విశాఖకు రైళ్లు ఇప్పట్లో కష్టమే
తాడేపల్లిగూడెం : విశాఖపట్నం వైపు నాలుగైదు రోజుల వరకు రైళ్లు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. హుదూద్ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో రైళ్లను పునరుద్ధరించలేకపోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్, విద్యుత్ పునరుద్ధరణ తదితర పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో రద్దు చేసిన రైళ్లను ఇప్పట్లో పునరుద్ధరించడం కష్టమని పేర్కొన్నారు. ట్రాక్, స్టేషన్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్థితిగతులపై విశ్లేషణ చేశామని, రైళ్లను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని తెలిపారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
ఆదివారం రాత్రి నుంచి గ్యాంగ్ వర్కర్లు, ఇంజినీర్ల పర్యవేక్షణలో ట్రాక్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో వీచిన బలమైన గాలులకు విశాఖ ప్రాంతంలో రైల్వే సమాచార వ్యవస్థ మొత్తం దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగారుు. స్టేషన్లలో నిర్మాణాలు సైతం కూలాయి. నర్సీపట్నం వద్ద ట్రాక్ దెబ్బతినగా, మిగిలిన ప్రాం తాల్లో ట్రాక్‌పై రాళ్లు, ఇతర సామగ్రి పడి ఉండటాన్ని గ్యాంగ్ వర్కర్స్, ఇంజినీర్లు గుర్తించారు. కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థకు విద్యుత్ సరఫరా నిలిచిపోరుునట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల పునరుద్ధరణకు అవకాశం లేకుండాపోరుుందని రైల్వే జీఎం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తికావడానికి కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు ఇవే
సోమవారం ఉదయం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలు రాజమండ్రి వరకే నడచింది. కాకినాడ టౌన్-షిర్డీ సాయినగర్, కాకినాడ టౌన్-లోకమాన్య తిలక్ టెర్మినస్, గౌతమి ఎక్స్‌ప్రెస్ యథావిధిగా నడుస్తున్నాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకు, విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకు మాత్రమే నడుస్తున్నాయని, కాకినాడ తిరుపతి పాసింజర్ రైతు యథావిధిగా నడుస్తోందని తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ మేనే జర్ కె.నాగభూషణం తెలిపారు.