా మళ్లించారు. తిరువనంతపురం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను రేణిగుంట, తిరుపతి, గుంతకల్ మార్గం గుండా మళ్లించారు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ► గుంటూరు స్టేషన్: 9701379072, 0863-2222014 ► గుంటూరు సెంట్రల్ కంట్రోల్: 9701379073, 1072 ► మిర్యాలగూడ రైల్వే స్టేషన్: 7093998715 ► విజయవాడ రైల్వే స్టేషన్: 0866-2575038 ► సికింద్రాబాద్ స్టేషన్: 27700868, 27786170, 27786539 అనుక్షణం అప్రమత్త్తం భారీ వర్షాలతో పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. నడికుడి మార్గంలో 7 చోట్ల రైల్వేలైన్‌కు గండ్లు పడటంతో అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను స్టేషన్లలో నిలిపివేయటంతోపాటు మిగతా వాటిని రద్దుచేసి కొన్నింటిని దారిమళ్లించాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా భోజన, మంచినీటి సదుపాయం కల్పించాం. ట్రాక్ పునరుద్ధరణకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. - జీఎం రవీంద్రగుప్తా -
భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు
గుంటూరు : జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వివిధ రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. గుంటూరు - మాచర్ల - గుంటూరు ప్యాసింజర్ రద్దు నడికుడి - మాచర్ల - నడికుడి ప్యాసింజర్ రద్దు సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు. ఆదిలాబాద్ - తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు రేపల్లె - సికింద్రాబాద్ - రేపల్లె ప్యాసింజర్ రద్దు తిరువనంతపురం - హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు తిరువనంతపురం - గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు హైదరాబాద్ - తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు -
నేటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
విజయవాడ (రైల్వేస్టేషన్): విజయవాడ - విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి రైల్వే పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని రైల్వేస్టేషన్లో కాపు గర్జన సందర్భంగా చేపట్టిన ఆందోళనలో రత్నాచల్ దగ్ధమైన విషయం తెలిసిందే. గతంలో 24 బోగీలతో నడిచిన రత్నాచల్‌ను ప్రస్తుతం బోగీల కొరత కారణంగా 17 బోగీలతో నడపనున్నట్లు పీఆర్వో పేర్కొన్నారు. ఏసీ చైర్ కార్, రిజర్వుడ్ చైర్‌కార్, నాన్ రిజర్వుడ్, ప్యాంట్రీకార్ సహా మొత్తం 17 బోగీలతో నడుపుతున్నామని తెలిపారు. వాటిలో రిజర్వ్డ్ సిట్టింగ్ 8 బోగీలు, నాన్ రిజర్వ్డ్ సిట్టింగ్ 4, ఏసీ చైర్ కార్ 2, ఎస్ఎల్ఆర్ 2, ప్యాంట్రీ కారుతో కలిపి మొత్తం 17 బోగీలతో దీనిని నడపనున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి ఉండే ఈ సర్వీసుకు బోగీలు కుదించటంపై పలువురు విమర్శిస్తున్నారు. 24 బోగీలతో రైలు సర్వీసును నడపాలని కోరుతున్నారు. -
విశాఖకు రైళ్లు ఇప్పట్లో కష్టమే
తాడేపల్లిగూడెం : విశాఖపట్నం వైపు నాలుగైదు రోజుల వరకు రైళ్లు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. హుదూద్ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో రైళ్లను పునరుద్ధరించలేకపోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్, విద్యుత్ పునరుద్ధరణ తదితర పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో రద్దు చేసిన రైళ్లను ఇప్పట్లో పునరుద్ధరించడం కష్టమని పేర్కొన్నారు. ట్రాక్, స్టేషన్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్థితిగతులపై విశ్లేషణ చేశామని, రైళ్లను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ఆదివారం రాత్రి నుంచి గ్యాంగ్ వర్కర్లు, ఇంజినీర్ల పర్యవేక్షణలో ట్రాక్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో వీచిన బలమైన గాలులకు విశాఖ ప్రాంతంలో రైల్వే సమాచార వ్యవస్థ మొత్తం దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగారుు. స్టేషన్లలో నిర్మాణాలు సైతం కూలాయి. నర్సీపట్నం వద్ద ట్రాక్ దెబ్బతినగా, మిగిలిన ప్రాం తాల్లో ట్రాక్‌పై రాళ్లు, ఇతర సామగ్రి పడి ఉండటాన్ని గ్యాంగ్ వర్కర్స్, ఇంజినీర్లు గుర్తించారు. కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థకు విద్యుత్ సరఫరా నిలిచిపోరుునట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల పునరుద్ధరణకు అవకాశం లేకుండాపోరుుందని రైల్వే జీఎం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తికావడానికి కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఇవే సోమవారం ఉదయం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలు రాజమండ్రి వరకే నడచింది. కాకినాడ టౌన్-షిర్డీ సాయినగర్, కాకినాడ టౌన్-లోకమాన్య తిలక్ టెర్మినస్, గౌతమి ఎక్స్‌ప్రెస్ యథావిధిగా నడుస్తున్నాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకు, విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకు మాత్రమే నడుస్తున్నాయని, కాకినాడ తిరుపతి పాసింజర్ రైతు యథావిధిగా నడుస్తోందని తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ మేనే జర్ కె.నాగభూషణం తెలిపారు.