
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో తాజాగా లండన్‌కు చెందిన ఐసీఈ సంస్థ ప్రదానం చేసే పీపుల్స్ చాయిస్ అవార్డు సాధించేందుకు కేవలం 2 వేల ఓట్ల దూరంలో గ్రేటర్ మెట్రో నిలిచినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఈ అవార్డు రేసులో నగర మెట్రో ప్రాజెక్టుతో న్యూజిలాండ్‌లోని మరో భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు పోటీపడుతోందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఓటు వేసేందుకు https://www.ice. org.uk/what&is&civil&engineering/what&do&civil&engineers&do/hyderabad&metro&rail&project లింక్‌ను క్లిక్ చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు.