
సాక్షి, హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్, మియాపూర్ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయన్నారు. కాగా మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సరాసరిన లక్ష మంది రాకపోకలు సాగిస్తుండగా.. ఆదివారం ఇతర సెలవు దినాలలో మాత్రం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.